కథ

అరచేతి చాటు సూర్యుడు

ఆగస్ట్ 2014


అరచేతి చాటు సూర్యుడు

“ఆ ఫైల్ పని పెండింగ్ ఉండిపోయిందన్నారు కదా. నేను ఖాళీగానే ఉన్నాను సార్. చేసెయ్యనా?!” దివాకర్ అడిగాడు.

నాకు అతని ప్రశ్న ఆనందం కలిగించడానికి బదులుగా చికాకు కలిగించింది. పైకి నా ముఖ కవళికల్లో మార్పు కలిగించకుండా, “థ్యాంక్స్ దివాకర్!” అంటూ పెండింగ్ ఫైల్ అతని చేతికి అందించాను.

అగ్నికి ఆజ్యం తోడవ్వడం అంటే ఏమిటో నాకు స్వయంగా ఈ మధ్యనే అనుభవం అవుతోంది.

నేను మా ఆఫీసులో గుమాస్తాగా చేరి ఏడేళ్ళు కావస్తోంది. అంతో ఇంతో బాగానే పని చేస్తాడన్న పేరు కూడా సంపాదించుకున్నాను. కానీ అందరిలాగే నాకు కూడా జూనియర్ ఆఫీసర్ కావాలనే కోరిక కూడా ప్రబలంగా ఉంది. రెండేళ్ళ సర్వీసు…
పూర్తిగా »

మేస్ట్రుబాబు మరినేరు!

మేస్ట్రుబాబు మరినేరు!

బరినికాన ఎంకట లచ్చాపాతుర్డు గోరు సనిపోనారు. నిన్నగాకమొన్ననే పట్నంలో పేనాలొగ్గీనారు. పెపంచికానికి దూరవైపోనారు.

‘‘లచ్చాపాతుర్డుగోరనే ఏటి.. కాలం తీరిపోతే వొవులైనా పోతారు.. రోజుకీ నక్షలమందిరి పుడ్డం నేదా.. పోడం నేదా.. ఈయనేం పైనించి దిగొచ్చినాడేటి.. అందర్నాగానే కిందినించి పైకెల్లీవోడో కదేటి..’’ ఈ మాదిరీగా మనం పాతుర్డుగోరి ఇసయంలో మాతరం అనీస్కోనేము. అదే మరి వచ్చింసిక్కు.
పాతుర్డుగోరేటి మామూలు మనిసేటి. గొప్ప తగ్నుమనిసి. సేనా మంచిమనిసి. కల్మసం తెలీని మనిసి. సమానింగా బగ్నమంతుడికీ ఈ బాబుకీ ఎంట్రుక ముక్కంత వోరాయే ఉంతాది. అదీ నేపోతే ఈయనగోరు పరమాత్ముడైపోను. ఆ బాబు మావూరోరేనని సెప్పుకుంతే మాకే కాదు. మా అర్జాపురం గ్రేమం ఇరుపంచాలా ఉన్న మేడివోడ, దొండపూడి,…
పూర్తిగా »

విముక్త

విముక్త

“మామ్మగారూ! ఇంక నేను బతకడం వృధా ” అంటూ ఒక్కసారిగా ఆవిణ్ణి పట్టుకుని వల వలా ఏడ్చేశాను. ఆ క్షణంలో నాకు పరిసరాలన్నిటా నా ‘బంగా’రుకొండ, ముద్దుగా ‘బంగా’ అని మేమిద్దరం పిలుచుకునే మూడేళ్ళ బుజ్జిబాబు తప్ప ఇంకేమీ కనిపించడం మానేసింది. నేనేం చేస్తున్నానో అర్ధం కాని ఒక అయోమయం … అనుక్షణం నా కొంగు పట్టుకుని తిరుగుతూ బూరెబుగ్గలతో ముద్దులొలికిపోయే బంగా, కనిపించకుండా పోయి నాలుగ్గంటలు దాటిపోయింది. వీధి చివరి కిరాణా షాపు కెళ్లి, అక్కడున్న కూరగాయల బండి దగ్గర కూరలకోసం ఆగినప్పుడు నా కొంగు పట్టుకు నిలుచున్న బంగా అలా ఎలా మాయం అయ్యాడో నాకు అర్ధం కావడం లేదు. ఎవరో కావాలని…
పూర్తిగా »

చందమామోళ్ళవ్వ

జూలై 2014


చందమామోళ్ళవ్వ

సాయంకాలం స్కూలు నుండి ఇంటికి వచ్చేటప్పటికి అమ్మమ్మ అరుగెక్కి సన్నజాజి కొమ్మని వంచి పట్టుకుని మొగ్గలు కోస్తంది. పుస్తకాల సంచిని అరుగు మీద పారేసి “నేను కోస్తా అమ్మమ్మా! నేను కోస్తా!” అంటా రెండు పూలు కోసి ఇచ్చాను. అప్పటికే కింద పూలన్నీ కోసేసింది.

“అమ్మమ్మా! గోడెక్కి పైనున్న పూలు గూడా కోసేదా?” అన్నాను.

“ఆఁ ఎక్కు కాళ్ళు యిరుగుతాయి” అంటా గోడ మీద పెట్టిన పూల గిన్నె తీసుకుని అరుగు దిగింది. కిందే నిలబడి మమ్మల్ని చూస్తన్న మా అక్కాయిని వాటేసుకోని “అప్పుడు నీకు కుంటి పెళ్ళాం వచ్చిద్ది నా బంగారు మనవరాలికి రాజకుమారుడు వస్తాడు” అంది.

నాకు అప్పటికి ఏడేళ్ళు గూడా…
పూర్తిగా »

స్త్రీ

స్త్రీ

కొద్ది కాలం క్రిందట మేము అమ్మమ్మ గారి వూరికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. మా తాతగారితో పిల్లలందరికీ బాగా చనువు, నేను ఆయనకు మొదటి మనుమరాల్నికావడంతో నన్ను బాగా ముద్దు చేసేవారు. సమయం దొరికితే చాలు ఆయన్ని కథలు చెప్పమని వేధించేవాళ్ళం. చాలా చిన్నప్పుడు పేదరాసి పెద్దమ్మ కథలు; తర్వాత సింద్ బాద్, ఆలీబాబా కథలు, చరిత్రలోని గొప్పవాళ్ళ గురించి చెప్పేవారు.వాళ్ళ జీవిత చరిత్రలు చదివి మాకు వినిపించేవారు. సెలవుల్లో మేము,మా చిన్నమ్మ,మామయ్యల పిల్లలు అందరం కలిసి మెలిసి, ఆటలు, పాటలు, అల్లర్ల తో గడిపే వాళ్లము.తాతయ్య చాలా పనిలో తలమునకలై వుండేవారు. మూడు ఊర్లకు ప్రెసిడెంట్ గా ఎప్పుడూ వచ్చేపోయే జనాలతో తాతయ్య…
పూర్తిగా »

డెడ్ మేన్ పేరడాక్స్

డెడ్ మేన్ పేరడాక్స్


పత్రికలలో వచ్చిన వార్తలు ఏమయినాగానీ, సత్యాది ఆత్మహత్యకాదు అని నేననుకోవడానికి బలవత్తరమైన కారణాలున్నాయి. అందులో మొదటిది, నా యాభయ్యేళ్ల సాన్నిహిత్యంలో వాడిదగ్గర పిరికితనం నాకు కనిపించకపోవడం. పులి మీదకు దూకితే వాడేంచేసేవాడో తెలియదుగానీ, వెన్నుమాత్రం చూపించడని నేను కరాఖండీగా చెప్పగలగడానికి ఒక కారణం నేను పక్కనున్నప్పుడు జరిగిన ఒక సంఘటన. న్యూయార్క్ సబ్వేలో ఒక నల్లవాడు తుపాకీని వాడి నడుముకానించి వాలెట్ని ఇమ్మన్నప్పుడు, ప్రశాంతంగా దాన్నివ్వడమేకాక, “డబ్బులు తీసుకుని, వాలెట్ నాకు తిరిగిచ్చెయ్, అందులో డ్రైవర్స్ లైసెన్స్ కావాలి, అది లేకపోతే ఆ మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంటుకి వెళ్లడం కోసం అనవసరంగా ఒక వర్క్ రోజు వేస్ట్ చెయ్యాలి,” అని…
పూర్తిగా »

అద్దం

ఏప్రిల్ 2014


అద్దం

“అక్కా..నీళ్లోసుకున్నానే !!” చెల్లెలు, తను అంట్లు తోమే బామ్మగారింటికి ఫోన్ చేసి చెప్పిన మాటకి సావిత్రి ఎంతో సంబరపడిపోయింది. షావుకారు కొట్టుకి వెళ్లి ఇన్ని సగ్గుబియ్యం, కాస్త పంచదార తెచ్చి కొంచెం పాయసం చేసి మొగుడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

తమ్ముడు పుట్టిన కొద్ది రోజులకే సావిత్రి తల్లి అదేదో నోరు తిరగని పేరున్న రోగం తో చచ్చిపోయింది . మందులు కూడా కొనలేని తమ బీదతనం వల్ల తల్లి చివర్రోజుల్లో నరకాన్ని అనుభవించడం సావిత్రి కి తెలుసు. తల్లి పోయిన రెండు నెలలకే బాగా తాగేసి తిరుగుతున్న తండ్రి ని లారీ గుద్దేసింది. అప్పట్నుంచి తాము ముగ్గురు అక్కడా ఇక్కడా ఉంటూ పాచి…
పూర్తిగా »

అర్ధం కాని వింత కథ ..

ఏప్రిల్ 2014


అర్ధం కాని వింత కథ ..

“ఆవ పెట్టిన ఆనపకాయ కూర, దోసకాయ పప్పు , పులుసు పెట్టమని చెప్పి వచ్చాను ” వెళ్ళాలి  అంటూ లొట్టలేసుకుంటూ భోజనానికి బయలుదేరాడు మూర్తి. లంచ్  టైమ్  కావడంతో నాకూ ఆకలి దంచేస్తున్నా ఈ ఒక్క స్టేట్మెంట్ చదివి  వెళదాం అని కూర్చున్నాను కుర్చీ కి అతుక్కుని మరీనూ.

అయినా  ఈ మూర్తి ఏమిటీ ? రోజూ ఫలానా వంట చేయమని చెప్పి వచ్చాను అంటాడు,  అదేమిటి ? తనకి తోచినదేదో వండే స్వాతంత్ర్యం కూడా మూర్తి భార్య కి లేదా ఏమిటి ?

నాకు అన్నీ వింత గానే తోస్తాయి.

రోజుకి ఒక ఆపిల్ తింటే వైద్యుని కి దూరం గా ఉండ వచ్చు…
పూర్తిగా »

ఒక ప్రయాణం..

మార్చి 2014


ఒక ప్రయాణం..

ఈరోజు చాలా ఆనందంగా ఉంది.. నా బాధ్యతను నేను సరిగా నిర్వహించానన్న ఆనందమో.. లేక నేను గెలిచానన్న గర్వమో అర్థం కాలేదు.. సెలవు పూర్తయ్యాక ఆఫీసుకు ఇదే మొదటిరోజు.. బస్సు ఎక్కాను.. మనసు ఏదో పాత జ్ఞాపకాలను తోడుతూ ఉంది…

జీవితమే ఒక ప్రయాణం.. ఈ మాట చాలాసార్లు వినుంటాం. కానీ ప్రయాణమే ఒక్కోసారి జీవితాన్ని రుచి చూపిస్తుంది. మన జీవిత కాలంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం.  అక్కడ ఎందరో పరిచయమూ అవుతారు.  కానీ అందరూ గుర్తుండరు. కొందరే ఎప్పటికీ గుర్తుండిపోతారు…! అందుకు పెద్ద సంఘటనలే అవసరమవకపోవచ్చు.. వాళ్లు చెప్పే ఒక మాట మనసును తాకడమో.. ఆలోచన రేకెత్తించడమో చేస్తాయి.. అవే వారిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా…
పూర్తిగా »

సాఫ్ట్ వేర్ ఇంజనీర్

సాఫ్ట్ వేర్ ఇంజనీర్

ఆది విజయవాడ రైల్వే స్టేషన్ , ప్ల్యాట్‌ఫార్మ్ రెండు పై బెంగుళూరు వెళ్లే ట్రైన్ కోసం ఫ్యామిలీ తో సహా ఎదురు చూస్తూ వున్నాడు అనంతు. ఇంకా కొంచెం మనీ తీసి కొడుకు పాకెట్ లో పెట్టాడు తండ్రి తిరుమల రావు. “నా దగ్గర వున్నది సరిపోతుంది కదా” అన్నాడు తండ్రి తో. “కొత్త ఉద్యోగం, కొత్త ఊరు,కొత్త మనుషులు, అవసరాలు ఎలా ఉంటాయో తెలీదు కదా, వుంచుకో ” అంది ఆప్యాయం గా తల్లి సులోచన. అనంతు ఈ సంవత్సరమే సిద్దార్ద ఇంజినియరింగ్ కాలేజ్ లో ఇంజినియరింగ్ పూర్తి చేసాడు. క్యాంపస్ సెలెక్షన్ లో బెంగుళూరు లో ఉన్న ఒక మల్టీ నేషన్ కంపనీ…
పూర్తిగా »