కథ

నిర్జీవగీతం

ఏప్రిల్ 2013


మైదుకూరు వదిలి బస్సు కడప దారి పట్టింది. నెమ్మదిగా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. కలెక్టర్ ఆఫీసు లో పని ఇవాళే పని అవుతుందో, రెండు రోజులు పడుతుందో తెలీదు. నిజానికి నేను నిన్ననే వచ్చాను బెంగుళురు నుంచి. పని పూర్తయితే ఈ రోజు రాత్రికే తిరిగి బయలు దేరాలి !బహుశా మరో గంట పడుతుందేమో కడప చేరడానికి.

వెనక్కు పోతున్న కొండల్ని, ఎండి నెర్రెలు విచ్చిన పంట పొలాలను చూస్తూ “ఎటు చూసినా కరువు” అనుకుంటూ నిట్టూర్చాను. బస్సు నిండుగా ప్రయాణీకులున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ కావడం వల్ల చుట్టు పక్కల వూళ్ల వాళ్లు పొద్దున్నే కడపకు వెళ్ళి పనులు చూసుకుని సాయంత్రాలకు ఇళ్ళు చేరడం మామూలే!…
పూర్తిగా »

బినామి

మార్చి 2013


బినామి

ఆరోజే మద్దిరావమ్మ సంబరం.

పొరుగూళ్ల నుంచి వచ్చిన చుట్టాలతో నిండిపోయి ఊళ్లో యిళ్లన్నీ విరగకాసిన వేరుశెనగగుత్తుల్లా ఉన్నాయి. పెరళ్లలో పూలతోటలన్నీ కళ్లింతలు చేసుకుని సంబరం చూడడానికి వీధిగుమ్మాల్లో పొందిగ్గా కూచున్నట్టు రంగురంగుల ముగ్గులు.
వాళ్లమ్మతో పాటు చీకట్నే నిద్రలేచి పొదీషనుగా తలంటుస్నానం చేసేసింది బుజ్జి. తల తుడుస్తుంటే చారుమతి నడుంచుట్టూ చుట్టి తలెత్తి మొహంలోకి చూస్తూ ” అమా.. అమా.. ఇవ్వాళ కూడా మనిద్దరమేనా?..మనింటికెవరూ రారా…?!” దిగులుగా అడిగింది. చారుమతి విననట్లుగా మొహం పెట్టి తల తుడిచిన పాత చీరను గట్టిగా దులిపి తీగ మీద ఆరేస్తూ “జుట్టిరబోసుకుని బైటకు వెళ్లమాకు. తలారేవరకూ వరండాలో నిల్చో” అంది.
బుజ్జికి కోపం వచ్చింది.

నడుస్తుంటే…
పూర్తిగా »

వికసించిన పువ్వు

మార్చి 2013


వికసించిన పువ్వు

అప్పుడే వర్షం పడిందేమో ఆకులన్నీ తడితడిగా పచ్చగా మెరుస్తున్నాయ్. వర్షం బరువుకు వాలిన గులాబీ నుండి నీటిచుక్క నేలమీదకు జారుతో౦ది. చూరు నుండి నీళ్ళు ధారగా పడుతున్న చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. ఉండుండి వీస్తున్న గాలికి మేపల్ ఆకులు మెల్లగా కదులుతున్నాయ్. మేఘాల మాటునున్న సూరీడు ఒక్కో కిరణాన్ని గురిచూసి పంపుతున్నట్లుగా ఏటవాలుగా పడుతోంది నీరెండ. వర్షం వెలిసిన తరువాత మాత్రమే కనిపించే అరుదైన వెలుగుతో మెరిసిపోతోందా ప్రదేశం. కిటికీలోంచి ఆ సౌందర్యాన్ని చూస్తూ టీ తాగుతోంది రాధిక.

“వెదర్ చాలా బావుంది కదూ” ఎప్పుడొచ్చాడో ఆమె వెనుక నిలబడి వున్నాడు మోహన్.

చిన్నగా నవ్వింది. “కాసేపలా బయట కూర్చుందామా?”

తలుపు తెరిచి బయటకు రాగానే…
పూర్తిగా »

అసమర్థుని ప్రేమయాత్ర

అసమర్థుని ప్రేమయాత్ర

ఆమె చనిపోయింది.

అవును అంతే…! ఆమె చనిపోయింది… ఆ చిన్న వాక్యంలోనే గూడుకట్టుకోని వుంది నా విషాదమంతా. పన్నెండేళ్ళ సావాసానికి, ప్రేమకి చరమగీతం పాడేసి వెళ్ళిపోయింది గీత. వెన్నలలో తడిసిన మా మనసుల తడి ఆరకముందే చీకటైపోయింది. నా చెవిలో గుసగుసగా చెప్పిన రహస్యాలకి అర్థం నేను తెలుసుకునేలోపే తనే ఒక రహస్యమైపోయింది.

నేను అలాగే నిలబడి చూస్తున్నాను.

ఇప్పుడు నా ఎదురుగా వున్నది ఒకప్పుడు నేను చూసిన గీత కాదు. అప్పుడు నేను మొదటిసారి చూసినప్పుడు కళ్ళ కింద ఆ నల్లటి చారలు లేవు, మందు తాగి తాగి ఉబ్బిపోయిన కళ్ళు లేవు, సిగెరెట్లతో నల్లబడ్డ పెదాలు లేవు. అప్పట్లో ఆమె ముఖంలో ఈ…
పూర్తిగా »

హోమ్ రన్

ఫిబ్రవరి 2013


హోమ్ రన్

“ ఇవాళ గేమ్ వుంది తెలుసుగా. తొందరగా తయారవు. ఏం తింటావు?”

స్కూల్  నుంచి అప్పుడే వచ్చిన క్రిస్  కి గబ గబా చెప్పేస్తోంది సుచిత్ర.

“ ఐ నో.ఐ నో మామ్. “ గట్టిగా అరిచినట్లు తల్లి కి  చెప్పేసి గేమ్ కి రెడీ అయ్యేందుకు తన రూమ్ లోకి వెళ్లిపోయాడు.

ఆ గొంతు తో క్రిస్  మాట్లాడితే వీపు మీద ఒక్క దెబ్బ ఇవ్వాలనిపిస్తుంది సుచిత్ర కి. కానీ గేమ్ ముందు వాడి మూడ్,తన మూడ్ రెండు చెడగొట్టుకోవటం ఆమెకు ఇష్టం లేదు. ఇవాళైనా తాను అనుకున్నది జరిగితే బావుండు అనుకుంటూ గోడ మీద వున్న ఇష్ట దైవం…
పూర్తిగా »

ఆవు-పులి…2013

ఫిబ్రవరి 2013


ఆవు-పులి…2013

విశాలమైన గడ్డి బీడు లో ఆదమరచిపోయి మరీ మేస్తోంది ఆవు.

అప్పుటికే బీడంతా అనేకసార్లు కలియతిరిగిన పాలేరు రంగడు ఆవు దగ్గరకి చేరుకున్నాడు.

దానికి భయమనిపించకుండా, సుతారాంగా తట్టి, గంగడోలు రాస్తూ అనునయంగా చెప్పడం మొదలు పెట్టాడు.

వాడి వయస్సు ఇంచుమించు పదహారేళ్ళు ఉంటుంది. ఎనిమిదో తరగతి వరకూ చదివాక, తండ్రి బలవంతం మేరకు చదువాపేసి ఆ ఊరి-పెద్ద చంద్రయ్య ఇంటిలో పాలేరు గా చేరిపోయాడు. ఆ మాత్రం చదువుకే వాడి నడకలోను, నడతలోనూ పరిణితి వచ్చి అది మాటల్లోను చేతల్లోనూ కనిపిస్తూ ఉంటుంది.

“నీకు తెలియదని కాదు. ఐనా సరే మరోసారి చెబుతున్నా విను…” అని మొదలు పెట్టి, ఆవు…
పూర్తిగా »

రాజా వచ్చేసాడు

“నాకు సిల్కు చొక్కా ఉంది,నీకుందా?” అడిగాడు రామస్వామి.తెలివైన ప్రశ్న.చెల్లయ్యకు ఆ ప్రశ్నకు ఏమని బదులివ్వాలో తెలియక అలా రామస్వామిని చూస్తూ ఉండిపోయాడు.తంబయ్య ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూస్తున్నాడు.మంగమ్మ ముక్కుమీద వేలుంచుకుని,కళ్ళు సగం మూసుకుని అలోచిస్తూ ఉంది.ఈముగ్గురూ ఏమి సమాధానం చెపుతారా అని మిగిలిన పిల్లలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

ఆరోజు బడిలోరామస్వామి,చెల్లయ్యలమధ్య బొమ్మలపోటీ జరిగింది.రామస్వామి తన అయిదో తరగతి చరిత్ర పుస్తకం తీసాడు.చెల్లయ్య దగ్గరేమో ఆపుస్తకం లేదు.దాంతో పౌరశాస్త్ర్రం పుస్తకం తెరిచాడు.ఒకరు ఒకబొమ్మ చూయిస్తే రెండోవాడు దానికి తగ్గబొమ్మను తనపుస్తకంలో చూయించాలి.ఎవరు ఎక్కువ బొమ్మలు చూయిస్తే వారు గెలిచినట్లు.

 

పోటీ సగంలో ఉండగా లెక్కలమాస్టరు క్లాసులోకి వచ్చాడు.ఆయన కోపిష్టి.కాబట్టి ఆయన ఉన్నంతసేపు ఆటలు సాగవు.పైగా పెన్సిల్…
పూర్తిగా »

హైవే

ఫిబ్రవరి 6, 2012, 1.30 am

-” హలో, బహ్దూర్ పురా పోలీస్ స్టేషనా, ఇక్కడ జూ పార్క్ కాడ ఆక్సిడెంట్, స్విఫ్ట్ డిజైర్, హా, 100 స్పీడ్ ల డివైడర్ మీదెక్కి పక్కకున్న బండకు పెట్టింది, ఒక్క డ్రైవర్ తప్ప అందరు చచ్చిపోయిర్రు, 108 కా, హా, సార్, ఫోన్ చేశినం..” ఫిబ్రవరి 5, 2012, 11.30 p.m “నాన్నా తొందరగా, ఫ్లైట్ మిస్ ఔతుంది, బాంబే టు జోహాన్నెస్ బర్గ్ కన్నెక్టింగ్ ఫ్లైట్ ఉదయం ఏడింటికే..ఐనా ఇండియాలో ఎక్కడా దొరకనట్టు సౌతాఫ్రికా దాకా పోవాలా నా పెళ్ళికి, ఏంటో మీ పిచ్చిగానీ, సర్లెండి, కష్టపడండి..” “అవునా సిధ్దు, టికెట్స్ కాన్సిల్ చేద్దామైతే, నీకు…
పూర్తిగా »

చరిత్రహీనులు

జనవరి 2013


ఇంత ఉద్వేగాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు, నేను. ఆవేశం, అసహాయత, ఆత్మ న్యూనత అన్నీ కలసికట్టుగా ఒకే సారి నా మస్తిష్కం లో చొరబడి నా వ్యక్తిత్వాన్నీ, నా అభిమానాన్నీ, గాయపరచి  నడి బజారులో నన్ను నిర్వస్త్రుడిగా చేసి నిలబెట్టినట్టుగా ఒక ఘాటైన భావన. “జానకి ఎందుకిలా చేసింది? ఎలా చెయ్యగలిగింది, నా జానకి?” ఇలా, ప్రశ్నలే తప్ప జవబులివ్వలేని ఉత్తరం నా ఎదురుకుండా పడి ఉంది. ఒకటా, రెండా, ఇరవయ్యేళ్ళ అనుబంధం మా ఇద్దరిదీ. తను క్యాన్సర్ తో  గత  నాలుగేళ్లగా పోరాడుతూ  అంతిమ  క్షణాలలో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉందన్న విషయం కుడా మర్చి పోయేటట్లు చేసింది ఈ ఉత్తరం. ఉదయం,…
పూర్తిగా »