‘ వంశీధర్ రెడ్డి ’ రచనలు

“నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం”- వంశీధర్ రెడ్డి

“నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం”- వంశీధర్ రెడ్డి

కథగా రాయాలనుకున్న అనుభవం ఒక భాషని ఎంచుకుంటుంది. ఆ భాష దొరికేవరకు ఏమీ రాయను. చౌరస్తా, జిందగీ లాంటి కథలు తెలంగాణ మాండలికంలోనే రాయతగ్గవి. వాటికి రూట్స్ మా ఊరి జీవితాల్లో ఉన్నాయ్.
పూర్తిగా »

* M.J *

డిసెంబర్ 2014


* M.J *

నొప్పి కుట్టిన నొప్పికి దోమ కుట్టిన నొప్పి సమాదానం, మరి ప్రశ్నేది, చంపడమేనా.. దోమనా ప్రేమనా.. కళ్లకేదో అపసమ్యక్ దివ్యదృష్టి, పెదాలకంటిన మారిజువానా వాసనరుచి ముక్కుకంటించాకా, చేదు.. చేదుజిగట నలుపు చెంపలు, కాసేపు ట్రాన్స్ సంగీతంలోకి అనభ్యుదయ ప్రయాణం, ఉష్ణబిలంలోంచి పాకుతుంటే చిరిగిన మిధ్యాపాదాలు, నీ ముఖంలో నా ప్రతిబింబం మాంసమై మెత్తగా, టచ్ వుడ్, మేఘపు క్షణాలు తేలుతున్నాయ్ జలుబు చీమిడంటిన పరుప్మీద..
పూర్తిగా »

ఐస్ క్యూబ్

అక్టోబర్ 2014


ఐస్ క్యూబ్

ఎంత మురికైనా నీరు కడిగేస్తుంది, మరి నీటికే మురికైతే? ఆలోచనలు మలినమైనా, మనసు పవిత్రంగా ఉండాలా? మనసు ఆలోచనలూ వేరువేరా? బుధ్ది మనసు ఒకటేనా? వాటికి శుధ్ది మరణమేనా? కాలిపోడమేనా? నేనే ఏదో ఆశిస్తునాను పావనిద్వారా, అందుకే అదెక్కడ దొరక్కుండా పోతుందేమో అన్న భయం కలిగించిన సూడో కన్సర్న్ యే కదా ఇదంతా, సెక్స్ అంత ముఖ్యమా, అదిలేకుండా ఓ ఆడా మగా స్నేహితుల్లా ఉండలేరా, కనీసం అలా ఉండగల నియంత్రణకు లోబడగలరా, ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదోమూల అగ్నిపర్వతం బద్దలవ్వాల్సిందేనా, బాసూ, ఆపుతావా నువ్వూ నీ లూసర్ ఫిలాసఫీ ఉవాఛల వాచాలత, దొరికితే ఏదైనా తిను, లేదా దొరికింది తిను, ఆకల్తో మాత్రం ఛావకు, ఇక్కడ…
పూర్తిగా »

సగంకాలిన సిగరెట్తో – ఓ సాయంత్రపు సంభాషణ

అక్టోబర్ 2014


సగంకాలిన సిగరెట్తో – ఓ సాయంత్రపు సంభాషణ

మేస్టారూ, జీవితానికర్ధముందంటావా?. గురూ, నిన్నే,
నటించింది చాలుగానీ నీకు విన్పించిందన్నాక్తెల్సు, చెప్పు
సగం కాలిన నీకే తెలీదా? అర్ధం లేదుకానీ విలువుంది.
ఇంటిగోడకు వేళ్ళాడదీస్కునే మిస్టిక్ మాడర్న్ ఆర్ట్ పెయింటింగ్లా,
ఫ్రెంచ్ సింబలిస్ట్ “మల్లార్మే” పోయెట్రీలా. అంతూ దరీ అర్ధముండదు, కానీ విలువైంది.
-మరెందుకీ బ్రతుకు? ప్రాణం అస్తిత్వం రెండూ ఒకటేనా!
చరాలకి మాత్రమే ప్రాణముంటుంది, చరాచరాలన్నింటికీ అస్తిత్వముంటుంది.
నాకునేనుగా అస్తిత్వాన్ని కలిగున్నా, ప్రాణం ఉండే ఉంటుందని నమ్ముతున్నా.
(ప్రాణమంటే చైతన్యమే అనుకుని) ఆలోచించలేవు కాబట్టి నీకు నువ్వుగా అస్తిత్వాన్ని కలిగిలేవు,
కానీ నువ్వు నాకు అస్తిత్వాన్ని కలిగున్నావు.
-పార్డన్…
పూర్తిగా »

రెండో రాత్రి

సమాంతర లోకాలనడుమ
పోగొట్టుకున్న కళ్ళనీ, కన్నీళ్ళనీ
చర్మపు గోడనీడన వెతుకుతూ
రక్తపు నాలిక..

అద్దం
పగిలిన నిశ్శబ్దపు కమురువాసనలతో
కాలిన రాబందుల రతి
ఎండిన చెట్టుమీద

సమాధిన బాల్యపు మలంలో
అజీర్ణమైన ఓ అయోమయపు కల
మీద ఇసుక చల్లుతూ
సాయంత్రాకాశపు అసంతృప్త సముద్రం..

అక్షరాలు కప్పుకున్న సీసాలోంచి
శాపగ్రస్థపు బల్లిమూతి
విదిల్చిన నిషిధ్దవాక్యపు
రంగుపువ్వుల చెమట బూడిద..
నోటికో..నుదుటికో..

నేలతవ్విన వెన్నెలల్లో
కాళ్ళు కడుక్కుంటూ
మొండెంలేని కాలం
చెప్పుల్లో చేరని క్షితిజమ్మీద..

చేతివేళ్ళదాకా మెలితిరుగుతున్న
కడుపులో దుఃఖపు నొప్పికి

పూర్తిగా »

పాపం

పాపం

“నారిగా, ఇంకా ఎంతసేపు రా, అర ప్యాక్ సిగరెట్లు బూడిదయ్యాయిప్పటికే, చిక్కడపల్లీ S.V కార్నర్ కేఫ్ కొచ్చెయ్,
హీరోయిన్ దొరికిందా, రాత్రిలోగా షూటింగ్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ఎల్లుండి వరకు ఐపోతేనే మనకు డబ్బులిస్తాట్ట..”

“అన్నా, వొస్తున్నా, పాత హీరోయిన్కి కడుపట, వేరేవాళ్ళను వెతికేసరికి ఇలా, బాబాయ్ ఫోన్చేసాడు నువ్ మొబైల్ ఆన్సర్ చేయట్లేదని, ఫైనాన్స్ వాడు ఇంటికొచ్చి గొడవేసుకున్నాడట, ఇంతకీ హీరోయినెవరో తెలుసా, నీ ఫ్రెండ్ సుధీర్ వైఫ్..సుధీర్ కస్టాల్లో ఉన్నాడని తెల్సుగానీ, మరీ ఇంతా..”

“సర్లే, వొచ్చాక మాట్లాడదాం, లత ముందు ఇవేం వాగకు, కార్లోనే గా, జాగర్తగా డ్రైవ్ చెయ్”
వాడి మాటలతో ఆలోచనలెటు పరిగెడ్తున్నాయో తెలీక సంభాషణని…
పూర్తిగా »

నాన్న చొక్కా

15-మార్చి-2013


నాన్నా
తొందరగా రా
ప్లేట్లో పలావు చల్లబడేట్టుంది
తొందరగా..
వొచ్చేప్పుడు
వీధిమలుపు కొట్లో జంతికలు మర్చిపోకు
కాస్తంత మద్యం తోడుతెచ్చుకున్నాలే

అవును,
అమ్మ పోయినపుడు నేనేడ్చానా
ఆర్నెల్ల వయసుగా..ఏడ్చే ఉంటానేమో
ఏమో
నవ్వైనా ఉండొచ్చు..
నువ్వేడ్చావా నాన్నా
అసలు నువ్వెప్పుడైనా ఏడ్చావా
ఏడిస్తే నిజంగా బాధ తగ్గుతుందా
తొందరగా రా నాన్నా..
బాధ తగ్గుతుందా ఏడిస్తే
నిజంగా..

నువ్వు నన్నెపుడైనా కొడితే ఏడుపంటే తెలిసేదేమో..
దొంగచాటుగా సిగరెట్ కాల్చినపుడో
పక్కింటమ్మాయికి ప్రేమలేఖ రాసినపుడో
పరీక్షలో తప్పి చెప్పకుండా దాచినపుడోపూర్తిగా »

ఎదురుచూపు

22-ఫిబ్రవరి-2013


కోఠి వుమెన్స్ కాలేజ్ బస్ స్టాప్
నడి నెత్తిమీద నిర్ధాక్షిణ్యంగా దూకుతూ మిట్టమధ్యాహ్నపు ఎండ..

నమ్మరుగానీ
ఎదుచూడ్డం పెద్దకష్టమేం కాదు ఓ సారలవాటైతే..
సమయాన్నెలా చంపాలో తెలిసుండడమే అసలు కిటుకు..
ఆమె వొచ్చేదాకా
బస్ షెల్టర్ వెనకున్న కొద్దిజాగాలో
నన్నప్పటిదాకా నిద్రపుచ్చిన నా అతుకుల బొంతను మడతపెట్టి,
సుల్తాన్ బజార్ ప్రసూతి దవాఖానా
వెదజల్లే పచ్చిబొడ్డు మాయ పరిమళాలను తప్పక పీల్చి,
రాత్రి చెత్తతొట్లో పందులతో పోరాడి గెలుచుకున్న
అభ్రకాయితపు చల్లారిన బిర్యానీని గారపళ్ళ పాచినోటికి కుక్కుకొని,
రోడ్డు వారగానో, సుజాతా లా బుక్స్ ముందో కడుపు ఖాలీ చేసుకునిపూర్తిగా »

పాడుబడిన సంధ్య

01-ఫిబ్రవరి-2013


నాకెప్పటికీ సాయంరాని సాయంసంధ్య
పగటిని పగల్దీసి పాయల్జేసి
అంగాలన్నీ ఒక్కోటే నరుక్కుంటూ
చిట్లిపోయి చితికిన నల్లటితునకల్ని కలిపికుట్టింది..

ఆఖరి కిరణం భూమ్మీద నాటుకుని ఓ
చీకటివిత్తనాన్ని మొలిపించగానే, ఎప్పట్లాగే
నాదికాని నా ప్రపంచాన్ని నామీద పాతేసి
సరిహద్దులు దాటిన
మూలశంక మొహమేసుకున్న కాల్చేసిన సిగరెట్ పీకలా
సూర్యుడు..

వెలుగుకీ తమోరేఖకీ నడుమ నటిస్తున్న సంధికాలంలో
నిద్రలేస్తూ అరణ్యాలు,స్మశానాలు, ఉద్యమాలు, వికటపాలోచన్లు..
ఉదయాస్తమయాల్ని నిర్దేశించుకోలేక
కాసేపు భ్రమణమాపి కాస్మోస్ ని పీలుస్తూ భూమి.

రజస్వలించిన రక్తపు దారులేస్తూ
అర్ధగోళాన్నాక్రమిస్తూ చీకటి..
సంధ్యకి అతిమామూలుగా నదిలో నీళ్ళొదిలి
నింగికి…
పూర్తిగా »

హైవే

ఫిబ్రవరి 6, 2012, 1.30 am

-” హలో, బహ్దూర్ పురా పోలీస్ స్టేషనా, ఇక్కడ జూ పార్క్ కాడ ఆక్సిడెంట్, స్విఫ్ట్ డిజైర్, హా, 100 స్పీడ్ ల డివైడర్ మీదెక్కి పక్కకున్న బండకు పెట్టింది, ఒక్క డ్రైవర్ తప్ప అందరు చచ్చిపోయిర్రు, 108 కా, హా, సార్, ఫోన్ చేశినం..” ఫిబ్రవరి 5, 2012, 11.30 p.m “నాన్నా తొందరగా, ఫ్లైట్ మిస్ ఔతుంది, బాంబే టు జోహాన్నెస్ బర్గ్ కన్నెక్టింగ్ ఫ్లైట్ ఉదయం ఏడింటికే..ఐనా ఇండియాలో ఎక్కడా దొరకనట్టు సౌతాఫ్రికా దాకా పోవాలా నా పెళ్ళికి, ఏంటో మీ పిచ్చిగానీ, సర్లెండి, కష్టపడండి..” “అవునా సిధ్దు, టికెట్స్ కాన్సిల్ చేద్దామైతే, నీకు…
పూర్తిగా »