కబుర్లు

హంసిని 2013 అవార్డుల విజేతలు

16-ఏప్రిల్-2013


హంసిని 2013 అవార్డుల విజేతలు

“వాకిలి’ పాఠకులకు సుపరిచిత అక్షర స్వరం మోహనతులసి ఈ ఏడాది మరో అవార్డు గెల్చుకుంది. ప్రతి యేటా ఉగాదికి ప్రకటించే హంసిని అవార్డు తులసికి లభించింది. గత ఏడాది తులసికి ఇస్మాయిల్ అవార్డు కూడా లభించింది.  హంసిని వెబ్ సాహిత్య పత్రిక కవిత్వానికిచ్చే మిగిలిన రెండు బహుమతులు డాక్టర్ గరిమెళ్ళ నారాయణకీ, మామిడి హరికృష్ణకీ లభించాయి. ఈ ముగ్గురు కవుల గురించీ ఇవీ న్యాయనిర్ణేతలు రాసిన వ్యాఖ్యలు:

 “మెలకువ’లో రాసుకున్న ఉద్వేగ వాక్యాలు మోహన తులసి కవితలు

          క్లుప్తతా, తేలిక భాషలో గాఢమయిన భావనల వ్యక్తీకరణా, సరళంగా విచ్చుకునే తాత్విక స్వరం…ఇవీ తులసి కవిత్వాన్ని పట్టిచ్చే మూడు లక్షణాలు. తులసి కవిత్వం ప్రకృతి గురించి పాడినట్టే…
పూర్తిగా »

శివరాత్రి, ఆరిఫ్ గాడూ, నేనూ..!

ఏప్రిల్ 2013


శివరాత్రి, ఆరిఫ్ గాడూ, నేనూ..!

ఇంగ రేప్పొద్దున పండగని తెల్వంగనే మా ఇస్కూలు దోస్తులవందరం కట్ట గట్టుగొని సైన్సు టీచర్ రాకపోయేసరికి కితాబులను సంచిలోకి ఎట్టి కిలాసు గలాసు లేదన్నట్టు కూసోని ప్లాన్ల మీద ప్లాన్లు ఏసుకొని గుండం వాడ అఫ్జలు, అర్షద్, డబ్బకాడి అమ్జదు దుదేకుల అఫ్సరు, కాకతీయ కాలని రవిగాడు, ఆరిఫ్ గాడు, ముడ్డబ్బాల కాడి హరి గాడు, ఇంకా నలుగురవైదుగురం ఒక్క ముచ్చటకొచ్చినం రేపు మాత్రం ఫుల్లుగా శివరాత్రి పండుగను పండగ జేసుకొవాల్నని. ఇంకేవుంది రవి గానికి ఆరిఫ్ గానికి సైకిల్ ఉండనే ఉండే ఇంగ నాకేం రంది ఊరంతా తిప్పి ఆల్లే ఇంట్ల పడగొడ్తారు అనుకొని ఇగ నేను గూడ సై అన్న.

ఆ రోజుకూడా…
పూర్తిగా »

కొత్త సమచ్చరం ఇద్దో ఇట్ట జరిగింది

కొత్త సమచ్చరం ఇద్దో ఇట్ట జరిగింది

గుడ్లింతింత సేస్కోని ….గుండెలు గుబగుబ లాడ్తా వుంటే నాలుగుదిక్కలా సూస్తా….ఓయమ్మో..ఏం సేస్తా వుండారు వీల్లు..అనుకుంటా అందుర్లో బీసురోమని కూచ్చోనుండా.

కొత్త సమచ్చరం … ఆడతా..పాడతా పండగ మాదిరి జరిపితే బాగుంటిందని వేల రూపాయిలు కట్టి టిక్కెట్టు కొనుక్కోని బెంగ్లూర్లో …ఇద్దో ఈడికొచ్చినామా!

లైన్లో నిలబడుకోని వస్తావుంటే … వీల్లు ఆడోల్లేనా అనిపిస్తా వుంది…ఒక్కోర్ని జూస్తావుంటే! యాడో ఆడొక బిడ్డె…ఆడొక బిడ్డె తప్పితే…ఒక్కరన్నా సమంగా గుడ్లేసుకున్నారా!

అవ్వ! ఆడది నాకే గొంతెండక పోతాంది. మొగోల్ల కత ఇంక యేరే జెప్పాల్నా..

సిన్నప్పుడు ఉడుగ్గా ఉందని ఇంట్లో పొడుగు షిమ్మీ యేస్కోంటేనే…మాయమ్మ పొరకెత్తుకుంటావుండె. సంకల కాడ్నించి తొడలకాడికి నల్లగుడ్డలు సుట్టుకోని ఈమాదిరి ఇంతమందిలోకి వొచ్చేస్తే..వాళ్ళమ్మా నాయిన్లు ఏమన్రా?? మొగపిలకాయల్తో…
పూర్తిగా »

ఈ-పుస్తకలోకంలో ఆమె విజయం!

మార్చి 2013


ఈ-పుస్తకలోకంలో ఆమె విజయం!

మహిళ!
ఆకాశంలో సగం!
తెలుగు సాహిత్య రంగంలో సగం !
తెలుగు పాఠకులలో సింహభాగం!
ఇప్పుడు ఈ-పుస్తకంలో వడి వడి అడుగులు!

ఎనభయ్యవ దశకంలో నవలాసాహిత్యంతో పాఠకులను ఉర్రూతలూగించినట్లే, నేటి కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతికతని అందిపుచ్చుకుని సాహిత్యంపై తమ ముద్ర వేస్తున్నారు రచయిత్రులు. తెలుగు సాహిత్యం మీద కూడా ఈ సాంకేతికత ప్రభావం ఉంది. పుస్తక ప్రచురణ రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. తెలుగు పాఠకులకు కూడా ఆధునిక పరికరాలలో చదువుకోగలిగే డిజిటల్ బుక్స్ లేదా ఈ- పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి.

సాంకేతికతతో పాటు అవసరాలు, అవకాశాలు పెరిగాయి. గతంలో ఇంటి నిర్వహణకి మాత్రమే పరిమితమైన స్త్రీలు ఇప్పుడు ఉద్యోగ…
పూర్తిగా »

మా కళ్ళజోడు మాస్టారు పెద్దిభొట్ల!

మా కళ్ళజోడు మాస్టారు పెద్దిభొట్ల!

సాహిత్య ఎకాడమీ అవార్డు ప్రకటించిన  రెండ్రోజులకి మాష్టార్ ని కలిసే అవకాశం వచ్చింది. మద్దాళి నిర్మల గారి కథల సంపుటం మాష్టారు ఆవిష్కరించారు, నేను ఆ పుస్తకాన్ని విశ్లేషించిన వక్తల్లో ఒకణ్ణి.  చాలా రోజుల తర్వాత చూశాను మాష్టార్ ని.  నడవడానికి, మెట్లెక్కడానికి చెయ్యి అందిచాల్సి వస్తోంది.

“గుర్తుపట్టి ఉండరు. నేను కూడా లొయోలా కాలేజి లోనే చదివాను మాష్టారూ” అని ప్రవర చెప్పేసుకున్నాను ముందుగానే.  వేదిక మీద ఆయనకి అవకాశం రాగానే “అక్కిరాజు నా శిష్యుడేట నాకిప్పుడే తిలిసింది” అని ఆనంద పడ్డారు. నా బోటి శిష్యులు ఆయనకి కొన్ని వేలమంది ఉండి ఉంటారు. నా స్థాయి రచయితలు కూడా ఎందరో ఆయనకి ఏకలవ్య…
పూర్తిగా »

నేను పోగొట్టుకున్న కొన్ని సంబరాలు…!

ఫిబ్రవరి 2013


నేను పోగొట్టుకున్న కొన్ని సంబరాలు…!

పూర్తిగా ఆవహించిన చీకట్లో వెలుగుతున్న ముసలి దీపం ముందు పెట్టుకొని మట్టి నేలపై సంచి పరుచుకొని పుస్తకాలను ముందేసుకొని, ఇక అన్నయకి తెలియకుండా తన తెల్ల నోటు బుక్కులోనుండి చింపుకున్న ఓ మూడు జంట కమ్మలు నెమ్మదిగా మడతలు పెడుతూ అరచేయి సైజు లో కత్తిరించుకొని పెన్సిల్ తో తోచిన బొమ్మలు గీయడం మొదలుపెట్టా.  ఓ ముప్పై వరకు తయారయ్యాక ఒక్కో బొమ్మకి పక్కన వదిలిన ఖాళీస్థలం లో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ నేస్తం రఘు అని రాసి రేపటికి సిద్ధంగా ఉంచుకోనేవాన్ని.

ఎంత ఇంగ్లీష్ పండగైన మా బోటి పిలగాండ్లందరికి చిన్నపాటి పెద్ద పండగే.. అప్పటికి ఇంట్లో కరెంటు లేదు. మా…
పూర్తిగా »