అనువాద కథ

అల్లా కోరిక

నవంబర్ 2014


అల్లా కోరిక

అప్పటిదాకా వెలుగుల్ని వెదజల్లిన చంద్రుడు మబ్బుల చాటుకు పోవడంతో ఆ రాత్రి చీకటిమయంగా మారింది. డోగో ఆకాశం వైపు చూశాడు. కదిలే నల్లని మబ్బులు చంద్రుణ్ని దాచేశాయి. అతడు గొంతును సరి చేసుకుంటూ “ఈ రాత్రికి వర్షం వచ్చేట్టుంది” అన్నాడు తన మిత్రునితో. అతని స్నేహితుడైన సులే త్వరగా జవాబివ్వలేదు. అతడు దృఢమైన శరీరంతో పొడుగ్గా ఉంటాడు. అతని ముఖమూ అతని స్నేహితుని ముఖమూ అజ్ఞానం తాలూకు మూఢత్వపు ముసుగుల్లా వున్నాయి. డోగో లాగా సులే కూడా దొంగతనం చేస్తూ బతుకుతున్నాడు. కొన్ని క్షణాల క్రితం నుండి సులే అలవాటు లేని కుంటి నడక నడుస్తున్నాడు. కొంతసేపైన తర్వాత తన వేలును ఎడమ భుజానికి వేలాడదీసుకున్న…
పూర్తిగా »

పలక కావాలి

పలక కావాలి

కవిత తమ డాబా మీద కూర్చుని గచ్చు మీద చాక్‌పీసులతో ఏదేదో గీస్తోంది. బడిలో వాడి పాడేసిన చాక్‌పీస్‌లను ఏరుకుని జాగ్రత్తగా రుమాలులో చుట్టుకుని ఇంటికి తెచ్చుకుంటుంది కవిత. రెండు పిలకలున్న ఓ పాప బొమ్మ గీయడం ఇప్పుడే పూర్తి చేసింది. ఈ బొమ్మ తల మీద కూడా, సగటు భారతీయ విద్యార్థుల బుర్రల్లో తిరిగే అంకెలు, అక్షరాలు గుండ్రంగా తిరుగుతున్నాయి.

మావయ్య తమ ఇంటికి రావడం ఉన్నట్లుండి గమనించింది కవిత. చప్పట్లు కొడుతూ, గెంతడం ప్రారంభించింది. కవితా వాళ్ళదీ, మావయ్యదీ ఒకే ప్రహరీ గోడలో ఉండే రెండు వేర్వేరు ఇళ్ళు. కవితకీ, అక్కలకీ మావయ్య శాంతాక్లాజ్ వంటివాడు. ఎప్పుడూ ఏవో బహుమతులు, ఊహించని కానుకలు…
పూర్తిగా »

ప్రతీకారం

ప్రతీకారం

[చరిత్రలో మనం ఒక జాతి మరొక జాతినీ, ఒక మతం మరొక మతాన్నీ, ఒకే మతంలోనే ఒక వర్గం మరొక వర్గాన్నీ ద్వేషించుకుంటూ, చంపుకుంటూ, ప్రతీకారాన్ని తర్వాతి తరాలకి వారసత్వంగా అందించిన సందర్భాలు కోకొల్లలు. తమ దేశంకోసమో, తమ మతంకోసమో, తమ వర్గంకోసమో, ఇలా ప్రతీకారం తీర్చుకోవడంకోసం ప్రాణాలర్పించడం ఒక గొప్ప త్యాగంగా స్తుతించిన కవితలూ, కావ్యాలూ కూడా లేకపోలేదు. ఈ కథ ఏ రకమైన తాత్త్విక వ్యాఖ్యలూ, ఉపన్యాసాలూ లేకుండా, ప్రతీకారానికి మించినది ఒకటి ఉందని చెబుతుంది. అది ఎవరికి వారు తెలుసుకోవడంలోనే ఆనందం… అనువాదకుడు]

ఈ సంఘటన ఫ్రాన్స్ తూర్పు తీరంలో బూర్బకి (Charles Denis Sauter Bourbaki 22 ఏప్రిల్…
పూర్తిగా »

నేను, అనుభవాన్ని, మాట్లాడుతున్నా

ఫిబ్రవరి-2014


నేను, అనుభవాన్ని, మాట్లాడుతున్నా

1. నా గదిలో నివసించే వాళ్లు

నా డబ్బాను నేనే కొట్టుకోవాలా లేక వేరేవాళ్లు కొట్టాలా అన్నది యిక్కడి ప్రశ్న. నా డబ్బా కొట్టే వాడు మూర్ఖంగా నన్ను వదిలి వెళ్లాడనేది దురదృష్టకరమైన విషయమే అయినా అది వాస్తవం. అతనికి జీతం తక్కువై కాదుగాని, ఆక్రా నగర జీవితపు కోలాహలం నడుమ బలమైన చప్పట్లతో, కేరింతలతో నా డబ్బా శబ్దాన్ని వినపడేట్టు చేయలేకపోయాడతడు. ఇక అతడు లేని ఈ సమయంలో నాకిష్టమున్నా లేకకపోయినా బలహీనంగానైనా నా డబ్బాను నేనే కొట్టుకోవాలి మరి.

ముందు నా గురించిన పరిచయంలో నేను వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కొనేవాడిననీ, అమర్యాద చూపేటంత నిర్మొహమాటస్థుడిననీ చెప్పాలి. పొట్టిగా వుంటే లాభమనుకున్నప్పుడు ఎంతో పొట్టిగా,…
పూర్తిగా »

వృక్షం

అక్టోబర్ 2013


వృక్షం

మూలం: మరియా లుయిసా బొంబాల్ (చిలీ)
తెలుగు అనువాదం: ఎలనాగ

పియానో వాద్యకారుడు కూర్చుని, కృతకంగా దగ్గి, ఏకాగ్రతను ఆవాహన చేసుకున్నాడు. ఆ హాలును వెలిగిస్తున్న కరెంటు దీపాల గుచ్ఛం నుండి వెలువడే కాంతి సాంద్రత క్రమంగా తగ్గుతుం టే ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక సంగీత స్వరమాలిక అణకువ నిండిన సాహసవంతమైన చంచలతతో రూపం పోసుకుంటున్నది.

‘మోట్జార్ట్ స్వర రచన కావచ్చు’ అనుకున్నది బ్రిగిడా. ఎప్పటి లాగానే కార్యక్రమ వివరాల కార్డును తీసుకోవటం ఆమె మరచి పోయింది. ఈ సంగీతం మోట్జార్ట్ దో లేక స్కార్లాటిదో కావచ్చు అనుకున్నదామె. ఆమెకు సంగీతం గురించి అంతగా తెలియదు. అందుకు కారణం ఆమెకు…
పూర్తిగా »