వ్యాసాలు

భాస కాళిదాసులు

డిసెంబర్ 2014


భాస కాళిదాసులు

ఆకాశంలో ఇద్దరు సూర్యులు ఉండటం అసంభవమేమో కానీ యే సాహిత్యవినీలాకాశంలోనైనా ఒకరిద్దరు కాదు అనేక సూర్యులు ఉండవచ్చు. నిజానికి సాహిత్యంలో ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని చెప్పే ప్రమాణాలేవీ కూడా కొరగావు. మరి ఆ శీర్షికకు అర్థం ఏమిటి? – అంటే అది ఆ కవుల మధ్య పోటీ కానీ పోలిక కానీ కాదు, అదొక అనుశీలనాపద్ధతి అని చెప్పవలసి వస్తుంది. అలా సంస్కృత సాహిత్యంలో ఇద్దరు కవుల ఒరవడిని, వారి కవిత్వ రీతులను, వారి కవిత్వపు లక్ష్యాలను కొంతవరకూ అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసలక్ష్యం.

ఆ ఇద్దరు కవులలో భాసకవి పూర్వుడు. కాళిదాసుది తరువాతి కాలం. కాళిదాసు భాసుని ప్రథితయశసుడని కీర్తించాడు.


పూర్తిగా »

స్వప్నవాసవదత్తమ్ – చివరి భాగం

నవంబర్ 2014


స్వప్నవాసవదత్తమ్ – చివరి భాగం

కథ వెనుక కథలు, ఆ కథల వెనుక తొంగిచూచే చరిత్రా…:

భాసుని కొన్నినాటకాలలో అక్కడక్కడా అర్థం కాని సన్నివేశాలు లేదా ఏదో తెలియని కథలను ఉద్దేశించిన మాటలు అగుపిస్తాయి. దీనికి కారణాలు రెండు. మొదటిది – భాసుని కాలానికి రామాయణ, భారతాదులతో బాటు ఉదయనుని కథాకలాపాలు మౌఖికంగా వ్యాప్తి చెంది ఉండుట. రెండు – భాసుడు కాలంలో సంస్కృతనాటకాలు విరివిగా ప్రదర్శిస్తూ ఉండే సంభావ్యత. ఉదయనచరిత్రలో కొంతభాగమే నాటకంగా కవి స్వీకరించాడు కనుక అక్కడక్కడా ఉదయనునికి సంబంధించిన ఇతర కథలను అన్యాపదేశంగా సూచించి వదిలేశాడు. మౌఖికసాహిత్యవాప్తి కారణంగా నాటి ప్రేక్షకులకు ఆ కథలు సుపరిచితమే కాబట్టి నాటకంలో అలాంటి సూచనలను వారు పట్టించుకోకపోవడం జరిగి ఉంటుంది.


పూర్తిగా »

ది మారినర్: హ్యుగొ హామిల్టన్

ది మారినర్: హ్యుగొ హామిల్టన్

డబ్లిన్ థియటర్ ఫెస్టివల్ లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ నాటక కంపెనీల నాటకాలెన్నో ప్రదర్శించబడతాయి. ఈ ఏడాది 25 సెప్టంబర్ నుండి 11 అక్టోబర్ వరకూ ఈ థియేటర్ ఫెస్టివల్ జరిగింది. అందులో భాగంగా నేను చూసిన “ది మారినర్” అనే నాటకం గురించి నా ఆలోచనలు పంచుకోవాలని ఈ వ్యాసం రాస్తున్నాను.

డబ్లిన్ – ఒక కల్చరల్ హబ్:  డబ్లిన్ నగరం నేను చూసిన తక్కిన యూరోపియన్ సిటీల్లా చూడగ్గానే అబ్బురపోయేంత అందంగా అనిపించలేదు. ఎక్కడపడితే అక్కడ ఆగిపోయి, ఫోటోలు దిగాలని అనిపించలేదు. చాలా మామూలుగా అనిపిస్తుంది, ఆ వీధుల్లో తిరుగుతుంటే! కానీ, కంటికి కనిపించే వాటిని పక్కకు పెట్టి,…
పూర్తిగా »

స్వప్నవాసవదత్తమ్ – మొదటి భాగం

అక్టోబర్ 2014


స్వప్నవాసవదత్తమ్ – మొదటి భాగం

స్వప్నవాసవదత్తమనే నాటకం భారతీయనాట్యకళకు కాణాచి. కాళిదాసుతో మొదలుకుని దిజ్ఞాగుడు, భవభూతి, హర్షవర్ధనుడు ప్రభృతులైన ప్రసిద్ధ నాటకకర్తలకు స్వప్నవాసవదత్తమ్ ప్రేరణ కలిగించినట్లు తెలుస్తుంది. భారత నాట్యకళను పరిపుష్టం చేసి, మార్గనిర్దేశకత్వం చేసిన ఘనుడు భాసకవి. భాసుని నాటకాలన్నింటినీ కలిపి భాసనాటకచక్రంగా వ్యవహరిస్తారు.
పూర్తిగా »

సాహిత్య సౌరభానికి కాలం చెల్లుతోందా?

ఆగస్ట్ 2014


సాహిత్య సౌరభానికి కాలం చెల్లుతోందా?

అసలెవరైనా పుస్తకాలెందుకు చదువుతారు?

ముఖ్యంగా ఫిక్షన్ ఎందుకు చదువుతారు” అనే ప్రశ్న ఎప్పుడూ వేసుకోవాలని తోచదు. కానీ రచయిత సొదుం రామ్మోహన్ దీనికి ఇలా చెప్తారు ఒక వ్యాసంలో!

“నా జీవితం సంగతి నాకెరుకే. ఇతరుల జీవితాలు ఎలా ఉన్నాయో? జీవితం, సమాజం పట్ల నాకు కొంత అవగాహన, కొన్ని అభిప్రాయాలు ఉన్నై. ఇతరులకెలా వున్నాయో? … ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకోడానికి చదువుతారు కొందరు.

ఒక పుస్తకం చదవటం మూలంగా, తమ విజ్ఞానం విస్తరిస్తే ఆ సాహిత్యానికి ప్రయోజనమున్నదని, అది చదవడం మూలంగా తామూ ప్రయోజనం సాధించామని అనుకుంటారు కొందరు. తనకు అంతకుపూర్వం తెలియని సామాజిక వాస్తవాలను కథలోనో, కవిత్వం లోనో గ్రహిస్తే…
పూర్తిగా »

కథంటే ఏమిటి?

కథ, అంటే ఏమిటో నేను మొదలుపెట్టబోతున్నానంటే, నన్నెవరో కథ గురించి అడిగినట్టూ, అది అడిగించుకునేంత పెద్దవాణ్ని నేను అయిపోయినట్టూ ధ్వనిస్తోంది కదా!
మొదటిది నిజమే. రెండవది నిజమో కాదో, తర్వాత చూద్దాం.
(వయా కావలి వెళ్లిన) ప్రకాశం జిల్లా రామాయపట్నంలో (2014 ఫిబ్రవరి 15, 16 తేదీల్లో) జరిగిన ‘కడలి అంచున కథ’ సమావేశం కోసం కథకుడు ఖదీర్ బాబు కథంటే ఏమిటో నన్ను మాట్లాడమన్నారు.
కథా?
నేనా?
కథల్ని మొన్నమొన్నటిదాకా నేను సీరియస్గా పట్టించుకోనే లేదు. అయినా, కథంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించాలి? ఒకవేళ నిర్వచించినా, అదంతా ‘ముసలి డొక్కుల’ వ్యవహారం కదా!
ఇలా…
పూర్తిగా »

అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం

అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం

అమెరికాంద్రుల జీవితాలలో తరచుగా తారసపడే పరిస్థితులను, సమస్యలను వాటి పరిష్కారాలను కథలుగా మలచి మనకు అందిస్తున్న అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రులు అభినందనీయులు. వేరు వేరు కాలాలలో అమెరికాలోని తెలుగువారి జీవనవిధానం ఎలా కొనసాగిందో తెలుసుకోవడం ఈ కథల ద్వారానే సాధ్యమవుతుంది. అమెరికాలోని తెలుగు కథా రచయిత్రులు అక్కడి సమాజంలోని తమ వారి జీవితాలను శోధించి, ఆ అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకొని కథలను సృష్టిస్తున్నారు. అమెరికా లాంటి భిన్న సంస్కృతుల వ్యవస్థలో తమ సంస్కృతిని, తమ భాషను, తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోను – ఉత్సాహంతోను అక్కడి కథా రచయిత్రులు కథలను వ్రాస్తున్నారు. సాహిత్యం కూడా సంస్కృతిలో భాగం కావున అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృభాషలో కథలు,…
పూర్తిగా »