‘ తన్నీరు కళ్యాణ్ కుమార్ ’ రచనలు

అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య

అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య

తొలితరం ఉద్యమ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యులు అస్తమయం తెలుగు జాతి ప్రజలకు – సాహిత్యానికి తీరని లోటు. వేదం నుంచి ఉద్యమం దాకా దగ్గరగా లోతుగా పరిశీలించి రచనలు చేసిన విలక్షణ రచయిత రంగాచార్య. బాల్యం నుంచి చివరి శ్వాస దాకా వివిధ సాహితీ ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు. రంగాచార్య జీవితం భిన్న వైరుధ్యాల నిలయం. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లా ఉండే అంశాలు ఆయనలో ఒక్కటిగా కలిసి కాపురం చేస్తాయి. ఆయనను చూస్తే, నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరులో తుపాకీ పట్టిన యోధుడని, ఆయన నుదిటి పై కనిపించే తిరునామాలు చూసి ఆయనొక మార్క్సిస్ట్…
పూర్తిగా »

బహుముఖ ప్రజ్ఞాశాలి చేరా

బహుముఖ ప్రజ్ఞాశాలి చేరా

ఆధునిక భాషాశాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు చేకూరి రామారావు తెలుగువారు గర్వించదగిన మహానుభావుడు. ఆధునిక భాషా రంగంలో అనితర సాధ్యమైన గుర్తింపు పొందిన మహా వ్యక్తి. ఆయన మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు. భద్రిరాజు కృష్ణమూర్తి, తూమాటి దొణప్ప తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన చేకూరి రామారావు తెలుగు వారికి చిరస్మరణీయులు. ఆయన వాడుక భాషా వ్యాప్తికి చేసిన కృషి ప్రశంసనీయం.

అందరికి ‘చేరా’గా సుపరిచితుడైన చేకూరి రామారావు ఖమ్మం జిల్లా మధిర తాలుకా ఇల్లిందుల పాడు గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్య గుంటూరు జిల్లా నరసరావుపేటలోను, ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో పూర్తి చేశారు. డిగ్రీ, యం.ఏ. తెలుగు హైదరాబాదులో పూర్తి చేసి, అమెరికా…
పూర్తిగా »

అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం

అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం

అమెరికాంద్రుల జీవితాలలో తరచుగా తారసపడే పరిస్థితులను, సమస్యలను వాటి పరిష్కారాలను కథలుగా మలచి మనకు అందిస్తున్న అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రులు అభినందనీయులు. వేరు వేరు కాలాలలో అమెరికాలోని తెలుగువారి జీవనవిధానం ఎలా కొనసాగిందో తెలుసుకోవడం ఈ కథల ద్వారానే సాధ్యమవుతుంది. అమెరికాలోని తెలుగు కథా రచయిత్రులు అక్కడి సమాజంలోని తమ వారి జీవితాలను శోధించి, ఆ అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకొని కథలను సృష్టిస్తున్నారు. అమెరికా లాంటి భిన్న సంస్కృతుల వ్యవస్థలో తమ సంస్కృతిని, తమ భాషను, తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోను – ఉత్సాహంతోను అక్కడి కథా రచయిత్రులు కథలను వ్రాస్తున్నారు. సాహిత్యం కూడా సంస్కృతిలో భాగం కావున అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృభాషలో కథలు,…
పూర్తిగా »