ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

Day 13

“If You Come Softly” by Audre Lorde

మానుల మధ్య మెలితిరిగే
మెత్తని గాలితెమ్మెరవై నువ్వొస్తే
నా చెవిలో రింగుమనే సవ్వడిని వింటావు.
దిగులు చూపుల్లోంచి లోకాన్ని చూస్తావు.

తీగసాగే తుషారానివై
తేలికగా నువ్వొస్తే
సరే! మరేం అడగన్లే.
తీర్ధంగా నిన్ను దోసిట్లోకి తీసుకుంటాను.

నువ్వేమో ఊపిరింత ఒద్దికగా
చెంత చేరతావు
చేవలేని ఈ మనుషులేమో
మరణాన్ని మోసుకు తిరుగుతారు

ఎట్టకేలకు నొవ్వొచ్చేస్తే,
నేను నోరు మెదుపుతానేమో చూడు
ఒక్కమాట మీరతానేమో అడుగు
ఎందుకొచ్చావేంటని
ఇట్నుంచి ఎటు పోతావని
నిలదీస్తే నామీద ఒట్టు పెట్టు

నిరుటికీ నేటికి మధ్య నడవలో
చేతులాన్చి చతికిలబడ్డాక
నీదో నాదో తేలని బలమేదో
మన కన్నీళ్లని ఆబగా తాగిపోనీ

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12