ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

Day 14

“Today” by Mary Oliver

దిగుల్లో పదాలు పెగలకపోనీ
ఆశల జాతరని కాసేపు ఆగిపోనీ
లోకాన్ని తనదారిన తాను నడవనీ

పెరట్లో రొదపెట్టే తుమ్మెదలూ
చెరువులో గంతులేసే చాపలూ,
వేటకి దొరికిపోతున్న పురుగులూ
అనేకానేకం..

నేను మాత్రం ఈ రోజుకి రికామీని
గాలికౌగిలిలో ఈకనై
కానరాని దూరాలని దాటనీ.
ఈ గుడి గంటల మధ్య నేనొక నిర్మోహనాదాన్ని.

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12