ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

Day 9

“You darkness” by Rainer Maria Rilke

నిశీ, నీనుంచి పుట్టినందుకేనేమో!
ప్రపంచాన్ని వెలుగు కంచెలో
బంధించే నెగడు వలయాలకంటే
నిన్నే ప్రేమిస్తాను
నిప్పు వెలుగుల చెప్పుచేతుల్లో
బంధీలైన వారికి నువ్వు తెలీదు

కానీ,
నువ్వన్నిటినీ నీలోకి లాక్కొంటావు
ఆకారాలనీ, అగ్నులనీ
ప్రాణకోటీనీ, సర్వనామాలనీ
శక్తులనీ, అశక్తులనీ
అనాయాసంగా అక్కున చేర్చుకుంటావు

బహుశా,
ఏదో గొప్ప శక్తి నాకు దగ్గరగా ఒరుగుతోంది
రాత్రులపై నాకు నమ్మకముంది.

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12