ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

Day 16

“When I Was the Forest” by Meister Eckhart (1260-1328)

వాగునై, కోననై, అడవినై
ఉన్నాను కొన్నాళ్లు
ప్రతి రెక్కలోనూ, ప్రతి డెక్కలోనూ,
ప్రతి అడుగులోనూ, ప్రతి అందియలోనూ
మరికొన్నాళ్ళు మనలేదూ?

అప్పుడే ఆకాశమంతా ఉన్న నన్ను
ఏ పని మీద అక్కడున్నానో ఎవరూ అడగలేదు
నాకేం కావాలో ఎవరూ అడక్కపోతేనేం!
నేను ప్రేమించలేనిదేదీ అప్పుడు లేదు

అక్కడనుండీ ఉనికి ఊరిలో పడ్డాక,
భయం, వేదన, సందేహం చుట్టుముట్టాకా
వెక్కి వెక్కి రోదించలేదూ?
తెలియని కన్నీటిని దోసిళ్లతో
అర్ఘ్యమివ్వడానికి
తిరిగి నదినీ, కొండలనీ ఆశ్రయించలేదూ?
నా చేతిని అందుకొమ్మని,
నాతో ఏడడుగులు నడవమని
పురుగునీ, పుట్రనీ,
అడవిలోని అణువణువునీ
అడిగి అడిగి అలమటించలేదూ?
ప్రాధేయపడలేదూ?

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12