నేను ఎవరెవరో, ఎంతమందో!
అందరికీ ఎదురొడ్డి ఒక్కడిగా కుదురుకోవడం అసాధ్యం
వాళ్లంతా రంగురంగుల బురఖాల్లో దాంకుని
నిన్ననే వేరే నగరానికి తరలిపోయారు
గతాన్ని పోగులు పెడుతూ దూదేకుల సాయబొక్కడు మిగిలాడు
*
నన్నొక ప్రతిభామూర్తిగా చిత్రించడానికి
అంతా సిద్ధం అయిన తరుణంలో
నేను కప్పెట్టిన అజ్ఞానం మాటల రూపంలో
నోటంటే ఉండి నన్ను వెనకేసుకొస్తుంది
*
నది దాటించబోయినందుకే
నావని నట్టేట ముంచిన
ప్రతీకార జ్వాల మాత్రం
పుండులోంచి కారుతున్న పదో రసం
వ్యాఖ్యలు
K SHESHU BABU on హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం!
Dr.Appalayya Meesala on వీడ్కోలు తర్వాతి నువ్వు
Dr.Appalayya Meesala on జ్ఞాపకాలపిట్ట
Nirupama on హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం!
Annam sivakrishna on జ్ఞాపకాలపిట్ట