చలువ పందిరి

అణువు అణువుగా

జనవరి 2013

మండుటెండలో తిరిగి తిరిగి దాహంతో ఉన్నప్పుడు గ్లాసుడు నీళ్ళు తాగితే ఎంత హాయిగా ఉంటుందో కొన్ని పాటలు విన్నప్పుడు అంతే హాయిగా ఉంటుంది. భాష ఏదైనా కొన్ని పాటలు వింటుంటే తెలియని ఆనందం, హాయి కలుగుతాయి మనకి. ఓ మంచి పాట మన మనసులను తాకి, వేసవిలో చల్లని పానీయం ఇచ్చినంత హాయిని ఇచ్చి మనల్ని జ్ఞాపకాల వీధుల్లో పరిగెత్తిస్తుంది. ఆనందోల్లాసాలలో డోలలాడిస్తుంది. మన మూడ్ బాలేకపొయినా ఠక్కున సరిచేసేస్తుంది. పాటలోని విచిత్రమేమిటంటే విషాదభరితమైన పాట కూడా ఒకోసారి వినటానికి హాయిగా ఉంటుంది. సాహిత్యానికి ఆ శక్తి ఉంది. అలాంటి హాయినిచ్చే కొన్ని మంచి మంచి పాటల్ని, వాటిలోని సాహిత్యాన్నీ గుర్తుచేసి, వాటి తాలూకూ చల్లదనాన్ని అందించబోతోంది ఈ చలువ పందిరి. మరి ‘వాకిలి’లోకి ఎలాగు వచ్చారుగా ‘చలువ పందిరి’లోకి కూడా అడుగుపెట్టండి మరి…

 

పందిట్లో సందడి చేసే మొదటి పాట : कतराकतरामिलतीहै..

టివీ అంటే దూరదర్శన్ ఛానల్ మాత్రమే ఉన్న రోజుల్లో ఓసారి ప్రముఖ కవి, సినీగేయ రచయిత గుల్జార్ తీసిన ‘ఇజాజత్’ అనే సినిమా వేసారు. ఆ సినిమాలో “మాయ” అనే విచిత్రమైన పాత్ర(అనురాథా పటేల్), చాలా కాలం నన్ను వెంటాడింది కూడా. అప్పట్లో గుల్జార్ గొప్పతనమూ తెలీదు, సాహిత్యాన్ని ఆస్వాదించటమూ తెలీదు కానీ చిత్రంలోని నాలుగు పాటలూ నచ్చాయి. అన్నింటికన్నా “కత్రా కత్రా మిల్తీ హై..” అనే పాట, పిక్చరైజేషన్, అందులో చూపించే లొకేషన్స్ ఇంకా నచ్చేసాయి నాకు. జీవితం పట్ల ఒక అవగాహన, ప్రతిక్షణాన్నీ ఆస్వాదించాలనే తృష్ణ పెరిగాకా ఈ పాట నాకత్యంత ఇష్టమైన పాటల్లో ఒకటైపోయింది.

తన భర్త మనసు తన సొంతం కాదని తెలిసినా సరే అతడిని ప్రేమిస్తూ, అతనితో గడిపే క్షణాలను అపురూపంగా భావిస్తూ, ఎప్పటికీ అతని కలల్లోనే ఉండిపోవాలని తపన పడే ఓ భార్య పాడే పాట ఇది. గుల్జార్ సాహిత్యానికి పూర్తి న్యాయం చేకూర్చే ఆర్.డి. బర్మన్ సంగీతంలో, రెండు వేరు వేరు స్వరస్థాయిల్లో ఆశా భోంస్లే గళం నుండి జాలువారిన ఈ పాట మనోహరంగా ఉంటుంది. ఈ పాట పల్లవికి 1978 లోని ‘war of the worlds’ అనే ఆల్బం లోని “horsell common and the heat ray” స్ఫూర్తి అనిపిస్తుంది. ఈ ఆంగ్ల బాణీని కొద్దిగా స్లో చేసి ఈ పల్లవిని చేసినట్లున్నారు.

ఇక పాటలోని సాహిత్యం వైపుకి వెళ్తే.. తనకు దొరుకుతున్న ఆనందం పూర్తిగా తనది కాకపోయినా దొరికిన ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలనే తపనని రకరకాలుగా ఈ పాటలో వ్యక్తపరుస్తుంది నాయిక.

సాహిత్యానికిఅర్థం, భావం:
ప: कतरा कतरा मिलती है అణువు అణువుగా లభిస్తుంది कतरा कतरा जीनॆ दॊ అణువణువునూ నన్నూ జీవించనీ..

जिंदगी हैं..(जिंदगी हैं..) बहनॆ दॊ..(बहनॆ दॊ..)

ఇదే జీవితమంటే ! జీవనగతిని ఇలానే ప్రవహించనీ..

प्यासी हूँ मैं.. प्यासी रहनॆ दॊ.. ना..

रहनॆ दॊ.. ना..

దాహంతో ఉన్నాను… నా దాహాన్నిలానే ఉండనీ…

ఇలానే ఉండనీ…

భావం: జీవితంలో అణువణువంతే లభ్యమయ్యే ఆనందక్షణాలలో నన్ను జీవించనివ్వు. దొరికేది అణువణువంతే అయినా, ఇలాంటి క్షణాలే చాలు నాకు. అవి నా దాహాన్ని తీర్చకపోయినా, నా తృష్ణ నిలాగే కొనసాగనీ..

1చ: कल भी तो कुछ ऐसा हुआ था

నిన్న కూడా ఇంచుమించు ఇలానే జరిగింది

नींद मॆं थी तुमनॆ जब छुआ था

నువ్వు తాకినప్పుడు నిద్రలో ఉన్నాను..

गिर्तॆ गिर्तॆ बाहों में बची मैं

పడుతూ పడుతూ నీ కౌగిలిలో ఆగాను

सपनॆ पॆ पांव पड गया था

ఓ కలలోకి అడుగిడాను …

सपनॊं मॆं.. बेहनॆ दॊ..

ఆ కలల వెల్లువలోనే నన్నుండనీ..

प्यासी हूँ मैं.. प्यासी रहनॆ दॊ…

रहनॆ दॊ.. ना..

దాహంతో ఉన్నాను… నా దాహాన్నిలానే ఉండనీ…

ఇలానే ఉండనీ…

భావం: నీ స్పర్శ నన్ను నీ కౌగిలిలోకీ, అటుపై కలలోకీ తీసుకెళ్ళగలదు. ఆ కలల వెల్లువలోనే నన్ను జీవించనీ. ఆ కలల వెల్లువ నా దాహాన్ని తీర్చకపోయినా, నా తృష్ణ నిలాగే కొనసాగనీ..

 

2చ: तुमनॆ तो आकाश बिछाया

నాకోసం నువ్వు ఆకాశాన్ని పరిచావు కానీ

मॆरॆ नंगॆ पैरॊं मॆं जमी हैं

నా పాదాలు మాత్రం ఇంకా నేల పైనే ఉన్నాయి

पाकॆ भी तुम्हारी आरजू हॊ

నువ్వు నా సొంతమైనా కూడా నీ కోసం తపించాలని ఉంది

शायद ऐसी ज़िंदगी हसी हैं

అలాంటి జీవితమే మధురమైనదేమో…

आरजू मॆं..बहनॆ दॊ..

ఆ తపనలో ప్రవహించనీ…

प्यासी हूँ मैं.. प्यासी रहनॆ दॊ…

रहनॆ दॊ.. ना..

దాహంతో ఉన్నాను… నా దాహాన్నిలానే ఉండనీ…

ఇలానే ఉండనీ…

భావం: నీతో గడిపిన క్షణాలు నన్నెంత ఆనందంగా ఉంచినా, నువ్వు నా సొంతం కాదని నాకు తెలుసినా కూడా, నీ కోసం తపిస్తూనే ఉండాలని నా ఆకాంక్ష. నువ్వు నా సొంతమైనా కూడా నిన్ను పొందాలనుకునే తపనే మధురమైనదేమో.. ఆ ఆకాంక్షలోనే నన్ను తపించనీ… ఆ తపన నా దాహాన్ని తీర్చకపోయినా, నా తృష్ణ నిలాగే కొనసాగనీ..

 

3చ: हल्कॆ हल्कॆ कोहरॆ कॆ धुवॆं मॆं

అస్పష్టంగా ఉన్న పొగమంచులో

शयद आसमान तक आ गयी हूँ

ఆకాశం అంచులదాకా నడుచుకుంటూ వచ్చేసానేమో..

तॆरॆ दो निगाहॊं कॆ सहारॆ

నీ చూపుల సాయంతో

दॆखॊ तो कहां तक आगयी हूँ

చూడు ఎంత దూరం వచ్చేసానో..

कोहरॆ मॆं..बेहनॆ दॊ..

ఈ పొగమంచులోనే నన్ను సాగనీ…

प्यासी हूँ मैं.. प्यासी रहनॆ दॊ…

रहनॆ दॊ.. ना..

దాహంతో ఉన్నాను… నా దాహాన్నిలానే ఉండనీ…

ఇలానే ఉండనీ…

భావం: నీ సాంగత్యం నన్ను మబ్బులలో తేలేలా చేస్తుంది. నువ్వు వెంట ఉంటే; నేనెక్కడికి వెళుతున్నానో తెలియకపోయినా, నీ వెంట అస్పష్టమైన దారులలో సైతం నడవాలనిపిస్తుంది. ఏ గమ్యం చేరకపోయినా, నీ వెంట సాగాలనే తృష్ణ నిలాగే కొనసాగనీ.

మరి ఈ పాటను మీరు కూడా హాయిగా వినేస్తారా..  

‘Pancham : Gulzar remembers RD Burman’ అనే ఆల్బం లో ఆర్.డి.బర్మన్ ను తలుచుకుంటూ గుల్జార్ చెప్పిన మాటల్ని, తర్వాత ఈ పాటనూ క్రింద లింక్ లో వినవచ్చు:

http://www.youtube.com/watch?feature=player_embedded&v=hCjTKPueAls