మొట్టమొదటి సారి శివసాగర్ కవిత్వాన్ని సంకలనం చేసిన ఖ్యాతి గుర్రం సీతారాములుదే! ఎన్నో కష్టానష్టాలకోర్చి తగిన సమయంలో శివసాగర్ కవితలన్నీ వొక పొత్తంగా కూర్చి మనకి అందించిన సీతారాములు తెలుగు, ఆంగ్ల సాహిత్య విమర్శల పట్ల ఆసక్తితో హైదరబాద్ లోని ప్రతిష్టాత్మకమయిన సీఫెల్ యూనివర్సిటీలో చేరారు. గత కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న పరిశోధనల ఫలాలు ఇంకా మనకి అందాల్సి వుంది. కానీ, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఈ తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ సీతారాములు పీడిత స్వర నగారా వినిపిస్తున్న కార్యశీలి. శివసాగర్ కి ఎంతో సన్నిహితుడయిన సీతారాములుతో కాసేపు:
శివసాగర్ కవిత్వ సంకలనం తేవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ?
- ఒకరోజు శిఖామణి ‘కిర్రుచెప్పుల భాష’ చదువుతున్నా. తుమ్మపూల సౌందర్యం పేరుతో శివసాగర్ రాసిన ముందుమాట చదివా, అండర్ గ్రౌండ్ లో ఉన్న నాయకుడు అలా రాయడం నాకయితే కుతూహలం కలిగింది . అంతకు ముందు అతని కవిత్వం అక్కడక్కడా చదివా , అతని గురించి విన్నా , “ఉద్యమ నెలబాలుడు” చదవాల నిపించింది 1983 లో వచ్చిన పుస్తకం అది అప్పుడు అందుబాటులో లేదు ఖమ్మం లో ఒక మిత్రుడి వద్ద తీసుకొని చదివా అది కవిత్వం అందం కంటే ఒక అణు విస్పోటనం అంటే బాగుంటది . నాకయితే కవిత్వం కంటే దాని వెనక ఉన్న విప్లవ సాహిత్య సాంస్కృతిక చరిత్ర చదివిన అనుభూతి కలిగింది. శివసాగర్ రాసిన మరో సంకలనం “నెలవంక” తర్వాత ఎన్నో కవితలు రాసినా అవి అందుబాటులో లేవు అని అతని కవితల సేకరించడం మొదలుపెట్టా. అప్పుడే ఎమ్మే చదివి నిరుద్యోగిగా ఉన్నా ఖమ్మం లో ఒక చిన్న కాలేజీ లో పనిచేస్తున్న , శివసాగర్ తో కలిసి పనిచేసిన కొందరి మిత్రుల సహకారం తో పుస్తకం అచ్చువేసా .
వేయడం అయితే జరిగింది కానీ పుస్తకాలు ఇంకెవరో అచ్చు వేసారు అని హైదరాబాద్ లో చెప్పుకోడం బాధ వేసింది అలా పుస్తకం వేసే క్రమం ఎన్నో విషయాలు తెలిసినవి విప్లవ సాహిత్యం, రాజకీయాలు చదివే అవకాశం నాకు ఈ పుస్తక ప్రచురణ ద్వారానే కలిగింది . పుస్తకం అయితే వేసా కానీ ఆపుస్తకం ఇంకొకరు వేసినట్లు జరిగిన ప్రచారం కొంచం ఇబ్బంది పెట్టింది . ఆయన రాజకీయాలు మంచా చెడ్డా అనే చర్చ పక్కనపెడితే తెలుగు నేలమీద శివసాగర్ అటు శిల్పం లో కానీ ఇటు దృక్పదం లో కానీ ఎప్పటికీ తనదయిన ముద్రవేసి పోయాడు . అది పూడ్చే ప్రయత్నం ఇటు విరసంలోకానీ బయటకానీ జరగలేదు. ఒక్క కౌముది మినహాయిస్తే ఎవరూ లేరనే చెప్పవచ్చు . తెలుగు సాహిత్యం లో ఒక చెరబండ రాజు , శివసాగర్ ఒక ట్రెండ్ సెట్టర్స్ , వాళ్ళు బాపనోళ్ళ కులం లో పుడితే చరిత్ర ఇంకో రకంగా ఉండేది .
ఇప్పుడు క్షుద్ర సాహిత్యాన్ని ముద్రిస్తున్నా విరసం శివసాగర్ , చెరబండ రాజు లని మర్చి పోయింది . ఇలా చరిత్రలో శివసాగర్ వ్యక్తిత్వాన్ని తుడిచేసే, మరుగున పరిచే ప్రయత్నాలు జరిగాయి ఆయన పోయాక ‘శివసాగర్ ఆ నాడు విరసం చనిపోయింది” అన్నాడు నేడు శివసాగరే చనిపోయాడు ఇప్పుడు విరసం ఆయన సంస్మరణ సభ జరుపుతోంది” అనడం బాదపెట్టింది ఆమాట అన్నవాళ్లు జీవితం లో ఎంత నిజాయితీగా ఉంటున్నారో కాలం చూస్తూనే ఉంది అందుకే శివసాగర్ సాహిత్యం ప్రచురించాను .
శివసాగర్ తో నా అనుబంధం ?
-ఇది రాయాలంటే చాలా ఉంది అతను ఒక మహోన్నతుడు. ఒక సాదారణ మనిషికి ఉండే చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ వ్యక్తి గత ఆస్తి , కుటుంబం విషయం లో చాలా మంది కంటే అతను అత్యంత నిజాయితీ గా ఉన్నాడు నిన్ననే ఒక విషయం తెలిసింది అయన తండ్రి సుప్రసన్నరావు కొంత కాలం మిలటరీలో పనిచేసాడు (రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొన్నాడు ) తర్వాత బడిపంతులు గా కూడా పనిచేసాడు అతని నుండి వారసత్వంగా వచ్చిన భూమి అతను అండర్ గ్రౌండ్ లో ఉ న్నప్పుడు ఎవరో ఆక్రమించి చేపల చెర్వుగా మార్చు కున్నరనీ దాని కోసం జరిగే ప్రయత్నాలను ఆపి నేను ఏ వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకంగా ఇన్ని సంవత్సరాలు పోరాడానో దాన్ని కాదని ఇప్పుడు నేను నా స్వంత ఆస్తి ఇది అని కోర్టు కేక్కటమా అలాంటి పనులకు , వ్యక్తిగత ఆస్తులకు నేనెప్పుడు దూరం దయచేసి నన్ను అలాంటి పనులు చేయమని ఎప్పుడు వత్తిడి పెట్టకండి. అని చాలా చాలా గట్టిగా చెప్పటం కాదు వార్నింగ్ ఇచ్చారు
శివసాగర్ కొడుకు సిధార్థ క్లాస్స్ మాటే కాకాని చెప్పగా విన్నా ఆయన ఆచరణ గురించి ఇలాంటివి వందలు. అతను వరంగల్ లో ఉన్నప్పుడు కాకతీయ మెడికల్ కాలేజీలో చదివే ఒక విప్లవ సానుభూతిపరుడు అతని కుటుంబ సభ్యులకు ఒక కుట్టు మిషన్ కొని పెట్టినందుకు ఆయన కోపంతో “కామ్రేడ్ మీరు ఏదయినా సహాయం చేయాలనుకుంటే పార్టీ కి చేయండి నా కుటుంబానికి చేయకండి” అని వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పగా విన్నా . కట్టు కతలతో అగ్రకుల ప్రోగ్రెసివ్ శక్తులు అల్లిన , చలామణి లో ఉన్న కుహనా చరిత్ర పురుషుల లోగుట్టు తిరగ రాసే అవసరం వచ్చ్చింది శివసాగర్ తో అనుబందం నాకు ఇదే నేర్పింది ఇక ముందు ముందు కూడా ఇలాంటి పనులకు పునరంకితం కావాలని , ఒక రకంగా చెప్పాలంటే ఆయన తో కలిసి పనిచేయక పోయినా చాలా దగ్గరగా చూసిన తనం ఒక తండ్రికి కొడుకు చేసినట్లు సేవింగ్ , స్నానం చేయించే పనులు దాకా ఇక పోతే ఆయన విప్లవ రాజకీయాలకు ఒకింత దూరం అయినా తన కివిత్వం నన్ను విప్లవ రాజకీయాలకు దగ్గర చేసింది బహుశా శివసాగర్ తో నా అనుభందం నాకు విప్లవ దిశా ప్రాపంచిక దృష్టి కలిగించింది
దళిత అస్తిత్వం శివసాగర్ సాహిత్య కీర్తిని వెనక్కు నేట్టిం దా ?
- అలాకాదు ఎందుకంటె నిజానికి అతను విప్లవ పార్టీలో ఉన్నప్పుడు దళిత అస్తిత్వం తో ఉన్నాడు అనుకోవడం లేదు అందరు అనుకున్నట్లు ఆయన పీపుల్స్ వార్ జాతీయ ప్రదాన కార్యదర్శి అయింది కొండపల్లి సీతారామయ్య అరెస్ట్ అవడం మూలానే నిజానికి సీతారామయ్య గొప్ప సిద్దాంత కారుడు అలాగని సత్యమూర్తి సీతారామయ్య కంటే బాగా చదవు కున్న వాడు బాగా రాయగలిగిన వాడు అంతర్ జాతీయ సాహిత్య సాంసృతిక విప్లవ అవగాహన సీతారామయ్య కంటే శివసాగర్ కే ఎక్కువ అని అతనితో పనిచేసిన వాళ్ళు ఎంతో మంది చెప్పగా విన్నా , పార్టీ లో అతనికి రావాల్సినంత పేరు రాక పోగా గ్రూపులు కడుతున్నాడు అనడం వివక్షగానే చూడాలి .
ఇక పోతే సాహిత్య్హ్యం లో అయన లాగా రాయ గలిగిన ప్రతిభ అతి తక్కువ మందికి మాత్రమే ఉంది . చాలా మంది ద్రోహులు , అల్పులు, చనిపోయాక మహానుభావులు గా కీర్తి పొందడం వెనక కులం ఉంది .సత్యమూర్తి అగ్రకులం లో పుట్టి ఉంటె చరిత్ర వేరే రకంగా ఉండేది ఇది పాక్షికంగా నిజమే .అని నేను నమ్మితున్నా .దళిత అస్తిత్వం ఆయన కీర్తిని వెనక్కు నేట్టలేదు కానీ దళిత ఉద్యమ కారులు ఆయనను ఒక విప్లవ వ్యతిరేక కార్యక్రమాలకు వాడుకొని ఆయన వ్యక్తిత్వాన్ని కొంచం తక్కువ చేసిన మాట వాస్తవమే ముక్యంగా డెబ్బై , ఎనభై ఏళ్ళ వాణ్ని ప్రశాంతంగా ఉంచడం లో దళిత నాయకుల వైఫల్యం ఉంది అని నేను అనుకుంటున్నా .
ఇప్పుడు వస్తున్న కవిత్వం లో శివసాగర్ స్థానాన్ని ఎలా అంచనా వేస్తారు ?
- ఇప్పుడు వస్తున్న విప్లవ అస్తిత్వ సాహిత్యం కేవలం నినాద ప్రాయం గా ఉంది అధ్యయనం లేదు. విప్లవస్ఫూర్తి అవగాహన తక్కువ ,ఇప్పుడు విరసం లో రాయని భాస్కరులే ఎక్కువ ఈ మాట పదిహేను ఏళ్ళనుండి అనుకుంటున్నదే , వాళ్ళ దృక్పదం కమిట్ మెంట్ ను తక్కువ చేయడం నా లక్ష్యం కాదు కానీ వ్యక్తివాద పోకడలు స్వీయ తప్పిదాల తో సతమతం అవుతున్నారు . అంతెందుకు తాను రాసిన కవిత కాగితం చూడకుండా అలవోకగా చెప్పగలిగే వాడే నిజమయిన కవి అంతా కాపీ కవిత్వ్యం . ఇప్పుడు అసలు కవిత్వం నిజంగా వస్తుందా అనే సందేహం కలుగుతోంది ఓ సందర్భం లో విమర్శకుడు అఫ్సర్ “ప్రస్తుతం వున్న సామాజిక సంవాద సందర్భంలో కవిత్వం బలహీనమయిన ప్రక్రియ అన్నది నా అభిప్రాయం. ఒక సామాజిక సంవాదం చెయ్యాలంటే కేవలం కవిత్వం మీదే ఆధారపడలేం. ఎందుకంటే, కవిత్వం ఎంత కాదన్నా ఉద్వేగ భాష”అన్న మాట ను కవులు అర్ధం చేసుకోలేగా పోగా ఎన్నో అపార్దాలకు దారితీసింది. ఇప్పుడు సోషల్ నెట్ వర్క్స్ లో వస్తోన్న వ్యక్తీకరణ బాగుంది కాకుంటే అది గురి తప్పిన బాణం లాగా ఉంది ఈ సందిగ్ధ సమయంలో శివసాగర్ స్తానం అంచనా వేయాలంటే ఆయన కవిత్వమంత నిలువెత్తు మనిషి. బహుశా శివసాగర్ తో పోల్చ గలిగిన , కవి లేడనే ఈ విష్యం లో శ్రీ శ్రీ కంటే ఒక పది మెట్లు ఎత్తులో శివసగరే ఉన్నాడు . ఇప్పుడు వస్తోన్న కవిత్వం లో మరుగుజ్జులే ఉన్నారు ఇప్పుడు అంతటా బోన్సాయి వృక్షాలే, సైబర్ సెక్స్ వాసనా ముక్కుపుటాలు అదిరే టట్లు ఉంది.
very nice interview. sharing it on face book. thank you for publication
WELL SAID GURRAM, CONGRATULATIONS….
గుర్రం సీతారాములుగారి ఇంటర్వ్యూ బాగుంది …………. చక్కని ఇంటర్వ్యూ ను మా ముందు ఉంచినందుకు ధన్యవాదాలు
ఇంకా కొంచెం లోతుగా ప్రశ్నించి ఉండాల్సింది. ఇంకొన్ని విషయాలు తెలిసే అవకాశం వుండే
sivasagarni baga prasent chesavu brother
దళిత అస్తిత్వం శివసాగర్ సాహిత్య కీర్తిని వెనక్కు నేట్టిం దా ? YES it’s TRUE
ఇఫ్లూ లో ఆంగ్ల మాద్యమాన పరిశోదన చేస్తున్న మిత్రుడు గుర్రం సీతారాములు శివసాగర్ కవిత్వాన్ని ఆంగ్లంలో పరిచయం ఎందుకు చేయకూడదు పదే పదే తెలుగులో ప్రస్తావన నామట్టుకు అంతగావుపయోగమైన అనర్దక చర్య్గా భావిస్తున్నా
తెలుగు నేలమీద శివసాగర్ అటు శిల్పం లో కానీ ఇటు దృక్పదం లో కానీ ఎప్పటికీ తనదయిన ముద్రవేసి పోయాడు .
ఇంటర్వ్యూ బాగుంది సర్ —-నా ఒపీనియన్ కూడా లింగా రెడ్డి గారు రాసినట్లు — యింకా అడగవలిసి ఉండే
–గుర్రం గారు — చెరబండ రాజు గారి బుక్స్ — (మల్లి మార్కెట్ లో దొరికేలా ) కూడా పబ్లిష్ చేస్తే
బాగుంటుదని తలుస్తాను —
————————————————————–
బుచ్చి రెడ్డి గంగుల