‘ గుర్రం సీతారాములు ’ రచనలు

శివసాగర్ ముద్ర శాశ్వతం: గుర్రం సీతారాములు

శివసాగర్ ముద్ర శాశ్వతం: గుర్రం సీతారాములు

మొట్టమొదటి సారి శివసాగర్ కవిత్వాన్ని సంకలనం చేసిన ఖ్యాతి గుర్రం సీతారాములుదే! ఎన్నో కష్టానష్టాలకోర్చి తగిన సమయంలో శివసాగర్ కవితలన్నీ వొక పొత్తంగా కూర్చి మనకి అందించిన సీతారాములు తెలుగు, ఆంగ్ల సాహిత్య విమర్శల పట్ల ఆసక్తితో హైదరబాద్ లోని ప్రతిష్టాత్మకమయిన సీఫెల్ యూనివర్సిటీలో చేరారు. గత కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న పరిశోధనల ఫలాలు ఇంకా మనకి అందాల్సి వుంది. కానీ, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఈ తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ సీతారాములు పీడిత స్వర నగారా వినిపిస్తున్న కార్యశీలి. శివసాగర్ కి ఎంతో సన్నిహితుడయిన సీతారాములుతో కాసేపు:

 

శివసాగర్ కవిత్వ  సంకలనం  తేవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ?

- ఒకరోజు…
పూర్తిగా »

ఒక సామాజిక సంవాదం చెయ్యాలంటే కేవలం కవిత్వం మీదే ఆధారపడలేం

ఒక సామాజిక సంవాదం చెయ్యాలంటే కేవలం కవిత్వం మీదే ఆధారపడలేం

(ఆంధ్రజ్యోతి వివిధ లో అచ్చయిన అఫ్సర్ గారి ఇంటర్వ్యూ  పూర్తి పాఠం ఇదీ… )

అఫ్సర్…. ఈ పేరు తెలుగు సాహిత్య జీవులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఖమ్మం జిల్లాలో ఒక మారు మూల గ్రామం అయిన చింతకాని ఊరుబడి నుండి  టెక్సాస్ యూనివర్సిటీ దాకా అతని నడక,  మేధో యాత్రలో ఆలోచనల్ని ప్రోది చేసుకొనే క్రమం అంత సులువుగా జరిగింది కాదు. తండ్రి కౌముది నించి అభ్యుదయ సాహిత్య వారసత్వం, తల్లి వేపు కుటుంబం నించి వామ పక్ష రాజకీయాల ప్రభావం…వీటన్నీటి పునాది మీద నిర్మించుకున్న అస్తిత్వ వేదన అఫ్సర్.  ఆమెరికాలో ఉన్నా తన వూరితో  ముడిపడిన మూలాల వెతుకులాట అఫ్సర్.…
పూర్తిగా »