అశుతోష్ ముఖర్జీ రాసిన “నర్స్ మిత్ర” అనే బెంగాలి కథను 1959లో దర్శకుడు అసిత్ సేన్ “Deep jwele jaai” పేరుతో బెంగాలి సినిమాగా తీసారు. “సుచిత్రా సేన్” నాయిక. అదే చిత్రాన్ని 1969లో “ఖామోషీ” పేరుతో అసిత్ సేన్ హిందీలో రీమేక్ చేసారు. వహీదారెహ్మాన్, రాజేష్ ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించారు…లేదు లేదు జీవించారు. ఇదే సినిమాను తెలుగులో 1960లోనే “చివరకు మిగిలేది” పేరుతో “గుత్తా రామినీడు” గారు తీశారు. ఇందులో నాయిక పాత్రను బెంగాలీ, హిందీ నటీమణులకన్నా మన సావిత్రి అత్యద్భుతంగా పోషించిందని అంతా అంటారు. ప్రియురాలికి దూరమై మానసికరోగిగా మారిన ఒక ప్రముఖ రచయితను ఒక నర్స్ ఎలా మామూలు మనిషిగా మార్చింది అన్నది కథాంశం. విధినిర్వహణార్థం రోగికి పరిచర్యలు చేసే నర్సులు కూడా మనుషులేనని, వాళ్ళకూ మనసు ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదని ఈ కథ చెప్తుంది ! ఆ సంగతి హాస్పటల్ చీఫ్ మర్చిపోవటం వల్ల సినిమాలో చివరికి నర్సే మానసికరోగిగా మారిపోవటం అనేది కథాపరంగా సముచితమే అయినా భారమైన సత్యమవటం వల్ల మనకు జీర్ణించుకోవటానికి సమయం పడుతుంది. పతాక సన్నివేశం లో “నేను నిజం చెప్తున్నాను.. నేను నటించలేదు.. నేను ఎప్పుడూ నటించలేదు…నేను నటించలేను.. నటించలేను..” అనే రాధ మాటలు, “నాలో ఊపిరున్నంతవరకు నేన్నీకోసం ఎదురుచూస్తాను…” అని అరుణ్ వాగ్దానం, చిట్టచివర్లో కటకటాలతలుపు వెనకాల్నుంచి విలపిస్తూ రాధ నిల్చుండిపోయిన దృశ్యాలు మనసుని మెలిపెడతాయి మరి !
హేమంత్ కుమార్ చిరస్మరణీయమైన నేపథ్యసంగీతాన్ని అందించిన ఈ సినిమాకు ప్రముఖ కవి, గేయ రచయిత “గుల్జార్” రాసిన పాటలు బహుళజనాదరణ పొందాయి. హేమంత్ స్వయంగా పాడిన “తుమ్ పుకార్ లో” హాంటింగ్ మెలొడీ ఐతే, “వో షామ్ కుచ్ అజీబ్ థీ”, “దోస్త్ కహా కోయి తుమ్ సా..” , “ఆజ్ కి రాత్..” అనే చిన్ని కవితాగానం మూడూ కూడా సంగీతపరంగా, సాహిత్యపరంగా ఆకట్టుకుంటాయి. ఇవి కాక ప్రత్యేకంగా చెప్పుకోవల్సినది “హమ్ నే దేఖీ హై.. ” గీతాన్ని గురించి. కథలో రోగి(అరుణ్)కి పూర్వ స్మృతి గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో, నర్స్(రాధ) గతంలో అరుణ్ రాసిన ఈ పాటను వినిపిస్తుంది. ఈ పాటలో ప్రేమ యొక్క లక్షణాలను తెలిపే ప్రయత్నం చేస్తాడు కవి.
సినిమాల పుణ్యమా అని ఇవాళ్టిరోజున “ప్రేమ” అంటే యువతీయువకుల మధ్యన మాత్రమే ఏర్పడే బంధమనే అపోహ బలపడిపోయింది. కానీ ప్రేమ అంటే ఇదొక్క బంధమేనా? భగవంతుడికీ భక్తునికీ మధ్యన, ఇద్దరు స్నేహితుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, తండ్రీకూతుళ్ల మధ్యన, తల్లీపిల్లలమధ్యన, రచయితకూ పాఠకుడికీ మధ్యన, నటులకూ అభిమానులకూ మధ్యన.. అందరి మధ్యనా ఉండేదీ ప్రేమే. ఒక్కొక్కరి భావతీవ్రత నిష్పత్తి లో తేడా ఉంటుందేమో కానీ “ప్రేమ” అనే అనుభూతి మాత్రం అంతటా ఒక్కటే. ఇవేమీ కూడా కాక ఒకోసారి ఏ బాంధవ్యం లేకపోయినా, ఏ పరిచయం లేకపోయినా.. ఓ గానం వినో, రచన చదివో, కవిత చదివో, మాటాతీరూ నచ్చో కొందరిపై ప్రేమ ఏర్పడుతుంది. అటువంటి అవ్యాజమైన ప్రేమకి ఏదో పేరునీ, ఏదో రకమైన సంబంధాన్నీ ఆపాదించలేము. అనుభూతికి మాత్రమే అందే అటువంటి ప్రేమ స్వచ్ఛమైనది, మలినం లేనిది. ఇదే భావాన్ని ఈ పాట మనకు తెలుపుతుంది. లతా మంగేష్కర్ పాడిన అపురూపమైన గీతాల్లో ఒకటైన ఈ గీతార్థాన్ని చూద్దామా మరి..
“హమ్ నే దేఖీ హై..” వాక్యార్థం:
हम ने देखी है उन आँखों की महकती खुशबू
నే చూసాను.. ఆ కన్నుల్లో గుబాళించే పరిమళాన్ని
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
దాన్ని చేతితో తాకి సంబంధాల కళంకాన్నివ్వకు
सिर्फ़ एहसास है ये रूह से महसूस करो
ఇది అనుభూతి మాత్రమే.. దీనిని ఆత్మతోనే స్పృశించు
प्यार को प्यार ही रहने दो कोई नाम न दो
ప్రేమను ప్రేమగానే ఉండనీ.. ఏ పేరునీ ఆపాదించకు
हम ने देखी है …
నే చూసాను..
భావం: నీ కళ్ళలో పరిమళించే అభిమానాన్ని చూసాను. ఆత్మతో మాత్రమే తాకగల అనుభూతి అది. ఈ అనుభూతికి ప్రాపంచిక సంబంధాలను ఆపాదించి మలినపరచకు. ప్రేమను ప్రేమ గానే ఉండనివ్వు.
1చ: प्यार कोई बोल नहीं, प्यार आवाज़ नहीं
ప్రేమ మాట కాదు, ప్రేమ పిలుపు కాదు
एक खामोशी है – सुनती है कहा करती है
ఒక మౌనం – మౌనంగానే వింటుంది, మాటాడుతుంది
ना ये बुझती है ना रुकती है ना ठहरी है कहीं
ఇది నశించిపోదూ, ఎక్కడా ఆగిపోదూ.. నిలిచిపోదూ
नूर की बूँद है – सदियों से बहा करती है
ఇది ఒక కాంతి కిరణం – యుగాల తరబడి ప్రయాణిస్తూనే ఉంటుంది
सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
ఇది అనుభూతి మాత్రమే.. దీనిని ఆత్మతోనే స్పృశించు
प्यार को प्यार ही रहने दो कोई नाम न दो
ప్రేమను ప్రేమగానే ఉండనీ.. ఏ పేరునీ ఆపాదించకు
हम ने देखी है …
నే చూసాను..
భావం: మాటల కందని భావన ప్రేమ. మౌనంలోనే సంభాషిస్తుంది. ప్రేమ సర్వవ్యాపి, అక్షరమైనది. ఆత్మతో మాత్రమే తాకగల అనుభూతి అది. ఈ అనుభూతికి ఏ ప్రాపంచిక సంబంధాలనూ ఆపాదించకు. ప్రేమను ప్రేమ గానే ఉండనివ్వు.
2చ: मुस्कराहट सी खिली रहती है आँखों में कहीं
చిరునవ్వులా కళ్ళలో ఎక్కడో వికసించే ఉంటుంది
और पलकों पे उजाले से छुपे रहते हैं
కనురెప్పల్లో వెలుగులానూ దాగుంటుంది
होंठ कुछ कहते नहीं, काँपते होंठों पे मगर
పెదవులేమీ పలకవు కానీ వణికే ఆ పెదాలపై..
कितने खामोश से अफ़साने रुके रहते हैं
ఎన్ని మౌనగాథలు దాగి ఉంటాయో
सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
ఇది అనుభూతి మాత్రమే.. దీనిని ఆత్మతోనే స్పృశించు
प्यार को प्यार ही रहने दो कोई नाम न दो
ప్రేమను ప్రేమగానే ఉండనీ.. ఏ పేరునీ ఆపాదించకు
हम ने देखी है …
నే చూసాను..
భావం: కనురెప్పల మాటున వెలుగై, కళ్లతోనే చిరునవ్వులు చిందిస్తుంది ప్రేమ. మౌనంగా ఉన్న పెదవులమాటున ఎన్నో కథలు దాగి ఉంటాయి. ఆత్మతో మాత్రమే తాకగల అనుభూతి అది. ఈ అనుభూతికి ఏ ప్రాపంచిక సంబంధాలనూ ఆపాదించకు. ప్రేమను ప్రేమ గానే ఉండనివ్వు.
ఈపాటని ఇక్కడ వినవచ్చు:
http://www.raaga.com/play/?id=3561
“ఖామోషీ” సినిమాని ఇక్కడ చూడచ్చు:
http://www.youtube.com/watch?v=de-MNpZ9gyI
తృష్ణ గారు, చక్కగా వుందండీ మీ అనువాదం. పాటలో భావాన్ని మీరు విడమర్చి చెప్పిన విధానం ఎంతో బావుంది
@లలిత: thanks లలితగారూ.
మీరు రాసిన వ్యాఖ్యానం చాలా బాగుందండీ…
మంచి మంచి పాటలను అనువదిస్తూ ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తున్నారు, థాంక్స్.
thanks venu gaaru.
“సినిమాల పుణ్యమా అని ఇవాళ్టిరోజున “ప్రేమ” అంటే యువతీయువకుల మధ్యన మాత్రమే ఏర్పడే బంధమనే అపోహ బలపడిపోయింది. కానీ ప్రేమ అంటే ఇదొక్క బంధమేనా? భగవంతుడికీ భక్తునికీ మధ్యన, ఇద్దరు స్నేహితుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, తండ్రీకూతుళ్ల మధ్యన, తల్లీపిల్లలమధ్యన, రచయితకూ పాఠకుడికీ మధ్యన, నటులకూ అభిమానులకూ మధ్యన.. అందరి మధ్యనా ఉండేదీ ప్రేమే. ఒక్కొక్కరి భావతీవ్రత నిష్పత్తి లో తేడా ఉంటుందేమో కానీ “ప్రేమ” అనే అనుభూతి మాత్రం అంతటా ఒక్కటే. ఇవేమీ కూడా కాక ఒకోసారి ఏ బాంధవ్యం లేకపోయినా, ఏ పరిచయం లేకపోయినా.. ఓ గానం వినో, రచన చదివో, కవిత చదివో, మాటాతీరూ నచ్చో కొందరిపై ప్రేమ ఏర్పడుతుంది. అటువంటి అవ్యాజమైన ప్రేమకి ఏదో పేరునీ, ఏదో రకమైన సంబంధాన్నీ ఆపాదించలేము. అనుభూతికి మాత్రమే అందే అటువంటి ప్రేమ స్వచ్ఛమైనది, మలినం లేనిది”
ఎంత సున్నితంగా చెప్పారండీ సెబాసో
“కనురెప్పల మాటున వెలుగై, కళ్లతోనే చిరునవ్వులు చిందిస్తుంది ప్రేమ. మౌనంగా ఉన్న పెదవులమాటున ఎన్నో కథలు దాగి ఉంటాయి. ఆత్మతో మాత్రమే తాకగల అనుభూతి అది. ఈ అనుభూతికి ఏ ప్రాపంచిక సంబంధాలనూ ఆపాదించకు. ప్రేమను ప్రేమ గానే ఉండనివ్వు.”
అద్భుత:
వ్యాసం, అనువాదం నచ్చినందుకు ధన్యవాదాలు పప్పుగారూ. అంతా గుల్జార్ మహత్యం !!
నాకిష్టమైన సినిమా, ఇష్టమైన పాట. చాలా బాగా రాసారు.
ధన్యవాదాలు రమాసుందరి గారూ.
తృష్ణ గారూ
నాకు నచ్చిన ఇంకో పాట…అంతే నచ్చేట్టు మీ పరిచయం! ఇందులోని ప్రతి వాక్యమూ నా కూనిరాగమే! మరీ ముఖ్యంగా ఈ వాక్యం…
सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
ఇది అనుభూతి మాత్రమే.. దీనిని
దీనిని ఆత్మతోనే స్పృశించు…
అఫ్సర్ గారూ, మీ వ్యాఖ్య నిజంగా గొప్ప ప్రశంస నాకు! మంచి వ్యాఖ్య ఇంకా రాయగలగాలనే ఉత్సాహన్ని పెంచుతుంది. ధన్యవాదాలు.
చాలా బాగుంది తృష్ణా!భావార్ధం తెలీక పోవడంవల్ల,ఎన్నోసార్లు విన్నా, ఈ పాట గురించి నాకు పెద్ద ఆసక్తి లేదు.”ఓ షాం కుచ్….”నాకు చాలాఇష్టం.
అర్థాలు తెలీని చిన్నతనమప్పుడు నాకూ “వో షామ్” నచ్చేది ఇందిర గారూ.. కానీ ఈ పాటలోని లోతు తెలిసాకా ఇదే ఎక్కువగా నచ్చేసింది..:)సంగీతపరంగానేమో “తుమ్ పుకార్ లో” నచ్చుతుంది.. Hats off to Hemant da !
నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి.
చివరకు మిగిలేది సినిమా చాలా బాగుంటుంది. మేము రెండు మాట్లు చూసాం ఆడిన నాల్గైదు రోజుల్లో. వైజాగ్ లో. పాటలు అన్నీ బాగుంటాయి.అశ్వత్థామ సంగీతం, మల్లాది వారి సాహిత్యం. బెంగాలీ,హిందీ లలో కూడా చూసాను. సావిత్రి గురించి ఏమీ చెప్పఖ్ఖర్లేదు కదా.
తెలుగులో మూడు పాటలు, అందానికి అందం నేనే, సుధవో సుహాసిని, చెంగున అలపైన ఎగిసిపోతుంట నేను, నాకు చాలా నచ్చాయి. కొన్ని కాపీ ట్యూన్స్.
ఈ మీ టపా చాలా బాగుంది.
బులుసు గారూ, మధ్యాహ్నం ఎలాగో మిస్సయ్యానండి…టపా నచ్చినందుకు ధన్యవాదాలు.
మూడు భాషల్లోనూ చూసారా? గ్రేట్. ముగ్గురు నాయికల్లో మీకు ఎవరు నచ్చారు? “సుధవో సుహాసిని” ట్యూన్ హేమంత్ కుమార్ దే.. కొహ్రా సిన్మాలోని “ఏ నయన్ డరే డరే” పాట ట్యూన్ అండి. చాలా బావుంటుంది ఆ పాట కూడా.
నేను ఖమోషీ సినిమా చూడలేదండీ.మీ పోస్టు చదివాకా వెంటనే చూడాలనిపిస్తోంది.”వో షామ్ కుచ్ అజీబ్ ” పాట నాకు చాలా ఇష్టం.చాలా చక్కని అనువాదం.థాంక్స్ అండీ
wow nagini!చూడండి చూడండి.. i’d love to know your opinion
Thanks for the comment.
ఇంకో మంచి సినిమాలోని పాట! బాగా రాశారు, తృష్ణ గారూ..
నాకు మాత్రం తుమ్ పుకార్లో, వో షామ్ నచ్చినంతగా ఈ పాట నచ్చదు ఎందుకనో!? కొంచెం బ్లాండ్గా అనిపిస్తుంది…
వో షామ్ వింటుంటే అసలు ఆ సంధ్యాసమయానికే ఒక అర్ధంకాని గుబులు అలుముకుంటుంది
నిషీజీ,క్రితం సారి పద్మగారికి కనబరిచిన ఆశ్చర్యం ఈసారి మీకోసo
‘తుమ్ పుకార్ లో..’ సరే గానీ,”వో షామ్..” అయితే ఆ గుబులు నన్ను తాకకూడదనే వినటం ఎవాయిడ్ చేస్తాను
తృష్ణ గారు
మే నెల చలువ పందిరి బాగుందండీ .
పాట వింటూ మీ విశ్లేషణ చదవటం బాగుంది
భావం తో పాటు మీరు కధా కమామీషూ చెప్తోంటే హాయి గా ఉంది
@ram: articles నచ్చుతున్నందుకు ధన్యవాదాలు.