చాలా కాలం క్రితం చదివిన తుమ్మల దేవరావు గారి ఈ కవిత చాలాసార్లు నన్ను వెంటాడుతూ వచ్చింది. ఇందులో వున్న పదచిత్రాలు నన్ను బాగా అకర్షించాయి.
వర్షానికి నిర్వచనాలు, సూత్రీకరణలు, కొన్ని చిత్రాలు, అనుభూతి చెందడం ఎలా!, వాటివెనుక కొన్ని జ్ఞాపకాలు కన్పిస్తాయి. బీద ధనిక, గుడిసెలపైన భవంతులపైనా వకేలా కురుస్తుందని చెప్తూ
“వర్షం ఒక సమతా సూత్రం
భూమిని ఆకాశాన్ని కలిపి కుట్టే నీటి దారాల కండె”
ఆకాశానికి భూమికి మధ్య వున్న వేలకిలోమీటర్లను లెక్కిస్తున్న శాస్త్రపరిజ్ఞాన్ని చాలా సులువుగా సూత్రీకరిస్తున్నట్టు కన్పిస్తుంది. సమాంతరంగా వుండే రెండిటినీ కలిపి వుంచడానికి కలిపికుట్టే దారపుకండె అని ప్రతిపాదిస్తాడు.
మన నిత్యజీవితంలో దారం జీవన సౌందర్యానికి అంతర్భాగమయ్యింది. అలంకరించుకొనే దుస్తుల్లో దారము వుంటే, వాటిని మన శరీర ఆకృతుల్లోకి వాటికి సంసిద్ధత చేయడానికి కుట్టేది కూడా దారమే. దుస్తులు చిరిగిపోవచ్చేమో గాని వాటిని కుట్టిన దారం మాత్రం చెదరకుండా వుంటుంది కదా! అలా భూమిని ఆకాశాన్ని కలిపి కుట్టి వుంచడానికి వర్షం ఒక నీటి దారాల కండె అంటాడు.
“మట్టికి పురుడుపోసే మంత్రసాని
వాడిపోతున్న పచ్చదనానికి
వన్నె తెచ్చే పసరు మందు
రైతుకి భూమికి అనాది రక్తసంబంధపు దగ్గరి చుట్టం”
పచ్చదనన్ని మొలకెత్తించే ప్రక్రియలోని భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ పురుడుపోసే మంత్రసానితో పోలుస్తూ, రైతుకు కుండే సంబంధాన్ని తెలియచేస్తాడు.
వాన పాత్ర, దానికున్న సంబంధాన్ని, వాన కురిసిపోవడమే కాకుండా కురుస్తూ కురుస్తూ తెచ్చే ఒక విధానాన్ని, అందులోని అంతసూత్ర జీవాన్ని తెలియచేస్తుంటాడు.
ఎన్ని చిత్రాలను మనసు కేన్వాసుపై చిత్రిస్తాడో చూడొచ్చు.
కవిత్వాన్ని పదచిత్రాలుగా వ్యక్తీకరిస్తున్న నేపద్యంలో గొప్ప అనుభూతిని కలిగించేవే ఈ పద చిత్రాలు. కవిత్వంలో పదచిత్రాలు అనే అంశంపై శ్రీ లంకా వెంకటేశ్వర్లు పరిశొదనా అంశములో కూడా ఈ కవితను కోట్ చేసిన గుర్తు.
గుండెను చింపుకుని నేలమీద నీటి దీపాలుగా వాలుతున్న
కమనీయ దృశ్యం
పరుగులెట్టే పాయలమీద
పొడుచుకు వచ్చిన కనుపాపలు … పాయలుగా పారుతున్న నీటిపై ఒక్కసారిగా పడిన చినుకుతో ఏర్పడే నీటి బుడగలను నుపాపలుగా ఊహించడం వాటిని అక్షరీకరించడం కమనీయంగా
అన్పించక మానదు కదా!
వర్షం ధారలు… ధారులుగా వెండి జలతారుగ!
ఎండిన బీడు డొక్కలను ప్రేమతో తడిపేది
కాగితపు పడవల మీద బాల్యాన్ని పరిగెత్తించుకునే
చిన్నారుల ఆప్త మిత్రుడు … బాల్యంలో కాగితపు పడవలతొ ఆడుకోవడం ఒక అనిర్వనీచయనీయమైన అనుభూతి. ప్రస్తుత నేపద్యంలో బాల్యాన్ని కోల్పోతున్న పరిస్థితులు కన్పిస్తాయి.
గొడుక్రింద బసచేసి గుండె బాసలు
విప్పుకుంటున్న జంటలకు
రాయబారి వర్షం … “చిటపట చినుకులు పడుతూవుంటే అనే పాట దశబ్దలుగా మనల్ని రంజింపచేస్తునే వుంది. జంటలు ఒకే గొడుగును పంచుకోవడంలో కలిగే తడితనమూ, చలితనమూ మధ్య స్పర్శతో పుట్టే వెచ్చదనము వీటికి రాయబారిగా వాన మారటం ఎప్పుడొ ఒకప్పుడు ప్రతివొక్కరికి అనుభవమయ్యేదే కదా!
దుమ్ము ధూళి మీద ధారలు … ధారలుగా వర్షం
మట్టి పరిమళాన్ని శ్వాసిస్తూ
లేగదూడ గంతులేసినపుడు చిరుగాలితో స్వాగతం పలికి చినుకులతో వీపు మీటే కామధేనువు … లేగదూడ తన ఆనందాన్ని వ్యక్తీకరించే సాధమే గంతులు వేయడం. ఆ గంతులు చూడటానికి భలే ముచ్చట గా అన్పిస్తాయి. వీపును నిమిరే కామదేనువుతో పొందే మధురమైన ఆప్యాయతానుభూతిని మన ముందుంచుతుందీ పదచిత్రం
చెరువు నిటిలో వెండి ముగ్గులు పెట్టే నవ వధువు …నన్ను అమితంగా ఆకర్షించిన పదచిత్రం. స్త్రీలు ముగ్గులు పెట్టడంలో సృజన మరియు సౌందర్యము కనిపిస్తుంది. అటువంటిది నవవధువు కొత్త శోభతో, కొత్త అలంకరణలతో, సౌందర్యముతో ముగ్గుల కోసం చుక్కలు పెడుతుంటే ఆ దృశ్యం ఎంత సౌందర్యంగా వుంటుందో కదా! అలాంటి ఒక వాతావరణ సౌందర్యాన్ని చెరువును వాకిలిగా చేసుకొని ప్రకృతి వానతో కలిసి చుక్కలు పెడ్తున్నట్టు దృశ్యాన్ని మన ముందుంచాడానికి చేసే ప్రయత్నం.
కొండలను కరిగించే కొంటె సమ్మెట
వర్షం ధారలు… ధారలుగా … అప్పుడప్పుడూ ఎడతెగని వాన వల్ల కొండచరియలు విరిగి పడ్డాయని వింటూవుంటాం. కరుకుగా వున్న కొండలను సహితం ప్రభావితం చెయ్యగల శక్తి కన్పిస్తుంది
వొక పద్యంలా… జానపదంలా.. చుక్కల వనంలా.. …పద్యానికి పొందిన అనుభూతిని వానతో కలుపుకొని ఆనందించడం. మనిషి మూలమైన జానపదం వానతోనే ముడిపడివుంటుంది. సమయ సమయాలలో పడే వానకొరకు ఎదురు తెన్నులు చూస్తూ, దానితో
ముడిపడిన వ్యవసాయ పనితనం జానపదం వుంటుందని వేరే చెప్పాలా!
రండి పిల్లలారా!
బడులు వదిలి – గుడులు వదిలి
వర్షోత్సవంలో కేరింతలు కొడుతూ తడిసి తరిద్దాం!!
రండి పిచ్చుకలారా!
గూళ్ళువదిలి
ఎండిపోతున్న గుండెలను
చూరునీళ్లతో తడుకుండాం
పత్రాల మీద పడుతున్న నీటి చప్పుళ్లను
చెవులుపెట్టి విందాం
మనుషులారా రండి!
కాంక్రీటు భవనాల ఖైది చెరను వదిలి
పచ్చిక బీళ్లలో వర్ష సంగీత విభావరి తిలకిద్దాం
వికృతంగా మారుతున్న మనోఃకృతిని
కొత్తగా ఆవిష్కరించుకుందాం!
తను తడిసిన వానలో తనతో పాటు మనల్నీ ఆనందించడాన్కి, అనుభూతి చెందడాన్కి ఆహ్వానం పలుకుతాడు. మనం ఏ పరిస్థితుల్లో ఇరుక్కుపోయినా వాటిని వదిలించుకుని వచ్చినప్పుడు ప్రకృతి అందించే వానలో తడసి అనిర్వచనీయమైన అనుభూతిని ఎవరకువారే
పొందమంటాడు.
వర్షంచేసే సవ్వడులను తిలకిస్తూ, ఆలకిస్తూ మనల్ని మనం కొత్తగా అవిష్కరించుకుందాం అని పిలుస్తుంటాడు.
————————————————————————————
వర్షోత్సవం …వర్షోత్సవం …
బీడు భూములపైన, పచ్చని వరిపైరుల మీద
గడ్డితో కట్టుకున్న పూరి గుడిసెల మీద
పాలరాతి భవంతులపై – దేవాలయాలపై !
ధారలు … ధారలుగా వర్షం
వర్షం ఒక సమతా సూత్రం
భూమిని ఆకాశాన్ని కలిపి కుట్టే నీటి దారాల కండె
మట్టికి పురుడుపోసే మంత్రసాని
వాడిపోతున్న పచ్చదనానికి
వన్నె తెచ్చే పసరు మందు
రైతుకి భూమికి అనాది రక్తసంబంధపు దగ్గరి చుట్టం
గుండెను చింపుకుని నేలమీద నీటి దీపాలుగా వాలుతున్న
కమనీయ దృశ్యం
పరుగులెట్టే పాయలమీద
పొడుచుకు వచ్చిన కనుపాపలు
వర్షం ధారలు… ధారులుగా వెండి జలతారుగ!
ఎండిన బీడు డొక్కలను ప్రేమతో తడిపేది
కాగితపు పడవల మీద బాల్యాన్ని పరిగెత్తించుకునే
చిన్నారుల ఆప్త మిత్రుడు
గొడుక్రింద బసచేసి గుండె బాసలు
విప్పుకుంటున్న జంటలకు
రాయబారి వర్షం
దుమ్ము ధూళి మీద ధారలు … ధారలుగా వర్షం
మట్టి పరిమళాన్ని శ్వాసిస్తూ
లేగదూడ గంతులేసినపుడు చిరుగాలితో స్వాగతం పలికి
చినుకులతో వీపు మీటే కామధేనువు
చెరువు నిటిలో వెండి ముగ్గులు పెట్టే నవ వధువు
కొండలను కరిగించే కొంటె సమ్మెట
వర్షం ధారలు… ధారలుగా
వొక పద్యంలా… జానపదంలా.. చుక్కల వనంలా..
ఇంధ్రధనువులా!
రండి పిల్లలారా!
బడులు వదిలి – గుడులు వదిలి
వర్షోత్సవంలో కేరింతలు కొడుతూ తడిసి తరిద్దాం!!
రండి పిచ్చుకలారా!
గూళ్ళువదిలి
ఎండిపోతున్న గుండెలను
చూరునీళ్లతో తడుకుండాం
పత్రాల మీద పడుతున్న నీటి చప్పుళ్లను
చెవులుపెట్టి విందాం
మనుషులారా రండి!
కాంక్రీటు భవనాల ఖైది చెరను వదిలి
పచ్చిక బీళ్లలో వర్ష సంగీత విభావరి తిలకిద్దాం
వికృతంగా మారుతున్న మనోఃకృతిని
కొత్తగా ఆవిష్కరించుకుండాం!
-తుమ్మల దేవరావు
21 జనవరి, 2000 ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురణ (1999 రంజని కుందుర్తి అవార్డు పొందినది)
——————————————————————————————–
తుమ్మల దేవరావుతో చిన్న సంభాషణ
కవిత రాసిన 1998 నుండి 2013 వరకూ సాగిన మీ కవిత్వ పయనంలో పొందిన అనుభవాన్నుంచి ఇదే కవితను/వస్తువును ఇప్పుడు రాయమంటే ఇలాగే రాస్తారా లేదా వేరేగా రాయొచ్చు అంటారా?
తప్పకుండా ఒక వస్తువును ఎప్పుడు రాసినా కొత్త భావాలు వస్తాయి. నదిలో నీళ్ళు పాదం మోపినప్పుడు అనుభూతి వేరువేరుగా వుంటుంది.. నీరు అలాగే వున్నట్టు కన్పించినా అందులో ప్రవాహముంటుంది కదా!
ఆలోచనా పరిథి పెరిగిన తర్వాత వైవిధ్యభరితమైన ఆలోచనలు వస్తాయి. ఒక్కోసారి ముందు రాసిన దానికంటే గొప్పగా రాయొచ్చు, ఒక్కోసారి రాయనూ లేకపోవచ్చు. అందులో మనల్ని ప్రభావితం చేసిన అంశాలు చాల వుంటాయి కాబట్టి ఆ సమయానికి ఎలా రాసామన్నదే ముఖ్యం.
మిమ్మల్ని పలకరించి చాలా కాలం అయ్యింది. కారణాలు ఏమైనా మనం కలవలేకపోయాం. చాలా కాలం తర్వాత మీ కవిత్వంతో మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీకెలా అన్పిస్తుంది?
కొంచెం ఉత్కంట కలిగింది. మళ్ళి మీనుంచి ఫోను రావటం ఆనందానికి గురిచేసింది. మనకు నచ్చిన కవులుంటే సంబందాలు దెబ్బతిన్నా, తర్వాత ఇలా కలిస్తే ప్రేమ సాంద్రత తగ్గదు కదా!
ఈ కవిత లేదా ఈ సంపుటిపై(కచ్చురం) ఇదివరకే కొన్ని అభిప్రాయాలు వచ్చాయికదా వాటిని ఏమైనా పంచుకో గలరా?
ముఖ్యంగా శ్రీ నాగభైరవ కోటేశ్వర రావు వార్తలో రాసిన పరిచయం నాకు మరుపు రానిది. రమణీయమైన ప్రతిరూపాలు ఇందులోని పదచిత్రాలు అని అభివర్ణించడం గొప్ప అనుభూతి.
మిమ్మల్ని ప్రభావితంచేసిన అంశాలు, కవులు కవిత్వం గురించి చెప్తారా?
పుట్టిపెరిగిన నేపద్యమే కారణం. బాల్యం కథల ప్రపంచంలో తేలియాడిన అనుభవాలు.
కాలేజీకి వచ్చాక కొంతమంది కవులను చదవటంవల్ల కవిత్వంపై మక్కువ ఏర్పడింది. బహుశ గుంటూరు శేశేంద్ర శర్మ, తిలక్ ప్రభావం నాపై వుందని అన్పిస్తుంది.
రాసినది చదివే పాఠకునికి గొప్ప అనుభూతి కగాలనేదే నాకు అనిపించేది.
విస్తృతమౌతున్న అంతర్జాలంలో కనబడటంలేదు ఎందుకని?
నిర్మల్, అదిలాబాదు జిల్లాలో పనిచేస్తూ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనుకబడటమే కారణం కావొచ్చు. ఇతర వ్యాసాలమీద దృష్టి పెట్టడం కారణం కావొచ్చు.
అదిలాబాదు జిల్లా చారితక వ్యాసాలను, జిల్లాలోని కవులను గురించిన వివరాలను, జిల్లాలోని దేవాలయాల చరిత్ర, నేపద్యాలు అధ్యయనం చేస్తున్నందువల్ల కావొచ్చు.
మీ రచనలు గురించి?
కచ్చురం – కవిత్వం
గడ్డిపూలు – హైకూలు….. వచ్చినవి
జంగిడి కవిత్వం
నిర్మల్ కథలు
అదిలాబాదు చరిత్ర
సాహిత్య వ్యాసాలు … రావాల్సినవి… రాబోయేవి.
Your review on poem is nice, congrats.
స్పందనకు ధన్యవాదములు
“చెరువు నిటిలో వెండి ముగ్గులు పెట్టే నవ వధువు’…కవి తుమ్మల దేవరావు గారి కవనా వైచిత్రితో ఈ కవిత తీర్చిదిద్దిన తీరు అద్భుతమ్.ఈ కవిత ను మీరు విస్లేషించిన తీరు మహాద్భుతం….. జాన్ సాబ్ డియర్ జాన్ హైడ్ కనుమూరి.
Thank you Nutakki Raghavendra Rao gaaru
very nice review annagaaroo! …. marinni review la kosam eduruchoostaamu! chaalaa baagaa raasaaru! thank you!
thanks thammi
chaalaa baagundi … kavithvam , daani vishleshana daanitho paatu kavitho mee sambhaashana .. eppudu chadive varshaanni kottagaa chustunnattu .. dhanyavaadalu ..
చాలా బాగుంది … కవిత్వం , దాని విశ్లెషణ దానితో పాటు కవితో మీ సంభాషణ .. ఎప్పుడు చదివే వర్షాన్ని కొత్తగా చూస్తున్నట్టు .. ధన్యవాదలు ..
మెర్సీ మార్గరెట్
నాకు నచ్చినదాన్ని గురించి చెప్పడం నీకుతెలిసిందేగా!
thummala devarao kavitha nature ni kallamundu unchindi. varsham meeda goppa kavitha .mee analyse chala bagundi eddariki danyavadalu
thanks for comment and responding
VARSHA SOUDARYAM KAVITVAM LO ADBUTANGA UNDI KAVI CHOOPU ANTARANGANNI MEETINDI.MEE VISHESHANA MARIYU KAVITHO KARACHALANAM VINUTNANGA UNDI. POEM OKA EPIC. VARSHAM MEEDA RAASINA BEST POEM EDENANUKUNTA.CONGRATS
హేమంత్ గ్రీష్మ గారు
అంతరంగాన్ని మీటిన కవిచూపును గ్రహించినందుకు ధన్యవాదములు
GODUGU KRINDA BASA CHESI GUNDE BASALU VIPPUKUNTUNNA PREMIKULAKU RAYABARI VARSHAM. VARSHAM SUNDARANGA, SHUDDANGA, NIJAMINA , KAVITVAM ANTE ELANA ANI PATAKUDU TANMAYATVAM CHENDUTAADU
సుజాత నిమ్మలగడ్డ గారు మీరు పొందిన తన్మయత్వానికి ధన్యవాదములు
sorry Sujatha gaaru for spell of ur name
వర్షపు ఒక్కో చినుకూ.. హృదయాన్ని.. హృద్యంగా తడపడమంటే ఇదేనేమో..
thanks a lot for introducing such a wonderful poem John sir
Jayashree Naidu gaaru
నేను తడిసిన అనుభూతి పదేళ్ళ పైమాటే అయినా ఇప్పుడే నా యెదురుగా
చెరువు నిటిలో వెండి ముగ్గులు పెట్టే నవ వధువు
అలానే కనిపిస్తుంది
మీ స్పందనకు ధన్యవాదాలు
Jayashree Naidu gaaru
నేను తడిసిన అనుభూతి పదేళ్ళ పైమాటే అయినా ఇప్పుడే నా యెదురుగా
చెరువు నిటిలో వెండి ముగ్గులు పెట్టే నవ వధువు
అలానే కనిపిస్తుంది
మీ స్పందనకు ధన్యవాదాలు
John,
delighted to read your writing
very good God be with you. show it to cvk garu if he able to read
if you send a print I may try to put it into english
addrees D-87 NTPC SEctor-33 Noida-201307
all the best
Rama rao
Thank you very much for your comment
వర్షోత్సవం అద్భుతంగా ఉంది జాన్ గారు..మంచి రచనను చదివించినందుకు ధన్యవాదములు
జ్యోతిర్మయి మళ్ళ gaaru
thanks for your comment
naa kavitvanni rasaardanga visheshana chesina john hyde kanumoori gariki chakkani spandanalu likistunna rachaitalaku hrudaya purvaka danyavaadalu .manchi ki ventane spandinchi rayacam chala goppa.
తుమ్మల దేవరావు గారు
నాకు నచ్చినదేదో అందరిముందూ వుంచాను
ధన్యవాదములు
గుండెను చింపుకుని నేలమీద నీటి దీపాలుగా వాలుతున్న కమనీయ దృశ్యం…
గొడుక్రింద బసచేసి గుండె బాసలు విప్పుకుంటున్న జంటలకు రాయబారి వర్షం;
చినుకులతో వీపు మీటే కామధేనువు;
చెరువు నిటిలో వెండి ముగ్గులు పెట్టే నవ వధువు…;
వొక పద్యంలా… జానపదంలా.. చుక్కల వనంలా…;
పచ్చిక బీళ్లలో వర్ష సంగీత విభావరి …
WoW! చక్కని పదచిత్రాలూ,అంతే చక్కని భాషా, చాలా హృద్యంగా ఉన్నాది కవిత. జాన్ హైడ్ కనుమూరి గారూ, ఒక మంచి కవిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. తుమ్మల దేవరావు గారూ, మీకు హృదయపూర్వక అభినందనలు.
NS MURTY GARU mee rasa spandanaki danyavadalu nannu parichayam chesina john gariki kuda!
thank you ns murty gaaru
varhasoudaryam lo tadisinaamu manchikavitanu parichayam chesinanduku danyavaadamulu
thank you shashi varsha