కవిత్వం

రెండే రెండు అక్షరాలు

జనవరి 2013

నా గుండెల్లో మునివేళ్లు ముంచి
రెండు అక్షరాల కోసం తడుముకున్నాను
తడిసిన రెండే రెండు అక్షరాలు
రెండు వేళ్లతో పట్టుకుని బయటికి తీసాను

అవి నిజానికి నేను నేలమీదకొచ్చాకా
పలికిన మొదటి రెండే రెండు అక్షరాలు

వాటిమీది అలలతో ఏకంగా
ఓ సముద్రమే బటకి వచ్చింది

వాటిని ఎవరో మట్టితో అలంకరించారు
మట్టికి ఎవరో ఆకుపచ్చని రెక్కలు తొడిగారు

భూమ్యాకాశాల రెక్కల్ని
రంగురంగుల పూలతో అలంకరించారు

పూలని గాలితరంగాలమీద ఊరేగించారు
గాలిని తేనెలో తడిపి దిక్కుల చివరి వరకూ
వినిపించేలా ఆలపించారు

పాటని సూర్య కాంతిలో మెరిసే
మంచుకొండల మధ్య ఆడుకోమని వదిలేశారు

మంచుకొండల ఒడిలో రుతువులు పిల్లలై తిరిగాయా!
లేక…. ……రుతువుల రంగుల ఉయ్యాల్లో
మంచుకొండలే పసిపాపలై ఆడుకుంటూ
తీయతీయని నవ్వులు రువ్వాయా !

గుండెల్లోంచి తీసిన రెండే రెండు అక్షరాలు
ఇంతటి అందాలు ఇచ్చినమ్మ

నాకింకెన్ని అందాలు ఇచ్చి ఉండాలి
కొసగాలుల విసురుల్లోనే ఇంతటి సౌందర్యం అయితే
అమ్మెంత అద్భుతమై ఉండాలి

గుండెల్లోని అమ్మెంత అద్భుతం అయిఉండాలి

 



One Response to రెండే రెండు అక్షరాలు

  1. December 25, 2012 at 3:16 am

    మీ బోధతి రెండు పాదాలు చదవగానే మేరు అమ్మ గురించి రాస్తున్నారని తెలిసిపోయింది.గుడ్ పోయెం

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)