కవిత్వం

తూంగురా హువా

05-జూలై-2013

అలికిడి లేని అతని దేహం
మూగబోయిన స్వరం
నిశ్చలంగా జీవం లేని ఆ కళ్ళు!

వెంటిలేటర్ పై ఒక జీవచ్చవం
శ్వాస నిశ్వాసల ఊగిసలాటల
జీవన్మరణాల వాయులీనగానం !

ఆ మస్తిష్కంలో ఆకాశాన్నంటే
ఉత్తుంగ కెరటాలూ
సుడులు తిరిగే ప్రవాహ ఉధృతీ
కల్లోలిత కన్నీటి శ్లోకాలూ!

చూపు కోల్పోయిన ఆకళ్ళు
నీతో మాట్లాడాలనుకుంటాయి.
నీ గొంతు విని నిన్ను గుర్తించటానికి
మదనపడుతుంటాయి.

నిప్పుల కుమ్పతిలా రాజుకుంటుంది
మాటరాని అతని మౌన గళం!
అతని స్వర పేటికలో మండుతున్న భాస్వరం లా
వలయాలు వలయాలుగా మాటల నీలి మంటలు !

పెగలని గొంతు లోంచి వెలికి రాని మాట
పెంజీకటి శోకం కాకమరేమిటి?
కొలిమి మంటల్లో ద్రవిస్తున్న లోహంలా
పరివ్యాప్త మౌతున్న బాధకి పర్యాయపదం
అతని నిశ్శ బ్ద గళమే కదా!

అయితే
ఒకరోజు నిద్రాణమైన అతని మస్తిష్కం
మేల్కొంటుంది

పడిపోయిన మాట రెక్కలు తొడుక్కుని
ఆమని గీతాల్ని తోడ్కొని వస్తుంది.
నిస్తేజమైన శరీరం జవజీవాల్ని
సంతరించుకుంటుంది.

 

నోట్: తూంగురా హువా అంటే నిప్పుల గొంతు అని అర్ధం. ఈక్విడార్ లోని క్విటోకి దక్షిణాన 135 కిమీ దూరంలో ఉన్న 5029 మీ ల ఎత్తు అగ్నిపర్వతం ఈ “తూంగురాహువా”2 Responses to తూంగురా హువా

  1. Mercy Margaret
    July 4, 2013 at 4:05 pm

    elaa spandinchaalo teliyaledu kaani .. maranapu ghadiyalu daggara paditea ilaa vuntundi kadhaa ani okka saari aa kshanaalni kougalinchu kunnattu vundi ..

  2. vijay kumar svk
    July 5, 2013 at 2:26 am

    chaala chaala baagundhi sir…

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)