‘ డా. ఎస్. ఏ. రవూఫ్ ’ రచనలు

తూంగురా హువా

తూంగురా హువా

అలికిడి లేని అతని దేహం
మూగబోయిన స్వరం
నిశ్చలంగా జీవం లేని ఆ కళ్ళు!

వెంటిలేటర్ పై ఒక జీవచ్చవం
శ్వాస నిశ్వాసల ఊగిసలాటల
జీవన్మరణాల వాయులీనగానం !

ఆ మస్తిష్కంలో ఆకాశాన్నంటే
ఉత్తుంగ కెరటాలూ
సుడులు తిరిగే ప్రవాహ ఉధృతీ
కల్లోలిత కన్నీటి శ్లోకాలూ!

చూపు కోల్పోయిన ఆకళ్ళు
నీతో మాట్లాడాలనుకుంటాయి.
నీ గొంతు విని నిన్ను గుర్తించటానికి
మదనపడుతుంటాయి.

నిప్పుల కుమ్పతిలా రాజుకుంటుంది
మాటరాని అతని మౌన గళం!
అతని స్వర పేటికలో మండుతున్న భాస్వరం లా
వలయాలు వలయాలుగా మాటల నీలి మంటలు…
పూర్తిగా »