రంగురంగుల మేఘాలన్నింటినీ విన్నాకా
మరే మేఘమూ వర్షించడానికి సిధ్ధంకానప్పుడూ
ఓ చిక్కటి మాటేదో పరిగెత్తుకొచ్చింది
కప్పుకోమంటూ….
చప్పున పట్టేసుకుని రంగులద్దేసాను.
జీవితమెక్కడ శూన్యస్వప్నమౌతుందోనన్న భయం పోయింది.
నెరుడా ప్రేమకవితలమీద ఈవ్నింగ్ వాక్
బెర్ట్రాండ్ రస్సెల్ తో మనసు చర్చా
బ్లేక్ బైరాన్ లూ కృష్ణశాస్త్రి శేషేంద్రలతో ప్రేమ మాటలూ
పద సౌందర్యాన్ని చూస్తూనే ఉన్నాడు రెండో సూర్యుడు
మాట ఘనీభవించినచోట మరో మాటనెత్తుకుంటూ
కొన్ని రక్తాశృవులని అధాటుగా విడిచిన కన్ను
మరికొన్ని క్షుద్రాశృవులని దాచేసుకుంటూ
కవిత్వనాట్యం చేస్తూనే ఉంటుంది
దాన్నుంచి మరో సూర్యుడు పుడుతూనే ఉంటాడు
వాడు నాలా అరుస్తూనే ఉంటాడు
కవిత్వ హృదయమంటూ……
రెండు క్షణాల మధ్య ఇరుక్కుని
అర్ధంకానిదేన్నో వెతుక్కోవటం ఎంతగొప్పగా ఉంటుందనీ..
అప్పుడే ఓ చక్రవాక జంట ప్రేమని మోస్తూ పోతుంటూంది.
నాలోని మరో సూర్యుడు వాటిని స్వాగతిస్తుంటాడు.
గడిచిన క్షణమొదిలిన పదాల హ్యాంగోవర్
ఇంకా గుండె గదిలినొదలదనీ తెల్సు
అక్షరాలందక చింపేసిన కాగితంలో నా మనసున్నట్టు
పైటజార్చిన ఆలోచన్లేవీ మాటవినవు
ప్రతివాకిట ముగ్గూ మరో ఆలోచనకి నాందే….
మనసుండాలేకానీ! నా రెండో సూర్యుడిలా
రెండు క్షణాల మధ్య ఇరుక్కుని
అర్ధంకానిదేన్నో వెతుక్కోవటం ఎంతగొప్పగా ఉంటుందనీ..
just beautiful…I am stuck here!
తులసి గారూ. థాంక్యూ. అలా ఆగిపోవాలనే కోరుకున్నా.
బాగుంది సర్
——————-బుచ్చి రెడ్డి గంగుల
థాంక్యూ బుచ్చిరెడ్డిగారూ.
కొన్ని రక్తాశృవులని అధాటుగా విడిచిన కన్ను
మరికొన్ని క్షుద్రాశృవులని దాచేసుకుంటూ
కవిత్వనాట్యం చేస్తూనే ఉంటుంది/
కవిత్వం అంతా బాగుంటుంది కాని కొన్నిపదాలదగ్గర ఆగిపోయి మళ్ళీమళ్ళీ చవించేలా చేస్తుంది అవే నేను పైన చేప్పిన పదాలు మీకవితలోనివి వాసుదేవ్ గారు…
రేణుకగారూ. కృతజ్ఞతలు.
1.చప్పున పట్టేసుకుని రంగులద్దేసాను.
జీవితమెక్కడ శూన్యస్వప్నమౌతుందోనన్న భయం పోయింది….
(అనుకోకుండానే అలా ఆగి ఆస్వాధించాను)
2.మాట ఘనీభవించినచోట మరో మాటనెత్తుకుంటూ….
(బ్యూటిఫుల్)
3.అక్షరాలందక చింపేసిన కాగితంలో నా మనసున్నట్టు
పైటజార్చిన ఆలోచన్లేవీ మాటవినవు
ప్రతివాకిట ముగ్గూ మరో ఆలోచనకి నాందే….
మనసుండాలేకానీ!
(అద్భుతం)
కొన్ని పద ప్రయోగాలూ.. క్షుద్రాశ్రువులు.. మాట ఘనీభవించిన చోటు..
కొన్ని దృశ్య పదాలు… అక్షరాలందక చింపేసిన కాగితం, పదాల హ్యాంగోవర్, రెండు క్షణాల మధ్య ఇరుక్కోవడం..
కవిత చదవడం లో కొత్త అనుభూతుల్ని… పాదాల్ని తాకి వెనక్కి వెళ్లి పోయే అలల్లా… మిగిలిన తడిలా… మంచి కవిత దేవ్ జి..
అర్ధంకానిదేన్నో వెదుక్కుంటూ క్షణానికి మరుక్షణానికీ మధ్య ఇష్టంగా ఇరుక్కోవడం…
మాట ఘనీభవించినచోట మరో మాటనెత్తుకుంటూ… రెండో సూర్యుడిలా… బయల్దేరడం…
బాగుంది బాగుంది వాసుదేవ్ గారు.
` నెరుడా ప్రేమకవితలమీద ఈవ్నింగ్ వాక్
బెర్ట్రాండ్ రస్సెల్ తో మనసు చర్చా
బ్లేక్ బైరాన్ లూ కృష్ణశాస్త్రి శేషేంద్రలతో ప్రేమ మాటలూ
పద సౌందర్యాన్ని చూస్తూనే ఉన్నాడు రెండో సూర్యుడు`
మీ పద మేదో సౌందర్యాన్ని అద్బుతంగా ప్రదర్సించారు.
మేధో మధనంతో పాటు సాగే మేఘసందేశం బాగుంది సార్..
కొన్ని రక్తాశృవులని అధాటుగా విడిచిన కన్ను
మరికొన్ని క్షుద్రాశృవులని దాచేసుకుంటూ
కవిత్వనాట్యం చేస్తూనే ఉంటుంది
దాన్నుంచి మరో సూర్యుడు పుడుతూనే ఉంటాడు
వాడు నాలా అరుస్తూనే ఉంటాడు
కవిత్వ హృదయమంటూ……! ఒక అద్భుతమైన లోతైన కవిత! వాసుదేవ్ గారు కవిత మొత్త౦ పద సౌ౦దర్య౦ తో నగిషీలు చెక్కబడి౦ది.
అక్షరాలందక చింపేసిన కాగితంలో నా మనసున్నట్టు
పైటజార్చిన ఆలోచన్లేవీ మాటవినవు
ప్రతివాకిట ముగ్గూ మరో ఆలోచనకి నాందే….
మనసుండాలేకానీ! నా రెండో సూర్యుడిలా
బ్యూటిఫుల్ పోయెమ్ సర్.
అక్షరాలందక చింపేసిన కాగితంలో నా మనసున్నట్టు – బాగుంది సర్
పద్మార్పిత, జయశ్రీనాయుడు, రచిత, థిరుపాల, సీవీ సురేష్, కెక్యూబ్ వర్మా, గద్దపాటి శ్రీనివాస్, ప్రసూన, సత్యనారాయణ–మీ ఆత్మీయాక్షరానికి ధన్యవాదాలు.
కవిత కొత్త అనుభూతిని ఇచ్చింది .
కవిత్వానికి పాఠం కవిత్వమే.
చాన్నాళ్ళకి కవిత్వానందాన్ని అంతర్ముఖంగా చూడగలిగిన భావన…
“రెండు క్షణాల మధ్య ఇరుక్కుని
అర్ధంకానిదేన్నో వెతుక్కోవటం ఎంతగొప్పగా ఉంటుందనీ..”
నిజంగా ఎంత గొప్పగా ఉంది అక్షరాల వెనుక దాగిన భావుకతా సౌందర్యం..ప్రతీ పదమూ ఇష్టంగా చెక్కిన శిల్పంలా..ప్రతీ భావమూ ఎలుగెత్తి చాటుతున్న కవితా పిపాసలా…. పద ప్రయోగాలన్నీ నా వరకూ కొత్తగా ఉన్నాయి….నైస్ వాసుదేవ్ సర్ జీ….
ధన్యోస్మి పద్మా గారూ. మీ అభిప్రాయాన్ని కవితాహృదయంతో చక్కగా చెప్పారు.
గడిచిన క్షణమొదిలిన పదాల హ్యాంగోవర్
ఇంకా గుండె గదిలినొదలదనీ తెల్సు …. చాలా బాగా పట్టుకున్నారు వాసుదేవ్ గారు!…I enjoyed the poem
థాంక్యూ విజయకుమార్ గారూ.