పొద్దు కూకే వేళ
కడవల నిండా చీకట్లతో
బిలబిల మంటూ
ఆడవాళ్లోస్తారు.
వెళ్ళేటప్పుడు
చీకట్లను ఒంపేసి,
కడవ నీళ్ళపై తేలే
సాయంత్రపు తునకలతో
తిరిగిపోతారు.
(సంకలనం: చిలకలు వాలిన చెట్టు)
2. నువు
నా కోసం పూర్తిగా
నగ్నవైనపుడు మాత్రమే
నా దానివి
బట్టలు కట్టుకున్నాక
ప్రపంచపు దానివి.
ఎప్పుడో ఒక నాడు
ప్రపంచాన్ని చింపి
పోగులు పెడతాను.
(సంకలనం: రాత్రి వచ్చిన రహస్యపు వాన)
3. గోడ
బైట ఉండాల్సినవేమిటో
లోన ఉండాల్సినవేమిటో
అన్నీ నాకు తెలుసు.
ఐతే,
ఈ కిటికీకి
ఇక్కడేం పని?
(సంకలనం: చిలకలు వాలిన చెట్టు)
చీకట్లను ఒంపేసి…..సాయంత్రపు తునకలతో తిరిగి పోతారు- బాగుంది . ఈ కిటికీకి ఇక్కడేం పని ?….చాలా బాగుంది. కవిత్వం అల్లడంలో ‘ఇస్మాయిల్’ గారు
ప్రపంచాన్ని …చింపి పోగులు పెట్టగలవారు. వారికి నా అభినందనలు.
రెండవ కవిత అద్భుతం
కుండలో సముద్రం అండి మీ కవితలు!