కవిత్వం

అసలు నిజం

జనవరి 2013

మనుషులున్నాయంటావా ?
అడిగింది పిల్ల దెయ్యం తల్లిని .

“ఇంతవరకూ రాలేదు నా ఉనికిలోకి ”

మరి మనాళ్ళంటారే ?

“ఔను మన పెద్దాళ్ళు అంటుంటారు
మనలో కోర్కెలు చావని వాళ్ళు
మనుషులౌతాయని ”

అది నిజంకాదా మరి ?

“ఏమో నాకు తెలియంది ఏం చెప్పను ? ”

పాపం కదా మనుషులు !

తలూపింది తల్లిదెయ్యం
నిర్వికారంగా -