‘‘మా ఊరి కథలు’’
ఉగాది సందర్భంగా వాసిరెడ్డి పబ్లికేషన్స్ కథల పోటీ నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ పోటీకి విశేష స్పందన లభిస్తోంది. అయితే చాలా మంది కథకులు.. గడువు పొడిగించవలసిందిగా కోరుతున్నారు. వారి విజ్ఞప్తి మేరకు గడువును మార్చి 15 వరకూ పొడిగిస్తున్నాము. పోటీ వివరాలు మరొకసారి. గ్రామీణ జీవితం నేపథ్యంగా, ఊరితో ముడిపడిన ముచ్చట్లను ఇతివృత్తంగా తీసుకొని కథలను రాసి పంపగలరు. కథ నిడివి అచ్చులో పది పన్నెండు పేజీలకు మించకుండా వుండాలి. న్యాయ నిర్ణేతలు మీ కథలను పరిశీలించి కథాసంపుటిలో ప్రచురణకు అర్హమైన వాటిని ఎంపిక చేస్తారు. ఉత్తమంగా వారు ఎంచిన ఆరు కథలకు నగదు బహుమతి వుంటుంది. ప్రథమ బహుమతి 10వేల రూపాయలు. ద్వితీయ బహుమతి 7,500 రూపాయలు. తృతీయ బహుమతి 5,000 రూపాయలు. అలాగే 1,116 చొప్పున మూడు కన్సొలేషన్ బహమతులు వుంటాయి.
రచయితలు తమ కథలను లిఖిత రూపంలో లేదా.. వర్డ్, పీడీఎఫ్, యూనికోడ్.. ఇలా ఏ ఫార్మాట్ లో అయినా పంపవచ్చు.
కథలను పంపవలసిన ఈమెయిల్ ఐడీ: vasireddy.venugopal@gmail.com
కథలను పంపవలసిన పోస్టల్ అడ్రస్:
Vasireddy Venugopal,
B-2, Telecom Qtrs,
Kothapet, Hyderabad – 500060
Phone: 9000528717
“కథ నిడివి అచ్చులో పది పన్నెండు పేజీలకు మించకుండా వుండాలి.” – మామూలుగానే కథలపోటీల్లో కనబడే ఈ నిబంధన నాకు చాలా తమాషాగా అనిపిస్తుంది. చేతివ్రాతప్రతినుండో లేక యూనికోడ్లో టైప్ సెట్ చెయ్యబడి అచ్చు వేసిన ప్రతి నుండో పోటీ ఫలితాలు ప్రచురింపబడే పేజీల సంఖ్యని ఊహించడం అంత తేలికయిన విషయం కాదు. అచ్చు పత్రికల విషయంలో ఆ పేజీ పొడుగు, వెడల్పుల గూర్చిన అవగాహన ఉండడానికి అవకాశముంటుంది. (అయినా అక్కడ కూడా పేజీల పరిమితి కాకుండా పదాల పరిమితిమీద నిబంధనని నిర్ణయిస్తే అది రచయితలకి సహకరిస్తుందని స్వాభిప్రాయం.) ఇక్కడ అచ్చయ్యే పేజీగూర్చిన అవగాహనకి ఏ మాత్రం తావులేదు – డెమ్మీ సిజా, క్రౌన్ సైజా, పేజీలో ఎన్ని పదాలుండచ్చు లాంటి వివరాలు ఈ ఎనౌన్స్ మెంట్లో లేవు. ఇలాంటిచోట పోటీ నిర్వాహకుల ఆలోచనలని అర్థంచేసుకోవడం ఇంకొంచెం కష్టం.