సాహిత్య వార్తలు

కవిత్వం – 2016

జూన్ 2017


కవిత్వం – 2016

2016వ సంవత్సరంలో వివిధ పత్రికలలో, అంతర్జాల సాహిత్య పత్రికలలో వెలువడిన 60 ఉత్తమమైన కవితలను ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో ‘కవిత్వం – 2016’ పేరిట వరంగల్ కేంద్రంగా గల ‘కవన కుటీరం’ వెలువరించింది. దర్భశయనం గత 15 ఏళ్ళుగా ఈ వార్షిక కవితా సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్నారు.

‘కవిత్వం – 2016’ సంపుటిని 28 మే 2017 ఆదివారం ఉదయం, విప్లవకవి శ్రీ వరవరరావు గారు హైదరాబాద్ జవహర్ నగర్ లోని వారి ఇంట్లో కవిత్వ మిత్రుల నడుమ ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో సంపాదకులు శ్రీనివాసాచార్య తో పాటు కవులు రమణజీవి, బా రహమతుల్లా, కూర్మనాధ్, కోడూరి విజయకుమార్,…
పూర్తిగా »

బ్రౌన్ పురస్కారం – 2015

బ్రౌన్ పురస్కారం – 2015

ముకుంద రామారావు గారు 'వలస పోయిన మందహాసం' మొదలు అనేక కవితా సంకలనాలు వెలువరించారు. వీరి కవిత్వానికి పలుభాషల్లో అనువాదాలు వచ్చాయి. కేవలం కవిత్వానికే పరిమితం కాకుండా వచనంలో కూడా కృషి చేశారు. ముఖ్యంగా గత దశాభ్ద కాలంగా వీరు బృహత్తర ప్రణాళికతో దేశ దేశాల కవిత్వాన్ని తమదైన శైలిలో అనువాదం చేసి -అదే ఆకాశం, సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, అదే గాలి, -అన్న పుస్తకాలుగా వెలయించారు. టాగోర్ అంతిమ కాలంలో రచించిన 'నమ్హార రేఖా పథ్ బెయె' అన్న చిత్ర కవిత్వాన్ని తెనిగించారు. అంతేగాక, మరో ఐదు భారత కవుల అనువాద పుస్తకాలు రానున్నాయి.
పూర్తిగా »

ఇస్మాయిల్ అవార్డు-2015

ఇస్మాయిల్ అవార్డు-2015

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైంది. తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.

గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు, పద్మలత, తులసీ మోహన్,స్వాతికుమారి, మమత లకు ఈ అవార్డ్ లభించింది.

మానస రచనలు కొన్ని:

మానస బ్లాగు

వాకిలిలో మానస రచనలు


పూర్తిగా »

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి బ్రౌన్ పురస్కారం

యావజ్జీవితం శాసన పరిశోధనకు అంకితమై ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము.
పూర్తిగా »

వాసిరెడ్డి పబ్లికేషన్స్ కథల పోటీ: గడువు మార్చి 15

‘‘మా ఊరి కథలు’’
ఉగాది సందర్భంగా వాసిరెడ్డి పబ్లికేషన్స్ కథల పోటీ నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ పోటీకి విశేష స్పందన లభిస్తోంది. అయితే చాలా మంది కథకులు.. గడువు పొడిగించవలసిందిగా కోరుతున్నారు. వారి విజ్ఞప్తి మేరకు గడువును మార్చి 15 వరకూ పొడిగిస్తున్నాము. పోటీ వివరాలు మరొకసారి. గ్రామీణ జీవితం నేపథ్యంగా, ఊరితో ముడిపడిన ముచ్చట్లను ఇతివృత్తంగా తీసుకొని కథలను రాసి పంపగలరు. కథ నిడివి అచ్చులో పది పన్నెండు పేజీలకు మించకుండా వుండాలి. న్యాయ నిర్ణేతలు మీ కథలను పరిశీలించి కథాసంపుటిలో ప్రచురణకు అర్హమైన వాటిని ఎంపిక చేస్తారు. ఉత్తమంగా వారు ఎంచిన ఆరు కథలకు నగదు బహుమతి వుంటుంది.…
పూర్తిగా »

అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీల విజేతలు

02-మే-2014


అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీల విజేతలు

                                                                                 

 

అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీల విజేతలు

 

జూలై 3,4,5 వ తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే 13 వ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక ‘అక్షర’ కోసం ఆటా నిర్వాహకులు సాహిత్య పోటీలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు ఐదు వందల మంది రచయితలు ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు.

ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 4,5 వ తేదీలలో…
పూర్తిగా »

నాట్స్ సంబరాల స్రవంతి – రచనల పోటీలు

06-మే-2013


నాట్స్ సంబరాల స్రవంతి – రచనల పోటీలు

నాట్స్ సంబరాల స్రవంతి (నాట్స్ సంబరాలు 2013 ప్రత్యేక సంచిక) – రచనల పోటీలు

నాట్స్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం తృతీయ సంబరాల సందర్భంగా ప్రచురించే “సంబరాల స్రవంతి” ప్రత్యేక సంచిక కోసం రచనల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితల నుండి వివిధ సాహితీ ప్రక్రియల్లో రచనలు ఆహ్వానిస్తున్నాం.

సంబరాల స్రవంతి ముఖ్య ఉద్దేశ్యం: “భాషే రమ్యం – సేవే గమ్యం” అన్న ధ్యేయంతో పని చేసే సంస్థ నాట్స్. అత్యంత వైభవంగా జరగబోయే “సంబరాలు” మిగిల్చే మధుర స్మృతులకి, జ్ఞాపకాలకీ ప్రతీకగా నిలిచిపోయే ఒక మంచి గ్రంథం – ఈ నాట్స్…
పూర్తిగా »