కవిత్వం

నువ్వూ, నేనూ, ప్రపంచం.

జనవరి 2016

విక్షేపణ పొందిన రంగుల
ఇంద్రధనుస్సు ఒక అనిశ్చితం-
రంగులన్నీ చెదరిపోయి
మిగిలిన తెల్లటి స్ఫటికం
అభావంలా గోచరించే సత్యం-

సమాంతర రేఖలకో
ఖండన బిందువునేర్పరచాలని
అనుకోవడం ఓ పిచ్చితనమే
విస్తృతమై ఆవరించిన విశ్వంలో
కలవని దారులెపుడూ
తెరవబడే ఉంటాయి-

అంతరమార్గాల అవలోకనాలలో
ఏర్పడే దిక్కులన్నీ
విభేదించిన మనసులై
ప్రయాణిస్తాయి-

భావనల ప్రస్తారాలలో
సంభవించే కలయికలలో
నువ్వూ- నేనూ- ఈ ప్రపంచం
ఎవరికి వారే వేరువేరై!