‘ ఇస్మాయిల్ ’ రచనలు

From ఇస్మాయిల్ to ఆర్.యస్. సుదర్శనం

డిసెంబర్ 2014


From ఇస్మాయిల్ to ఆర్.యస్. సుదర్శనం

'అనుభూతి కవిత్వ'మనే వ్యాసం ఆధునిక కవిత్వానికి సూక్ష్మ విశ్లేషణ చాలా సమర్ధంగా చేసింది. చాలా కొత్త విశేషాలు తెలిసాయి 'అనుభూతి కవితగా గుర్తు పట్టడానికి ప్రధానమైన లక్షణం కవిత చదివిన తర్వాత మిగిలేది ఒక సందేశం, ఒక భావనం, ఒక దృక్పధం కాకుండా కేవలం అనిర్ధిష్టమైన అనుభూతి కావాలి' అని మీరన్నారు . ఇది R H Blaith హైకూ కి ఇచ్చిన నిర్వచనంతో సమం గా వుంది:
పూర్తిగా »

ఇస్మాయిల్ కవితలు

డిసెంబర్ 2014


ఇస్మాయిల్ కవితలు


1. అనంతపురంలో వీధి కుళాయి

పొద్దు కూకే వేళ
కడవల నిండా చీకట్లతో
బిలబిల మంటూ
ఆడవాళ్లోస్తారు.

వెళ్ళేటప్పుడు
చీకట్లను ఒంపేసి,
కడవ నీళ్ళపై తేలే
సాయంత్రపు తునకలతో
తిరిగిపోతారు.

(సంకలనం: చిలకలు వాలిన చెట్టు)
 

2. నువు

నా కోసం పూర్తిగా
నగ్నవైనపుడు మాత్రమే
నా దానివి

బట్టలు కట్టుకున్నాక
ప్రపంచపు దానివి.

ఎప్పుడో ఒక నాడు
ప్రపంచాన్ని చింపి
పోగులు పెడతాను.

(సంకలనం: రాత్రి వచ్చిన రహస్యపు వాన)
 

3. గోడ

బైట ఉండాల్సినవేమిటో
లోన…
పూర్తిగా »

జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని

28-జూన్-2013


జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని

(1988 లో ‘ఆంధ్ర జ్యోతి’ సాహిత్య వేదికలో ప్రచురితమైన ఇస్మాయిల్ గారి నేపధ్యం.. ఇప్పటికీ కవిత్వం గురించి ఇందులో ఇస్మాయిల్ గారు చెప్పిన విషయాలు మనకి అవసరమే అనిపించి మళ్ళీ మీకు అందిస్తున్నాం)

 

1944 లో నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను. దీనికి కారణం నా లోపలా బయటా అశాంతి. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. దేశ పరిస్థితులు అస్థిమితంగా ఉన్నాయి.అప్పుడే వికసిస్తున్న మా మనసులలో అసంతృప్తి మేల్కొంది. ఏదో తెలుసుకోవాలనే ఆరాటం, దేన్నో సాధించాలనే తపన, సాంఘికమైనవీ, మానసికమైనవీ సంకెళ్ళని తెంచుకోవాలనే ఆవేశం.లోనా పైనా చెలరేగిన ఈ అశాంతికి మార్కిసిజం ఒక కాయకల్ప చికిత్సగా మా ఎదగని మనస్సుకు తోచింది.

కానీ కమ్యూనిస్ట్ పార్టీలో అడుగు…
పూర్తిగా »