‘ ఎండపల్లి భారతి ’ రచనలు

అన్నం పొద్దు పండగ

అన్నం పొద్దు పండగ

ఉగాది పండక్కి ఊర్లో ఉన్న కుటుంబరాళ్లు అందరూ ఇండ్లు, వాకిండ్లు సున్నం పూసుకొని ఇల్లంతా అలికి ముగ్గులేస్తారు. ఇంగ పండగ నా పొద్దు నాలుగు గంట్ల రేతిరిలోనే లేసి ఎవురి మొగమూ సూడకుండా పూసిన ఇండ్లకు ‘పొలి’ కడతారు. ఇండ్లలోకి ఆ సంవత్సరమంతా గాళ్ళు దూళ్ళు రాకుండా ఆవు పేడతో ఇంటి సుట్టూ గీత మాదిరి పూస్తారు. దాన్నే పొలి కట్టడం అంటారు.

ఈ పండగని ‘పెద్దలపండగ’ అంటాము. వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లో ముందుగా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్లు కానీ సచ్చిపోయింటే వాళ్లకు కొత్త గుడ్డలు తెచ్చి పెడ్తారు . ఆ రోజు సచ్చినోళ్ళకి ఇష్టమైన వంట వార్పు చేసి పెడ్తాము. కుమ్మరింటికి పొయ్యి కొత్త…
పూర్తిగా »

ఈరవ్వ ఏమి తినబెట్టిందో!

ఈరవ్వ ఏమి తినబెట్టిందో!

ఆ పొద్దు రెయ్యి నేను ఈరవ్వ వాళ్ళింటికి పోయింటి పనుకునే దానికి. ఈరవ్వ నన్ను చానా బాగా చూసుకొంటాది. తల్లిలేని బిడ్డనని నన్ను చేరదీసేది. ఈరవ్వది అడ్డపు ఇల్లు. అంత అరువుగా ఉంటాది ఆ ఇల్లు. పగోల్లకైనా కొంచేపు కుచ్చుని పోవాల అనిపిస్తాది ఆ ఇంటిని చూస్తే.

నేతదూడలు పచ్చికసువు మేసి వేసేపేడ నున్నంగా, పచ్చంగా ఉంటాదని ఊరంతా తారాడి తారాడి ఆ పేడని ఏరుకోని వస్తాది. చెమ్ముతో నీళ్ళు తెచ్చుకొని, నట్టింట్లో అరచేత్తో కలిపి ఇల్లంతా అలికి, పైన సన్నని ఈన్లు తీస్తాది పట్లుపట్లుగా. ఎండినంక చూస్తే బండిబాట మారిగా ఉంటాది అలికిన తావున. అందరూ ఇల్లలికినపుడు మూడు పట్లు తీస్తే, ఈరవ్వ…
పూర్తిగా »

అంటిత్తులు

ఏప్రిల్ 2016


అంటిత్తులు

రంగమ్మత్తా రామ్మామల మాదిరి ఆలూమొగుళ్ళు మా ఊర్లో ఇంకెవరూ లేరు. వాల్లిద్దరూ ఒకర్ని వదిలి ఒకరు ఉండనే ఉండరు. కూలికి పొయినా ఒకటిగా పోతారు ,ఊరికి పోయినా ఒకటిగా పోతారు. వాళ్ళ జతను చూసి ఊర్లో జనాలు వాళ్ళని అంటిత్తులు అంటుంటారు.

రంగమ్మత్త తొలిసారి యాగిటి అయ్యింది. అట్లయి ఇట్లయి తొమ్మిది నెలలు నిండినాయి. ఒక నాటి రెయ్యి, రాయినీరు కరిగే పొద్దులో అత్తకి నొప్పులు ఎత్తుకున్నాయి. కుచ్చుంటాది, లేస్తాది,అమ్మా అంటాది ,అబ్బా అంటాది. మామకి ఏమి చేయాలో తెలవలేదు, కాల్లూ చేతులూ ఆడలేదు. వాళ్ళ ఇండ్లల్లో ఉండే పెద్దోల్లను పిల్చేకి బయిటికి పోబోయినాడు . అడుగట్ల పెట్టినాడో లేదో అత్తా వచ్చి ఆయన…
పూర్తిగా »

తాగుబోతు

తాగుబోతు

మా లచ్చుమత్త, కొండప్ప మామల కత ఇది. వీళ్ళకి బిడ్డలు లేరు. అయితే తినే దానికీ కట్టేదానికీ కొదవలేదు. ఏదో ఆ పూటకు ఈ పూటకు బాగనే జరిగిపోతాది ఇద్దరికీ. చుట్టాలు పక్కాలు ఎవరైనా వస్తారు పోతారంటే అది మామను చూసే. ఇరుగు పొరుగు కానీ అయిన పొయినోల్లు కానీ అత్తను మటుకు ‘మంచిది’ అనరు. అంత పిసినారిది మా యత్త. ఎంగిలి చేత్తో కాకికి కూడా వేయదు ,పీతిలో రూపాయి పడితే నాలికి తో అద్దుకుంటాది. అయితే కాపరాన్ని మటుకు బాగా దిద్దుకుంటాది.

మామకు తాగే అలవాటు ఉండాది. అయినా మా అత్త ఆయన్ని ఇష్టంగా చూసుకుంటాది. మామ కూడా ఆ యమ్మని…
పూర్తిగా »

గంగులవ్వ మజ్జిగ

ఫిబ్రవరి 2016


గంగులవ్వ మజ్జిగ

నా జతది లచ్చిమి , నేను పొద్దుమావిటేలగా బండమింద ఒడ్లు ఎండబోసుంటే తొయ్యను బొయినాము. బండ తోస్తా
“మే లచ్చిమీ దిన్నమూ గంగులవ్వోల్లింటికి పొయ్యే యాలెకే మజ్జిగ అయిపోతున్నాయి. ఆవుల సన్నప్ప కొడుకులు, తిక్క సిన్ని కూతుర్లు ,మారక్క మనవల్లూ దినామూ మన కంటే ముందుగానే బోయి గంగులవ్వ పంచ పట్టుకుని, ఆ యవ్వ మజ్జిగ కుండ ఇంట్లోకి తెచ్చేయాలకి పోపిచ్చు కొని పోతాఉండారంట. మా యమ్మ దినామూ తిడతా ఉంది. ముందుగా పోతే ఏమి నిగడదన్ని పడుకుంటావు అని . మన కంటే ముందే ఆ బెక్కి నాయాళ్ళు పోతా ఉండారు. అసలే నా బట్లు బెక్కిడిసి పోయిండారు. వాల్లిండ్లల్లో సంగటి…
పూర్తిగా »

గంగమ్మే బెదిరిపోయే!

గంగమ్మే బెదిరిపోయే!

మా జయక్క చానా మంచిది. ఇంటి పనైనా బయట పనైనా అంతే వైనంగా చేస్తాది. అయితే ఆయమ్మి ఆకలికి ఓర్చుకోలేదు. పొద్దుకు అంత ముద్ద కడుపులో పడిపోవాల. పుట్నింటిలో ఉన్నెబుడు కూడో కవళమో కాయో కరుసో ఏదో ఉన్నింది అంత తినేసి వేళకు కడుపు నింపుకునేది. అత్తింటికి పొయినంకనే పాపం ఆకలికి అంగలార్చింది జయక్క.

జయక్క మొగుడు, వాళ్లమ్మ మాటకు ఎదురు చెప్పడంట. ఆ తల్లేమో సరిగ్గా తిండి పెట్టేదే కాదు. మాయక్క, ఇక్కనా పక్కనా ఉండే ఇండ్లోళ్లు ఏమన్నా అంత పెడితే తిని కడుపు నింపుకునేది. అది తెలుసుకుని, ‘నా కోడలికి లేనిపోనివి చెప్పించి మా కాపరాన్ని చెడిపేస్తా ఉండారు’ అని వాళ్లను…
పూర్తిగా »