‘ కోడూరి విజయకుమార్ ’ రచనలు

కోల్పోతూ బతికిన పద్యం… దేవిప్రియ

కోల్పోతూ బతికిన పద్యం… దేవిప్రియ

60 యేళ్ళ వయసు మనిషిలో ఎటువంటి ఆలోచనల ప్రకంపనలని సృష్టిస్తుంది ?

మరీ ముఖ్యంగా, ఆ మనిషి ప్రపంచ రాజకీయాలనీ, మానవ జీవిత చరిత్రనీ బాగా చదువుకున్న, విశ్లేశించుకున్న మేధావి అయితే, ’60 ఏళ్ళ వయసు’ అనే ఒక మలుపు దగ్గర నిలబడి వెనక్కి తిరిగి, వొచ్చిన దారిని తడిమి చూసుకున్నపుడు అతడిని ఎక్కువగా వెంటాడేది ఏమిటి?

2009 వ సంవత్సరం ఆగష్టు 15 వ తేదీన, దేవిప్రియ గారి ఇంటికి, ఆయన షష్టి పూర్తి సందర్భంగా వెళ్ళినపుడు, నన్ను ఒకింత వెంటాడిన ప్రశ్నలు ఇవి ….

ఆ రోజు, దేవిప్రియ గారి కొత్త పుస్తకం ‘గంధకుటి’ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. దేవిప్రియ గారి కవితా…
పూర్తిగా »

సరళ జీవన సౌందర్యం – ఆశారాజు పద్యం

సరళ జీవన సౌందర్యం – ఆశారాజు పద్యం

నాకు ఉర్దూ సాహిత్యం తో పెద్దగా పరిచయం లేకున్నా, ఉర్దూ కవులంటే ఒక తెలియని అభిమానం. బరువైన మాటలనీ, చదువరులు/శ్రోతలూ మోయలేని సంక్లిష్ట తాత్వికతలనీ త్యజించి, సరళ సుందరమైన వారి జీవన శైలి లాగానే,వారి కవిత్వం కూడా చాలా సరళ సుందరమైన భాషలో గొప్ప భావాలని పలుకుతుందని నాకున్న కొద్ది పాటి అనుభవాల నుండి స్థిరపరుచుకున్న ఒక అభిప్రాయం! మరీ ముఖ్యంగా, జీవితం లో చాలా చిన్న విషయాలుగా మనం శ్రద్ధ పెట్టని వాటిని కూడా కవిత్వం లో స్వీకరించి, వారు జీవితం పట్ల ప్రదర్శించే గొప్ప ప్రేమ నన్ను అబ్బురపరుస్తుంది.

మరి, అలాంటి గొప్ప ఉర్దూ సాహిత్య గుబాళింపు వున్న నగరం…
పూర్తిగా »

క్యుములో నింబస్

జీవితం వేసవి గాలుల వలయంలో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నపుడు
దిగులు మేఘమొకటి కమ్ముకుంటుంది
ముందస్తు కబురేదీ లేకుండానే

తడియారిన దేహాత్మలు
నిలువెత్తు దాహమై
మరీచికల వెంట
పరుగులు పెట్టే జీవితం

ఈ దిగులు మేఘం ఇప్పటిదేనా?
నా పురా స్వప్నాలు కరిగీ, కరిగీ
నన్ను వెన్నంటే తిరుగుతోన్న
నా అనాది వేదన కాదు గదా?

ఆకాశం, వొచ్చి వెళ్ళిపోయే మేఘాల
నడుమ శాశ్వత నిర్మల నీలమా?
ఎప్పుడూ వెన్నాడే మేఘాల
నడుమ తళుకులీనే నీలి తరంగమా?

స్నేహమో, ప్రేమో, మరి ఏ బంధమో
పోగొట్టుకున్న ప్రతిసారీ

పూర్తిగా »

డబ్బులూ- జీవితమూ- ఒక కొప్పర్తి పద్యం…

డబ్బులూ- జీవితమూ- ఒక కొప్పర్తి పద్యం…

‘కవులేం చేస్తారు?’ అని అప్పుడెప్పుడో శివారెడ్డి గారు ఒక అద్భుతమైన పద్యం రాసారు…
‘ప్రజల చేతుల్లో అనంత శక్తివంతమైన పద్యం పెడతారు’ అన్న వాక్యంతో ఆ పద్యం పూర్తవుతుంది

డబ్బు సంపాదనలో విరామం ఎరుగక పరుగెత్తుతున్నపుడు, జీవితానికి సంబంధించి ఎక్కడో ఏదో లంకె తెగిపోతున్న బాధ మిమ్మల్ని కమ్మేసినపుడు, అలాంటి ఒక శక్తివంతమైన పద్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి ! ‘జీవించడం’ అంటే ‘డబ్బులు సపాదించే క్షణాలు’ గా లెక్కలు వేసే కాలం లో, ‘డబ్బుల్లేకపోవడం ఎంతగా బాగుండదో, అంతగా బాగుంటుందని’ తెలియజెప్పే ఈ కొప్పర్తి ‘భయద సౌందర్యం’ పద్యాన్ని ఒక సారి చదవండి….

‘డబ్బుల్లేకపోవడం
ఎంత బావుండదో అంత బావుంటుంది

పూర్తిగా »

మధురోహలూ మధుపర్కాలూ… గుడిహాళం పద్యం !

మధురోహలూ మధుపర్కాలూ… గుడిహాళం పద్యం !

ఒక స్థితి

లోకం లో ‘తన ప్రియుడు’ తప్ప మరొక ‘ప్రాణి’ ఏదీ తనతో పాటు జీవిస్తున్న స్పృహ లేకుండా తిరిగే ‘ప్రియురాలు ‘
కేవలం ‘తన ప్రియురాలి’ ఉనికి వల్లే లోకం ఇంత మనోహరంగా వున్నట్టు ఒక మైకం లో బతికే ‘ప్రియుడు’
వాళ్ళిద్దరూ ఒకరి సన్నిధిలో మరొకరు గడపడానికి తప్ప, మరొక విలువ ఏదీ తనకు లేనట్టు బేఖాతరుగా అలా కలలా కరిగిపోయే కాలం …..

మరొక స్థితి

తాను కలలు గన్నమనోహర జీవితం యిది కాదన్న నిరాశలో ‘ఆయన’
తన రంగుల కలల సౌధం కుప్పకూలిన బెంగలో ‘ఆవిడ’

ఇంతకీ ఈ రెండు స్థితుల నడుమ…
పూర్తిగా »

మరొక తల్లి

తన బలహీన గుండెల మీద
రెండు చేతులతో కొట్టుకుంటూ రోదిస్తున్న ఒక తల్లి
ప్రాణమంతా రెండు కళ్ళల్లో మిగిలిన ఒక అమాయక తల్లి
కొడుకు దేహం లోంచి చిలుక ఎగిరిపోయిన
సత్యాన్ని ఇంకా జీర్ణించుకోని పిచ్చి తల్లి
అనునయించే చేతులు, సముదాయించే మాటలు
నిస్సహాయంగా ఆ తల్లి శోకం ముందు

2
పిడికిళ్ళు బిగించి, పళ్ళు నూరుతూ
కొడుకు మూర్చలు పోయిన పసితనపు రోజులలో
ఆ తల్లి కళ్ళ దీపాలతో కాపలా కాసేది
జ్వరం తో దేహం వొనికిన అతడి పసితనం లో
కొడుకుని భుజానికి ఎత్తుకుని
జోరున…
పూర్తిగా »