‘ చిరంజీవివర్మ అనే వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు ’ రచనలు

నివురు గప్పిన పరువు

‘చపాక రపాక చపాక రపాక’

సాయంకాలపు నీరెండలో… నారింజ చెట్ల నీడన వాలుకుర్చీలో కూర్చుని వున్నారు గాదెల్రాజుగారు.

ఆయన ఓ అరచేతిలో… మచ్చుకి తెచ్చిన వడ్లు బంగారపు గింజల్లా మెరుస్తున్నాయి. ఇంకో అరచేయి ఆ గింజలని బిగబట్టి బాగా నలుపుతోంది.గాదెల్రాజుగారు ఇప్పటి వరకూ అలా ఎన్ని బస్తాల వడ్లని నలిపి నాణ్యత చూసారో లెక్కాపత్రం లేదు కానీ… ఖచ్చితంగా చూసే ఉంటారనడానికి కదును గట్టి నలుపెక్కిన ఆయన అరచేతులు సాక్ష్యం చెబుతాయి..

వడ్ల గింజలని నలుపుతున్న ఆయన రెండు అరచేతుల మధ్యా అగ్గిరాజుకుంటున్నట్టు వేడి మొదలయ్యింది.

‘ చపాక రపాక చపాక రపాక ‘ మంటూనలిగిన  వడ్లగింజల పొట్టురాలి ముత్యాల్లాంటి బియ్యం బయటపడుతున్నాయి. ఆయన కుర్చీ…
పూర్తిగా »

ద్వాదశి

ద్వాదశి

ఆకాశరాజు కూతురు  చిట్టడవిలాంటి చిక్కటి నల్లటి  తన జుట్టుని పాయలు పాయలుగా విడదీసి  దువ్వుకొంది. ఆ చక్కటి కురులని బిగించి కట్టడానికి ఇంద్రధనస్సుని మించిన రిబ్బన్ ముక్క మరెక్కడ దొరుకుతుంది? అందుకే దానినే రెండుగా త్రెంచి జడలకి కుచ్చీలుగా కట్టుకొంది. తనవైపే అపురూపంగా చూస్తున్న చందమామని అలవోకగా అందుకుని ఓ చెంపన తురుముకుంది.అడుగుకో కూతురున్న ఆకాశరాజుకి, ఆమె ఎన్నో కూతురో తెలీదుకానీ, పేరు మాత్రం ద్వాదశి. ద్వాదశి అందం మామూలు అందం కాదు.  అదో గిలకబావి. తోడేకొద్దీ ఊరినట్టు, చూసే కొద్దీ ఆ అందం రెట్టింపవుతూ ఉంటుంది.ఆమె నడుముని మెచ్చుకుంటే మెడకి కోపం. మెడని మెచ్చుకుంటే జడకి తాపం. ఆమె దేహంలో…
పూర్తిగా »