‘ తమ్మినేని యదుకుల భూషణ్ ’ రచనలు

భిక్షువు

భిక్షువు

మకాం మద్రాసుకు మార్చాక, నాకెందుకో బాగా వెలితిగా అనిపించింది. నాన్న ఆఫీసు, నేను కాలేజి. తమ్ముడు తాతయ్య దగ్గర ఆంధ్రలోనే ఉండిపోయాడు. అమ్మ కుట్టుమిషన్‌తో కుస్తీ పడుతుంది. అదో సరదా. అష్టలక్ష్మి దేవాలయం దగ్గరకు నన్ను తీసుకు వెళ్లింది చుట్టాలావిడ. అక్కడ తెలుగు అక్షరాలను చూసి ముచ్చట పడుతుంటే, ఈవిడగారు గుంపులో కలిసిపోయారు. దగ్గరగా సముద్రం అలలు ఎగిరెగిరి పడుతున్నాయి. ‘ఎలారా భగవంతుడా ఇల్లు చేరడం,’ అని విచారిస్తున్నా.
పూర్తిగా »

బ్రౌన్ పురస్కారం – 2015

బ్రౌన్ పురస్కారం – 2015

ముకుంద రామారావు గారు 'వలస పోయిన మందహాసం' మొదలు అనేక కవితా సంకలనాలు వెలువరించారు. వీరి కవిత్వానికి పలుభాషల్లో అనువాదాలు వచ్చాయి. కేవలం కవిత్వానికే పరిమితం కాకుండా వచనంలో కూడా కృషి చేశారు. ముఖ్యంగా గత దశాభ్ద కాలంగా వీరు బృహత్తర ప్రణాళికతో దేశ దేశాల కవిత్వాన్ని తమదైన శైలిలో అనువాదం చేసి -అదే ఆకాశం, సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, అదే గాలి, -అన్న పుస్తకాలుగా వెలయించారు. టాగోర్ అంతిమ కాలంలో రచించిన 'నమ్హార రేఖా పథ్ బెయె' అన్న చిత్ర కవిత్వాన్ని తెనిగించారు. అంతేగాక, మరో ఐదు భారత కవుల అనువాద పుస్తకాలు రానున్నాయి.
పూర్తిగా »

ఇస్మాయిల్ అవార్డు-2015

ఇస్మాయిల్ అవార్డు-2015

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైంది. తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.

గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు, పద్మలత, తులసీ మోహన్,స్వాతికుమారి, మమత లకు ఈ అవార్డ్ లభించింది.

మానస రచనలు కొన్ని:

మానస బ్లాగు

వాకిలిలో మానస రచనలు


పూర్తిగా »

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి బ్రౌన్ పురస్కారం

యావజ్జీవితం శాసన పరిశోధనకు అంకితమై ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము.
పూర్తిగా »