‘ తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి ’ రచనలు

అతడు

తరవాత అరగంటలో పోలీసులొచ్చేరు.

వాళ్ళు మెట్లు దిగి బేస్ మెంట్ గదిలోకి వచ్చేసరికి అతను కంప్యూటరు ముందు కనిపించాడు. కూచుని ప్రశాంతంగా నిశితంగా కళ్ళజోడు లోంచి తెరమీది గళ్ళనీ, అంకెల్నీ చూస్తున్నా డతను . ఒకసారి ఆగి అతన్ని చూసాడు ఇన్ స్పెక్టరు. మధ్యలో కీబోర్డుని టైప్ చేస్తుంటే అతన్నీ కంప్యూటర్నీ  కీబోర్డు పని చేయిస్తున్నపించింది. ఇన్ స్పెక్టరు బాగా దగ్గిరికి వచ్చిన తరవాత గానీ అతను గమనించలేదు. తలెత్తి చూసి ఆశ్చర్యపోయాడతను.

రాత్రి ఏడున్నరయింది. గది వేడిగానూ లేదు, చల్లగానూ లేదు. అతనికి ఎలాగూ అనిపించడం లేదు. చిన్న గది. పక్కగోడకి కిటికీ. చెక్క టేబిలు ముందు మూడు కుర్చీలు. ఒక చెక్క కుర్చీలో…
పూర్తిగా »