‘ మనోజ్.కె ’ రచనలు

స్లీపింగ్ విత్ ది ఎనిమీ

జూలై 2017


అందాకా ఒకరి చుట్టూ ఒకరం గిరికీలు కొట్టి ఆ రోజును సమీపిస్తాం
ఒక ఆగర్భ శత్రు జంట పట్టు చీరల సఫారీలో నడిచొస్తుంది
పనేమీ లేని పులొకటి తన జింకను కావిలించుకుని కార్లోంచి దూకుతుంది
రోసిన బతుకుల్లోంచి కాసేపన్నా
పూర్తిగా »

వీడ్కోలు తర్వాత

వీడ్కోలు తర్వాత

అంత సంతోషం వెనకా ఒక దుఃఖపు తెర సాయంకాలపు నీడై పరివ్యాప్తి చెందుతుంది
వెలిగే నవ్వుదీపపు సెమ్మె కిందొక దిగులునీడ అలాడిన్ రాక్షసుడై వళ్ళు విరుచుకుంటుంది
ఆప్యాయంగా కలిసిన చేతుల లోంచే రానున్న వియోగం వెచ్చని స్పర్శై హెచ్చరిస్తుంది
మన ఉద్విగ్నభరిత క్షణాలన్నీ కదలబొయే రైలు కూత వేటుకు పావురాలై నేల రాలుతాయి

పంటినొక్కు కింద దాగిన పెదవి వొణుకూ
గొంతులోకి యెగబాకిన దుఖపు జీరా
మొహంలోకి చూడలేని వాలుచూపులూ
మొత్తంగా ఒక అసంగతపు సంభాషణం

తిరిగి నువ్వొస్తావేమో కాస్సేపని బోసిపోయిన ప్లాట్ ఫాం మీదే తారట్లాట
కొంచెంగా దిగిన కైపులోంచి అప్పటికి మాత్రం…
పూర్తిగా »