‘ మానస చామర్తి ’ రచనలు

ఎల్లలు దాటిన తెలుగు కవిత్వ పరిమళం

ఎల్లలు దాటిన తెలుగు కవిత్వ పరిమళం

నేను ఇన్ఫో్‌సిస్‌లో పని చేస్తున్న రోజుల్లో, వృత్తిరీత్యా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండటంతో సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన కొందరితో, తరచుగా వారి వారి భాషలకు చెందిన ప్రాచీన, సమకాలీన కవిత్వాల గురించి మాట్లాడేదాన్ని. హిందీ, మళయాళం, కన్నడ, తమిళ భాషలకు చెందిన వాళ్ళతో వీలు చిక్కినప్పుడల్లా సాహిత్యచర్చలు సాగేవి. అలా మాటల్లో నాకూ కొంత కవిత్వం రాయడం పట్ల ఆసక్తి ఉందనీ, రాసేందుకు, విరివిగా చదివేందుకు ప్రయత్నిస్తుంటాననీ చెప్పినప్పుడు, మన భాషలోని కొన్ని మంచి కవితలను వాళ్ళకు వినిపించమని కోరేవారు. ‘వస్తువు ఏమిటి’, ‘వర్ణనలు ఏ రకంగా సాగాయి’, ‘ప్రేరణ ఏమై ఉంటుంది?’ అన్న ప్రశ్నలతో మొదలైన మా…
పూర్తిగా »

ఆట

అక్టోబర్ 2016


ఆట

వేదనతో పగిలి విశ్వవేదికపై
ఒరిగిపోయింది రాత్రి
నారింజరంగు పరదా
మళ్ళీ కొత్తగా రెపరెపలాడింది

సూర్యకాంతి సోకితేనే
కాలిపోయే తెల్లకాగితాలని
ఏ నీడలో దాచి కథ పూర్తి చెయ్యాలో
తెలియలేదతనికి

రంగునీళ్ళని బుడగలుగా గాల్లోకి వదిలి
మిట్టమధ్యాహ్నపు ఆటల్లో నవ్వుకున్నాడు కానీ
ఇంద్రధనుసు పగలకుండా ఆపడం
చేతకాలేదతనికి

అరచేతుల క్రింద ఇసుకను దాచి
ఆటాడీ ఆడించీ గుప్పెట తెరిచాక
వేలి క్రింద ముత్యపు ఉంగరమొక్కటే
మెరుస్తూ కనపడింది

కలలో కనపడ్డ బంగారు చెట్టుకు
ఊయలకట్టి ఊగుతూ నిద్రించిన సంగతి
ఎవ్వరికీ చెప్పకుండానే

పూర్తిగా »

ప్రయాణం

జనవరి 2015


ప్రయాణం

కొంత హుషారు
కొంత కంగారు
కొత్త స్టేషన్లో ఎప్పుడాగినా
ఎంతోకొంత కలవరం

అమ్మడాన్నీ అమ్ముడుపోవడాన్నీ
ఆగిన ఆ కాసిన్ని క్షణాల్లోనే
ఎన్నో కొన్ని అప్పగింతల్నీ
తప్పదు, ముగించుకోవాలి,
లోకాన్ని నమ్ముతూ నమ్మిస్తూ లేదా
నటిస్తూ

కళ్ళల్లో తేలే ఆశనిరాశల్నీ
కౌగిళ్ళలో నొక్కుకునే బాధల్నీ
అరుదుగా కొన్ని సంతోషాల్ని కూడా,
చూస్తూనే కదలాలి బండి, తప్పదు,
ఉద్వేగాలను గెలుస్తూ భరిస్తూ లేదా
వదిలేస్తూ

చెట్లు పుట్టలు వెనక్కి
మనుషులూ మమతలూ వెనక్కి
ఒక జీవితమో జ్ఞాపకమో వెనక్కి
వెళ్ళిపోయేవాడికి
ఏవీ కనపడవు చివరికిపూర్తిగా »

వాన వెలిశాక..

అక్టోబర్ 2014


వాన వెలిశాక..

విరగబోయే కొబ్బరిమట్ట మీద కూర్చుని
ముక్కుతో పొట్ట పొడుచుకుంటూ
దిగులుగా ఊరంతా చూస్తుంది
ఒంటరి కాకి

డాబా మీది తూము నుండి నీళ్ళు
ధారల్లే క్రిందకు పడుతోంటే
తలంతా తడుపుకుంటూ ఇకిలిస్తాడు
బట్టల్లేని బుడతడు

దండేనికి వేలాడుతోన్న చినుకులన్నింటిని
చూపుడువేలు గాల్లోకి విసిరేశాక
ఏడుపు మొహాలతో బయటకొస్తాయ్
ఆరీఆరని బట్టలు.

జీరాడే కుచ్చిళ్ళు జాగ్రత్తగా
బురద నీళ్ళకు దూరంగా జరిగాక
పసుపు మరకల పట్టీలతో పేరంటానికెళ్తుంది
అమ్మలాంటి ఓ అమ్మ.

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు

గొలుసు కవితలు

కవిత్వం ఎప్పుడూ ఒక ధార, ఒక ప్రవాహం. అనుభవం నుండి అనుభూతికి, సంఘటన నుండి సంస్పందనలోకి, మాట నుండి మనసుకి, మనసునుండి తిరిగి మనిషిలోకి నిర్విరామంగా నడుస్తూ, తాకుతూ, తడుపుతూ, తట్టి లేపుతూ కలుపుకుంటూ పోయే నిరంతర వాహిని కవిత్వం. కవిత్వం లోని ఈ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ..

ఒక చిన్న ప్రయోగం చేద్దామా? గొలుసు కవితలు రాద్దామా?
ఎక్కడిదైనా ఏదైనా ఒక కవితలోని ఒక వాక్యాన్ని తీసుకుని దాంతో మొదలెట్టి ఎవరైనా ఇక్కడ ఒక కవితను రాయండి. ఆ కవితలోని ఒక వాక్యంతో మరొకరు మరో కవిత… ఇలా ఒక భావం నుండి మరో భావం, ఒక వ్యక్తీకరణనుండి…
పూర్తిగా »

బంధాలు

జనవరి 2014


బంధాలు

ఎంత ప్రేమగా గింజలు చల్లినా
పంజరంలో పావురాయి నవ్వదు
ఎగరెయ్ ఆకాశంలోకి.
దాని రెక్కల చప్పుడులోని
స్వేచ్ఛా సంగీతాన్ని
వినిపించొకసారి హృదయానికి

ఎన్నెన్ని మొగ్గలు వికసించినా
మొదలంటా నరికేస్తే మిగలదేదీ
వాటినలా వదిలెయ్.
పూదోటలో నడిచెళ్తుంటే
వసంతమెలా కమ్ముకుంటుందో
అనుభవించి చూడు

ఎందరెందరు దోసిళ్ళు పట్టినా
అరచేతుల్లో ఒక్క చుక్కా నిలవదు
ఆకాశం ఊరికే కిందకు దిగదు
అడ్డు తొలగు
ఏదో ఒక రోజు
ఏటి ఒడ్డునే సేద తీరాలి.

వదలనివి కొన్నుంటాయి
వదల్లేనివీ కొన్నుంటాయి
వదులయ్యే కొద్దీ బిగుసుకునేవి మాత్రంపూర్తిగా »

నేల దిగే నక్షత్రం!

15-నవంబర్-2013


నేల దిగే నక్షత్రం!

ఆమె ఆకుపచ్చ గీతమై
అడవి గుండెల్లో ఒదుగుదామనుకుంది.

వాన చినుకులా
సముద్రమంత ప్రేమలో కరుగుదామనుకుంది.

ఆకాశమై అతను కవ్విస్తే
చుక్కలా చెక్కిలిని ముద్దాడుదామనుకుంది.

అతడు

అడవి కాడు
వసంతం.

సముద్రమూ కాదు
ప్రవాహం.

ఆకాశమైనా అయి ఉంటే
నక్షత్రమై నేల రాలేది కాదేమో!


పూర్తిగా »

స్వాతితో కోనేటి మెట్లు ఎక్కుతూ…!

మార్చి 2013


స్వాతితో కోనేటి మెట్లు ఎక్కుతూ…!

ఈ మంత్రలోకపు అలౌకిక సౌందర్యాన్ని తన ఆలోచనాలోచనాలతో దర్శించి, కవిత్వంగా మన ముందుకు తీసుకు వచ్చిన నేటి తరం కవయిత్రి – స్వాతి. తన మానసిక పరిస్థితికి అనుగుణంగా ప్రకృతికి పదాల హారతి పడుతూ ఆ వెలుగుల్లో మనకీ ఓ కొత్త అందాన్ని పరిచయం చేయగల సమర్ధురాలీమె. కవిత్వమెందుకూ వ్రాయడమంటే… “మనదైన ఒక స్వాప్నిక జగత్తు మనకోసం ఎప్పుడూ ఎదురు చూస్తుందనే ధీమాతో వాస్తవ జీవితం తాలూకూ కరకుదనాన్ని, నిర్లిప్తతని ధిక్కరించగలిగే ధైర్యాన్నిస్తుంది కవిత్వం. కవిత్వమంటే అనుభూతుల పెదవులపై నర్మగర్భం గా వెలిసే ఒక చిలిపి నవ్వు, నవ్వులనదులన్నీ ఆవిరైపోయాక చివరికి మిగిలే ఓ కన్నీటి బొట్టు. అన్నీ ఆశలూ అడుగంటాక కూడా బ్రతకడంలో కనిపించే…
పూర్తిగా »

సమ్మోహన మీ మోహన గీతం..

జనవరి 2013


సమ్మోహన మీ మోహన గీతం..

కవిత్వంలో నిరంతరం నవ్యత కోసమే అన్వేషణ సాగినట్లు కవిత్వచరిత్ర నిరూపిస్తుంది. ఆ రహస్యాన్ని జీర్ణించుకుని, తెలుగు నాట సాహిత్యాభిమానులను తన కవిత్వంతో  ఉర్రూతలూపిన కవి మో! తన సమ్మోహనకరమైన శైలితో స్వీయముద్రను ప్రతీ రచనలోనూ ప్రస్ఫుటంగా చూపెట్టిన అతి తక్కువ మంది కవుల్లో, ‘మో’ ముందు వరుసలో ఉంటారు. మో రాసిన ప్రతీ కవితా విలక్షణమైనదే! అది అనుసరణనూ అనుకరణనూ దరి చేరనీయని అనన్యమైన మార్గము.

ఇతని కవిత్వమంతా వైయక్తిక దృక్పథంతో సాగిపోతుంది. ఆ కవిత్వానికి ముసుగులుండవు, నటనలుండవు. స్వచ్ఛమైన భావాలతో తరగని స్వేచ్ఛాకాంక్షతో స్పష్టాస్పష్టంగా కనపడే తాత్విక చింతనతో మో రాసిన మొట్టమొదటి సంపుటి – “చితి-చింత”.

కవితా వస్తువు కవిత్వంలో…
పూర్తిగా »