‘ మెర్సీ మార్గరెట్ ’ రచనలు

సముద్రాంబర

సముద్రాంబర

1.
ఇంటి ముందు ఆకాశపు ముక్కల్ని
నక్షత్రపు శకలాల్ని, విరిగిన మబ్బుల్ని
ఏరుతూ, వేరు వేరు చేస్తూ
కాలాన్ని గంటలుగా కాచి , చాయి నీళ్ళుగా
గ్లాసులో పోసుకుని తాగుతుందామె

2.
ఉదయం సూర్యుడు పిల్లలతో పాటు బడికి
బయలుదేరాక
బజారులోని చెట్ల మీది పక్షులు ఎగిరిపోయాక
కొన్ని మాటలు రాల్చిన ఆకుల్ని ఎత్తి, నోరు తెరిచి
ఎదురుచూస్తున్న చెత్త డబ్బాకు భోజనం పెట్టి
నాలుగు రాళ్ళతో
జానెడు పొట్ట నవ్వడం కోసం
ఉన్నా లేన్నట్టున్న తాగుబోతు భర్త బాధ్యతలు మరిస్తే,
గుడిలో భక్తురాల్లాగా ముడుచుకు…
పూర్తిగా »

జంతర్ మంతర్

సూర్యుడు చుక్కల్ని పట్టుకుని
పగటి గంప కింద కప్పి పెట్టి తన పనికి బయల్దేరింది మొదలు
రాత్రి ఇంటికి చేరి , గంప తీసి ఆ నక్షత్రాల్ని
ఆకాశంలో తిరగాడనికి వదిలే వరకు
నాది కాని ఇంకేదో లోకంలో
నన్ను నేను వెతుక్కుంటాను

నేను
సముద్రంతో ముచ్చట్లాడుతూ గూళ్ళు కట్టుకున్న సమయాల్ని
కొత్త పుస్తకంలోని వాసనని ముద్దగా ముక్కుకు పూసుకున్న క్షణాల్ని
చిన్న తనంలో ఆడి దాచి పెట్టిన గోలికాయల డబ్బా
మళ్ళీ కనిపిస్తే గుర్తు కొచ్చిన బాల్యాన్ని
ప్రేమ -ముద్దుగా పెట్టే మొదటి ముద్దు రుచి చూసిన అనుభవాల్ని

పూర్తిగా »

నడుస్తున్నాను ఉదయం వైపు

నడుస్తున్నాను ఉదయం వైపు

ఘనీభవించిన చీకటిపై
మొలకెత్తుతున్న పాదాల ముద్రలు వేస్తూ
కిరణాలు సోకని పుస్తకంలో అక్షరాల విత్తనాలు
కొన్ని జారవిడిచి
భావాలకు దాహమైనప్పుడల్లా చీకటి నీటిని త్రాగించి
నడుస్తున్నాను ఉదయం వైపు

తొలికిరణంతో
నేనే మొదట మాట్లాడాలని

ఆలోచనలన్నీ దాడి చేస్తే పగిలిపోయిన లాంతరు వెలుగుకు
నా పాదాలనుంచి కారిన రక్తపు బొట్లను తోడుగా వదిలి
కన్నీటి వర్షం ప్రతి సారి చెరిపేస్తున్న కలల కధలను చేతి గోళ్లకు
రంగుగా అద్దుకుంటూ

శూన్యం తరుముతుంటే రాల్చుకున్న
సీతాకోకచిలుకల రెక్కల స్వేచ్చని
ఏరుకుంటూ నడుస్తున్నాను
ఉదయం వైపు

నాలోకి వెలుగు ఒంపుకుని

పూర్తిగా »

ప్రియాన్వేషి

తాపంతోనో
తమకంతోనో
ప్రకృతిలోని యే యే
మూలల్లోంచి
ఏరి ఏరి ఆ చినుకుల్ని
నింపుకొచ్చాడో

ఎదురు చూసి
చూసి
బరువవుతున్న దేహాన్ని
మోయలేక
మెళికలు తిరుగుతూ కదులుతుంటే
చల్లగాలి తన అరికాళ్ళపై
గిల్లుతూ చక్కిలి గింతలు
పెడుతుంటే

దొంగ దొంగగా
ఊళ్ళని దారులని దాటుతూ
కొండ పూలు
కన్నుగీటుతూ సన్నజాజులు
పరిమళాల దారాలతో
కౌగిళ్ళ పతంగులుకట్టి
రసిక ఆహ్వానం పంపినా
చూడకుండా

కళ్ళనిండా తన రూపం
తనువు అణువణువున
వేడినేదో పుట్టిస్తుంటే
చల్లదనంతో దూదిలాపూర్తిగా »

కొన్ని సార్లు

కొన్ని సార్లు మొదలు ఎక్కడ పెట్టాలో వెతుకుతూఉంటా నాలో ఆలోచన నిలువునా చినిగిన స్థానాన్ని కుట్టుకోడానికి లోపలికెళ్ళే దారికి గుమ్మం ఎదురుగానే ఉన్నా కొన్ని సార్లు ప్రశ్నలను పిడికిలిలోనే బంధిస్తూ తిరుగుతుంటా గాయం మౌనం మిళితమై హృదయపు పునాదులను కదిలిస్తున్నా ఉదయం లాంటి నవ్వు నా పిడికిలో అస్తమించడం ఇష్టం లేక రాలిపోతుంటా నాలో అగమ్యాలు రాలి  గమ్యం చిగురించేలా నిశబ్దాలను చీల్చుకుని వసంతపు శబ్ధం  నాలో జనిస్తుందని ఆశగా కొన్ని సార్లు నాలో నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటా అవమానాల్లోంచి విజయంగా నిరుత్సాహంలోంచి లేలేతగా చనిపోయిన ఓటమిలోంచి నన్ను నేను నిర్వచించుకుంటూ కొత్తగా
పూర్తిగా »