
లైన్లో పిల్లలందరి తోపాటు శివగాడు చిన్న చిన్న అడుగులు వేస్తూ గేటు వైపు నడుస్తున్నాడు. వెనకాలున్న పిల్లాడు షూ తొక్కితే పడబోయాడు. లైన్ ఆగిపోయి పిల్లలు ఒకర్నొకరు గుద్దుకున్నారు. కలదొక్కుకుంటూ ఊరికే నవ్వుతున్నారు. ఆయా అరుస్తూ ముందుకొచ్చింది. శివగాడు కోపంగా ముఖంపెట్టి ఫిర్యాదు చెప్పాడు. లైన్లో వాడి ముందున్న పిల్ల చేయిపట్టుకు లాగింది నడవమని.
శివవాళ్ళ నాన్నకి తను లేనప్పుడు శివగాడు బయట ఎలా ఉంటాడో చూడటం ఇష్టం. అందుకని రోడ్డుకి ఇవతలే నిలబడి గేటు కమ్మీల్లోంచి చూస్తున్నాడు. పిల్లల లైను మెట్ల దాగా వచ్చి విడిపోయింది. శివగాడు పైమెట్టు మీద ఆగి పిల్లల భుజాలు తగుల్తుంటే నిలదొక్కుకుంటున్నాడు. బ్యాగ్ స్ట్రాప్స్ లోకి వేళ్లు…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?