‘ రాజశేఖర్ పిడూరి ’ రచనలు

అ ‘సహాయ’ శూరులు

అక్టోబర్ 2015


అ ‘సహాయ’ శూరులు

పాత తెలుగు సినిమాలు చూస్తూ బాల్యపు జ్ఞాపకాలని తిరిగి జీవించడం- కృతకంగా ఉన్నా సరే, రకరకాల భావాలు అత్యంత స్పష్టంగా వాళ్ళ గొంతుల్లో పలకడం, ఒకే మనిషి అనేక సినిమాల్లో ముఖాలు రకరకాలుగా మార్చుకోవడం చూస్తూ అచ్చెరువొందడం- సినిమా రంగంలోని సహాయ పాత్రల జగత్తు లోని కొందరు ‘నిస్సహాయ, సన్నకారు జీవుల’ గురించి ఈ చిన్న రైటప్…

సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న ఇన్సైడర్ వ్రాసింది కాదు ఇది. పాత తెలుగు సినిమాల్లోని భాషని వినాలనీ, ఆనాటి నటుల వాచకాలను తనివితీరా ఆస్వాదించేసెయ్యాలన్న ఆసక్తి ‘మితిమీరిన’ కొన్నిసమయాలలో- కేవలం సినిమాలను చూసిన అనుభవంతో వ్రాసింది. factual errors ఉండవచ్చు. క్షమించేసి, సమగ్రం కాని ఈ చిన్న…
పూర్తిగా »

అంతర్వేదం

సెప్టెంబర్ 2015


అంతర్వేదం

‘అంతర్వేది’ అనే పేరు తలచుకోగానే అంతర్ వేదం, అంతరంగంలోని వేదం అన్న మాటలతో పాటు – అంతరువు ఏది? (ప్రపంచానికీ నాకూ మధ్య) అన్న భావం కలుగుతుంది. అందుకనే అంతర్వేది అనే పేరులో ఏదో ఆధ్యాత్మిక భావన వినిపిస్తుంది.

చిన్నప్పటి నించీ ఒక నది సముద్రంలో కలవడం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి, ఆకాంక్ష. ఇంత పెద్ద జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోట కొన్ని మైళ్ళ దూరం పాటు సముద్రంలో కూడా మంచి నీళ్ళే ఉంటాయిట అన్న ఆసక్తికరమైన సంగతి చిన్నప్పట్నించీ వింటూ ఉండటం కూడా ఈ ప్రదేశాన్ని చూడాలన్న కుతూహలాన్ని పెంచింది (ఇది తప్పని – కనీసం వరద లేని…
పూర్తిగా »

దాసరి సుబ్రమణ్యం కథలు

దాసరి సుబ్రమణ్యం కథలు

అజ్ఞాత రచయితగా ఎన్నో పిల్లల నవలలు రాసి చందమామలో కొడవటిగంటి కుటుంబరావు గారికి కుడిభుజంలా వ్యవహరిస్తూ యాభై ఏళ్ళ పాటు ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటూ దాదాపు అనామకంగా మరణించిన వ్యక్తి దాసరి సుబ్రమణ్యం గారు. ‘ఇన్ని దశాబ్దాలపాటు ఒకే ఇంట్లో అద్దెకి ఉన్నది భూమండలం మీద నేనొక్కడినేనేమో!’ అనేవారుట.

ఈయన రాసిన పెద్దల కథల సంకలనాన్ని వాహినీ బుక్ ట్రస్ట్ వారు 2011 లో దాసరి సుబ్రమణ్యం కథలు అనే పేరుతో తెచ్చారు. కథల్లో వాక్య నిర్మాణం చాలా చోట్ల అచ్చు గుద్దినట్లు కొ.కు గారిదే. ఇంక కథనం, శైలి, జాన్రా మాత్రం చాలా వరకు కొమ్మూరి సాంబశివరావు (ఉవ్వి) గారిదీ, కొంతవరకు…
పూర్తిగా »

నా ఎఱుక

నా ఎఱుక

గ్రాంథిక శైలిలో రాయబడ్డ పుస్తకాన్ని ఆధునిక పాఠకుడు సులభంగా చదువుకోవడానికి వీలుగా మోదుగుల రవికృష్ణగారు ఎంతో శ్రమకోర్చి పరిష్కరించి వేసిన ప్రతి ఇది. ఈ పుస్తకానికి రవికృష్ణగారు రాసిన ముందుమాట చదివితే పుస్తకం లోపలికి ప్రవేశించకుండా ఉండలేం.
పూర్తిగా »