‘ వసీరా ’ రచనలు

రెండే రెండు అక్షరాలు

జనవరి 2013


నా గుండెల్లో మునివేళ్లు ముంచి
రెండు అక్షరాల కోసం తడుముకున్నాను
తడిసిన రెండే రెండు అక్షరాలు
రెండు వేళ్లతో పట్టుకుని బయటికి తీసాను

అవి నిజానికి నేను నేలమీదకొచ్చాకా
పలికిన మొదటి రెండే రెండు అక్షరాలు

వాటిమీది అలలతో ఏకంగా
ఓ సముద్రమే బటకి వచ్చింది

వాటిని ఎవరో మట్టితో అలంకరించారు
మట్టికి ఎవరో ఆకుపచ్చని రెక్కలు తొడిగారు

భూమ్యాకాశాల రెక్కల్ని
రంగురంగుల పూలతో అలంకరించారు

పూలని గాలితరంగాలమీద ఊరేగించారు
గాలిని తేనెలో తడిపి దిక్కుల చివరి వరకూ
వినిపించేలా ఆలపించారు

పాటని సూర్య కాంతిలో మెరిసే
మంచుకొండల మధ్య ఆడుకోమని…
పూర్తిగా »