‘ సామాన్య ’ రచనలు

ఆత్మహత్యకు ముందు

నవంబర్ 2016


ఇవాళ ఇక్కడి ఆకాశం నిర్మలంగా వుంది
బరువైన ఒక్క నీలి మేఘ సంచారమూ లేదు
సంధ్య నలువైపులా పరుచుకుంటూ వుంది
కంటికి కొంచెం దూరంలోనే ఆకాశాన
కొంత వెలుతురు మడుగు కట్టింది

మనసులో ఆనందం ప్రవహిస్తూ వుంది
ఒక్కటంటే ఒక్కటే చేప చచ్చి తేలింది
అఖ్వేరియంలో మిగిలిన చేపలు
హడావిడిగా ఈదుతున్నాయ్
మిగిలిన గదంతా భద్రం

తను నిశ్శబ్దాన్ని
గాజు సీసాతో బద్దలు కొట్టింది
గాజుకాయ కన్నులు చిట్లాయి
వాష్ బేసిన్లో కాలం జారింది
రేపటి గడియారం రేపటిదే

నక్షత్రపు తాబేలు ఒకటి
ఇచ్చాపూర్వకంగా
దారికి…
పూర్తిగా »

నింగి – నేల

జూలై 2013


నింగి – నేల

ఎందుకట్లా అని నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావ్ . ఆ ప్రశ్నకు నేనేమీ సమాధానం చెప్పలేను. ఎందుకంటే సమాధానం నాకు తెలీనే తెలీదు. సమాధానం చెప్పలేక పోగా ఎందుకట్లా అని నేనే నిన్ను ప్రశ్నిస్తాను. నా పేరేమిటి అంటావా ? నా పేరుతో నీకేం పని ? నీవు ప్రశ్నిస్తున్న విషయానికి నా పేరే పెట్టాల్సిన పనిలేదు. ఈ లోకం లోని శతకోటి మందిలో నేనూ ఒకడిని , పోనీ పేరు నీకంత ప్రాముఖ్యమనుకుంటే ఏ రాజారాం అనో శరవణన్ అనో ఏదో ఒకటి వేసుకో , ఏ పేరు వేసుకున్నా నీవు రాయబోయే కథకి రంగు, రూపు ఏమీ పలుచబారదు. ఆ భరోసాని నీకివ్వగలను నేను.


పూర్తిగా »

నన్ను కదిలించిన మనుషులే నా కథలు!

ఫిబ్రవరి 2013


నన్ను కదిలించిన మనుషులే నా కథలు!

సామాన్య… .చాలా అరుదైన పేరు. అంతకన్నా అరుదైనవి ఆమె రచనలు.ఆదునిక తెలుగు కథానిక సరికొత్త మలుపు తిరగటం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో సామాన్య తనదైన స్వంత శైలి తో సాహిత్య రంగం మీదికి అడుగు పెట్టారు.జీవితంలో కనిపించకుండా మిగిలి పోయిన ఖాళీలను   సామాన్య  తన   కథానికల ద్వారా పూరిస్తూ వస్తున్నారు.ఈమె రాస్తున్న కథలు కొత్తవి.కథనాలు కొత్తవి.శిల్ప సంవిధానం కొత్తది. మారుతున్న కాలంలో మారుతున్న మనవ సంబందాలు ఈమె కథా  వస్తువులు సామన్యమైనవిగా కనిపించే అసామాన్యమైన అంశాలు ఈమె కథలకు ముడి సరుకులు. పాత్రల ద్వారా ఆకారాలను సంతరించుకొన్న అనుభవ విశేషాలే ఈమె కథలు. నిరాడంబరమైన శైలిలో నిశ్చలమైన సాంద్రత.సరళమైన శైలిలో విశాదాశ్రు తుశారాల తేమ నిండిన…
పూర్తిగా »