‘ సైదులు ఐనాల ’ రచనలు

మట్టిపాదం

ఫిబ్రవరి-2014


నన్నునే నిలబెట్టుకోవడమే
తెల్సినోన్ని
తలవంచడం
నేర్వనోన్ని
భూమిని తడిపేది
నాచమటేనని తెల్వని వాడికేం చెప్పను
నీలం చేసిన గాయంగురించి

ఓటు సీటుల
సంగతులు నేర్వని
నాజీవితంల చిరిగిన
పుటల గురించి తెల్వని
వాడికేం చెప్పను
దూదిపూల దుఃఖం గురించి

మిద్దెల అంచున
వేలాడే పెయ్యల గురించి పట్టని
వాడికేం తెల్సని
నాగురించి పుటలల్లనింపుతడు

ఏ పుస్తకం తిరగేసినా
పానం పిసుక్కసత్తంది
మెతుకుదొరకని దినాలలెక్కచెపుదమంటే
నన్ను రాజునుచేత్తిరిగదరా…
నాయకుల్లారా
మీకు పుట్టగతులుండవ్
నేను మేడిపట్టకపోతే….

ఇక
వంగిన…
పూర్తిగా »

తంగేడుచెక్క తనువు తైదల కవిత్వం

తంగేడుచెక్క తనువు తైదల కవిత్వం

తంగేడు చక్కలోని సారాన్ని ఒడుపుగా జుర్రుకుంటున్న కవి తైదల అంజయ్య అంటే తెలుగు సాహితీసమాజాన తెల్వని బిడ్డుండడు. మనిషి చాలా నెమ్మదస్తుడు. చూస్తే తనపేర వస్తూన్న నిప్పుల్లాంటి కవిత్వపాదాలు ఆయనవేనా అని పలుసార్లు కవులనబడే అకవులు గుసగుసలుసైతం గుంబనంగాజేసిరి.కాయితాన్ని మలిచి ఆయుదంగా విసరగలనేర్పును జూసి జతగాళ్ళు బహు సంబరం పడ్తిరి.ఇంతకీ ఈ యన కవిత్వంల ఏముందీ? మాంసముంది,రక్తముంది,చెమటుంది,మట్టివుంది, వలసోని అహంకారాన్ని అలంకారంతో నిలవేసుడుంది,మనసున్న మనిషున్నడు .ఇంకా ఏంకావాలే చదవనీకి,చదివి గుండెలకు అత్తుకోనీకి.

సాహిత్యం వాస్తవికతకు కళాత్మక రూపం. కళాత్మకం కాని సాహిత్యం ఉండదు.సమాజపు క్లిష్టతను,ఆకాంక్ష్లను ప్రతిబింబిస్తూ జాతిచైతన్యానికి ప్రేరకశక్తి అయితుందని తైదల అంజయ్య కవిత్వం చదువుతుంటె గమనంలోకి వస్తుంది.భాషలో మట్టితనం వెటకరింపు,కళాతంకంగా విప్పడం భాగాతెల్సిన విద్యగా…
పూర్తిగా »

ఆత్మగౌరవపు పాట

15-ఫిబ్రవరి-2013


ఏమూలకో నెట్టబడ్డ
ఈసమాజపు మూలవాసిని
నిండావిస్తరించుకున్న
నా జీవనం
నిలువెల్లాదురాక్రమణ
చీల్చబడ్డ పెయ్యచెప్పిన
చివరిమాట
“తలెత్తుకు బతకాలి”
నాకష్టం కానిదేదీ
నాదికాదు
ఎవడిదో జుర్రుకొనేతత్వం కానిది
చూపుడువేలుదారి నాది
నేలతల్లి పేగుతెగని
చివరిగుడిశ వాన్ని
అవును
నేను మూల్ నివాసిని

*

ఎదురీత
కంటి అంచున
ఎగజిమ్మే
రక్తపుచార
సొంతింటి కల
నెరవేరని చివరిచూపు
బతుకువెలితినిదాచే
కనురెప్పలమౌనం
ఎన్నటికీతెగని దుఖపుజీర

ఆదిభూమిసాచ్చికంగా
గివి నా గురుతులు

*


పూర్తిగా »