‘ కృష్ణ చైతన్య అల్లం ’ రచనలు

మూడు వీడుకోళ్ళు

మూడు వీడుకోళ్ళు

పొద్దు పొద్దున్నే వాన పడ్డది కావచ్చు. రోడ్లన్నీ తడిసి పోయి ఉన్నై. స్పీడ్ గా పొతే జారుతదేమో అన్న స్పృహ లేని వాళ్ళు, వాళ్ళ వాళ్ళ మామూలు దినచర్యలలో నగరాన్ని కాలంతో పాటుగా స్పీడ్ గా ఉరకలెత్తిస్తున్నరు. వీళ్ళతో పాటుగా అప్పుడే తన దిన చర్య కూడా మొదలు పెట్టిండు సూర్యుడు. తడిసిన రోడ్ల మీద కిరణాలు ముచ్చటగ కనిపిస్తున్నై.

బస్ స్టాప్ ల దగ్గర దగ్గర యాభై మంది ఉన్నరు. దాదాపు నలభై తలలు వాళ్ళ చేతుల ఉన్న మొబైల్ దిక్కు చూస్తా ఉన్నై. ఓ పది తలలు బస్ వచ్చే దారి దిక్కు అసహనంగా చూస్తా ఉన్నై.

చుట్టూ పనోరమిక్ వ్యూ…
పూర్తిగా »

అపార్ట్మెంట్ నంబర్ 101

అపార్ట్మెంట్ నంబర్ 101

“నానా ఆకాశం ఎందుకు బ్లూ కలర్లనే ఉంటది?” ఏడేళ్ళ అమిత్ వాళ్ళ నాన శేఖర్ని అడిగిండు. “నిజం కావాల్నా, అబద్దం కావాల్నా?” కొడుకుని దగ్గర కూచోబెట్టుకుని అడిగిండు శేఖర్. “నిజం” “కాంతి అలల రూపంలో విస్తరిస్తది. దాని విస్తారణ, పౌన: పున్యం మీద ఆధార పడి మనకు రంగులు కనిపిస్తయ్. బ్లూ కలర్కు తక్కువ దూరం, ఎక్కువ విస్తరించే స్వభావం ఉంటది కాబట్టి మనకు ఆకాశం నీలం రంగుల ఉన్నట్టు కనిపిస్తది. నిజానికి ఆకాశానికి ఏ రంగూ ఉండదు. అర్ధమైందా ఏమన్న?” “ఏం అర్ధం కాలే. అబద్దం చెప్పు ఇపుడు” “అప్పట్లో బ్లూ కలర్ చీప్ గ దొరికేదట. ఆకాశం మొత్తం రంగేయాలంటే బాగా ఖర్చు…
పూర్తిగా »