‘ జుజ్జూరి వేణుగోపాల్ ’ రచనలు

తత్త్వమసి

తత్త్వమసి

నా ఆలోచన ఎవరికో అనుకరణగా మొదలైనపుడు
నా తత్త్వగీతం దేనికో అనుసరణ కాదని నేనెలా చెప్పగలను?
జన్యువులు జననమరణాల్ని నిర్ణయించేసినపుడు
మెల్లిమెల్లిగా ఒక అనువాదంగా పుడతాను.

మా తాత దగ్గిన దగ్గు నా గొంతులోంచి ధ్వనిస్తున్నప్పుడు
ఏ దేవుడి పాదుకలకో అన్నం మెతుకునై అంటుకుపోతాను.
ఎవరో వదిలేసిన క్షణాల్ని ఏరుకుంటూ పరిగెడుతూ
ఏ బాటసారో వదిలిన నిశ్వాసాన్ని ఉఛ్ఛ్వాసిస్తూ ఉచ్ఛరిస్తాను.

విశ్వాన్ని పరికిస్తున్నప్పుడు ఎవరి భుజాలపైనో ఉన్నానని
గతం తాలూకు పేజీల గోడల వెనుక దాక్కున్నానని తెలుసు.
నేను చెట్టుగా ఎదిగిపోతున్నప్పుడు అందమైన ఆకృతినిచ్చే
వనమాలి కత్తెరకంటుకున్న నా ఆకులు కనబడుతున్నాయి.


పూర్తిగా »

సహజాతం

సింగన్న నిలువెత్తు గొయ్యిలోకి దిగాడు. పాలేళ్ళిద్దరూ పైన చెక్కమూత అమర్చారు. ఆ మూతకి మీటరు వెడల్పున అరచేతి బారున రంధ్రం ఉంది. అదిగాక చెక్కమూత నిండా చిన్నచిన్న రంధ్రాలున్నాయి. గొయ్యిలో ఉన్నవాళ్ళకి పైన ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. పాలేళ్ళిద్దరూ చెరో తోలు డప్పు పట్టుకుని బాటకిరువైపులా ఉన్న చెట్లనెక్కి కూర్చొన్నారు. సింగన్న ఈటెను రంధ్రం నుండి పైకి ఎత్తి పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. వేట సింగన్నకి సంప్రదాయ సిద్ధము. అతని జీవనాధారం, తప్పని కర్మ. దొరకి మాత్రం ఓ సరదా. ప్రతి పున్నమికి దొర షావుకారుని, పాలేళ్ళని, బోయపల్లె నుండి సింగన్నని తీసుకుని అడవికి వేటకొస్తాడు.

ప్రతి అడవి జంతువుకి పొట్టభాగం సున్నితంగా ఉంటుంది.…
పూర్తిగా »