‘ టి. చంద్రశేఖర రెడ్డి ’ రచనలు

కథాయణం ప్లస్ నాగరికథ=నాగరికథాయణం

ఈ సమీక్షావ్యాసం అనిల్ ఎస్. రాయల్ గారి కథాసంపుటి, ‘నాగరికథ’ మీద రాసింది. సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. ఒక కథ స్వేచ్ఛానువాదం. మూల కథ All You Zombies. రచయిత రాబర్ట్ ఎ. హెయిన్లిన్. మిగిలిన కథలు వివిధ
పూర్తిగా »

వాకిలి కథలపై విహంగవీక్షణం

జనవరి 2013 లో మొదలైన వాకిలి అంతర్జాల మాసపత్రిక జూన్ 2016 సంచికతో 42 నెలలు పూర్తిచేసుకుంది. నవల, కథ, కవిత,వ్యాసం ఇలా రకరకాల సాహిత్యప్రక్రియలకి తనలో స్థానం కల్పిస్తోంది. కొన్ని గణాంకాలనీ, ఇంకొన్ని ప్రమాణాలనీ ఆధారం చేసుకున్న ఈ విశ్లేషణ; మూడున్నర సంవత్సరాలలో వాకిలిలో వచ్చిన కథల తీరుతెన్నులని విభిన్న కోణాల్లోనుంచి చూడటానికి ఒక ప్రయత్నం చేస్తుంది.

కథల సంఖ్య:

ఈ నలభై రెండు నెలల్లో వాకిలిలో వెలుగు చూసిన కథలు 120. ఇందులో అనువాద కథలు 3. మిగిలినవి 117. అంటే నెలకు సగటున సుమారుగా 3 కథలు వాకిలిలో ప్రచురితమయ్యాయి.

కథల పేర్లు:

చాలామంది రచయితలు కథకి సంబందించిన…
పూర్తిగా »

ద్వంద్వపదాలు

ద్వంద్వపదాల వినియోగం తెలుగు భాషలో ఉన్న విశిష్టతల్లో ఒకటి. విద్యార్థి కల్పతరువు అను ఆంధ్రభాషా విషయసర్వస్వం పేరుతో, వేంకట్రామ అండ్ కో వారు 1979 లో ప్రచురించిన గ్రంథంలో, వీటికోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయమే ఉంది.  1980 లో వెలువడ్డ అయిదో ముద్రణలో, 686-687 పేజీల్లో ఈ ద్వంద్వపదాల పట్టికని వాటి అర్థాలతో సహా చూడవచ్చు. ఈ పట్టికలో ఏకంగా 102 ద్వంద్వపదాలున్నాయి. దీనితో పాటు జంట పదాల పట్టిక కూడా వాటి అర్థాలతో 672-682 పేజీలవరకూ చూడవచ్చు.

జంట పదాలంటే ఒకేరకంగా ధ్వనిస్తూ, వేరే అర్థం ఇచ్చే పదాలు. తెలియక మరోరకంగా రాస్తే అపార్థం ధ్వనించే పదాలు. ఉదాహరణకు అంకిలి, అంగిలి. అంకిలి అంటే…
పూర్తిగా »

తెలుగు కథలో భాష

ఏ సాహిత్యప్రక్రియలో వాడిన పదాలయినా, పదబంధాలయినా పాఠకుడు సులభంగా చదవగలగాలి. అది సౌకర్యంగా జరిగితేనే; తెలిసిన అర్థాన్ని, తెలుసుకున్న అర్థాన్ని వాక్యానికి అన్వయించుకుని అంతర్లీన భావాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఈ మధ్య నేను చదివిన ఒక తెలుగు కథలో 769 ఇంగ్లీషు పదాలు ఉన్నాయి. దీనికి తోడు ఒక ఇంగ్లీషు పదానికి మరో తెలుగు పదాన్ని ముడెయ్యటం. టేబిల్మీద అలాంటి ప్రయోగాల్లో ఒకటి.  అదే పెద్ద ఇబ్బంది అనుకుంటున్న దశలో, నాలుగు ఇంగ్లీషు పదాలకి పీటముడి వేసి, సంథింగీజ్రాంగ్ అని కొందరు మాత్రమే పలికేలా రాయటం, మూలిగే నక్కమీద తాటిపండే కాగలదు.
పూర్తిగా »