‘ బొలిమేరు ప్రసాద్ ’ రచనలు

పిచ్చుక

ఏమో ? ఎలా వలస పోయేదో ?

ఎర్రటి ఆలాపనతో మొదలై
పచ్చని అడివిపాట గుండెదాక పాకినట్టు
వేపచెట్టుకి అవ్వచీర
జోల పాటై వూగాడినట్టు
పొద్దు మరలా వూరేగివచ్చినట్టు
కిటికీరెక్కపై కిచకిచలాడేది

ఏమో ? ఎలా జోడుకట్టేదో ?
చూరుకి కంకులజడలా తోడుగా అల్లుకొనేది
గింజగింజలో భావాన్ని వెతుకులాడేది
నేలమీద బంగారు పొట్టులా నైరూప్య చిత్రమయ్యేది

ఏమో ? ఎలా ఓ ప్రపంచమయ్యేదో ?
వసారాగుండెలో జననమయ్యేది
నిన్నటినీ రేపటినీ కలిపే క్షణాల వంతెనయ్యేది

ఏమో ? ఎలా ఓ వేదనయ్యిందో ?
అద్దం మీది బొట్టుబిళ్ళల్లో వెతుకులాటయ్యిందిపూర్తిగా »