‘ భారతి ’ రచనలు

ఆత్రమే ఆనందం

ఫిబ్రవరి 2015


ఆత్రమే ఆనందం

“ఏనుగమ్మా ఏనుగు
మా ఊరొచ్చిందేనుగు
మంచినీళ్ళు తాగిందేనుగూ…”

వీథిలో కొత్త వింత కానీ, ఇష్టమైన జంతువు కానీ, అపురూపమైనదేదైనా కానీ, లేక గొప్ప వ్యక్తి కానీ కనబడబోతుందంటే చాలు – పట్టరాని ఆత్రుత మనకు. ఈ ఆత్రుత విషయంలో పిల్లలకూ పెద్దలకూ తేడాయే కనబడదు. ఆ ఆత్రుత వల్ల ఒక్కోసారి ఒళ్ళు కూడా తెలీదు.

80 వ దశకంలో బాల్యాన్ని గడిపిన వారికి తెలిసి ఉంటుంది. సినిమా బండి వస్తే చాలు. ఆ బండి వెనక పరిగెత్తటం, ఆ బండి వాడు ఇచ్చే సినిమా ప్రచారకరపత్రాన్ని ఎలాగైనా తీసుకోవటం ఎంత సంబరంగా ఉండేదో!

ఈ ఆత్రుత పసిపిల్లల విషయంలో ముద్దు.

ఐసుక్రీము బండిపూర్తిగా »

ఒక గుండుబాబు కథ!

జనవరి 2015


ఒక గుండుబాబు కథ!

ఒక విషయానికి మనం నిజంగా కే వీ రెడ్డిగారిని మెచ్చుకోవాలి. ఎస్వీరంగారావు గారి ఆహార్యం డిసైడ్ చేసేప్పుడు కోరలూ, అవీ లేకుండా ఎంచక్కా అందగాడుగా, అదే సమయంలో భీతావహుడుగా తీర్చిదిద్దారు. నన్నయ్య గారి హీరోలా కారుమేఘంలా చేయక దబ్బపండు ఛాయలో మెరిసే ఎస్వీ యారు గారిని పెట్టేరు. ఘటోత్కచుని తల్లి రాక్షసి కాబట్టి నల్లగా కారుమేఘంలాంటి శరీరమని కవులు చెప్పేరు. తద్విరుద్ధంగా మాయాబజారు ఘటోత్కచునిది తండ్రి పోలిక. "ఛాంగురే బంగారు రాజా" అన్నట్టున తండ్రి రంగులో మనవాడినీ తీర్చిదిద్దారు. కిరీటం వెనకాల చిత్రమైన జుత్తు పెట్టేరు. తెలుగు "వాడి" స్టయిలుకు ప్రతిరూపంగా మీసమూ పెట్టేరు.
పూర్తిగా »