‘ రాధేయ ’ రచనలు

అవిశ్రాంత కవితో ఆత్మీయ సంభాషణ

అవిశ్రాంత కవితో ఆత్మీయ సంభాషణ

ప్రతిష్టాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు వ్యవస్థాపకులు రాధేయ గారితో ముఖాముఖం – ఎ.ఎ. నాగేంద్ర (పరిశోధక విద్యార్థి, అనంతపురం).

1) ముందుగా మీ జీవిత నేపధ్యం గురించి తెలుసుకోవచ్చా?

నా జీవితం వడ్డించిన విస్తరికాదు. పేదరికంతో అనేక ఆటుపోట్లతో గడచిపోయిన జీవితమే. ఒక సామాన్య చేనేత కుటుంబంలో పుట్టడం వల్ల తల్లిదండ్రులిద్దరూ చేనేత కార్మికులైనందువల్ల వారి రెక్కల కష్టంతో చదువుకోవడం జరిగింది. మేము మొత్తం 5మంది అన్నదమ్ముళ్ళం ఇద్దరు చెల్లెళ్ళు ప్రస్తుతం అందరం కూడా వారివారి స్థాయిల్లో నిలబడటం జరిగింది.

నేను ఒక సామాన్య ఉపాద్యాయునిగా 1982 సం॥లో ఉద్యోగంలోకి ప్రవేశించి, ఉద్యోగంలో వుంటూనే ఉన్నత చదువులు చదవాలనే బలమైన ఆకాంక్షతో ప్రయివేటుగా ఎం.ఏ. తెలుగు,…
పూర్తిగా »