‘ శిఖామణి ’ రచనలు

మార్మిక పద్య మధుపాయి: భూమయ్య

09-ఆగస్ట్-2013


మార్మిక పద్య మధుపాయి: భూమయ్య

1994లో అనుకుంటాను భూమయ్యగారి మొట్ట మొదటి పద్య కవితా సంపుటి ‘వేయి నదుల వెలుగు’ వారు పంపగా అందుకున్నాను. మంచి పద్యం ఎక్కడ కనపడ్డా కళ్ళ కద్దుకొని చదువుకునే నాకు ‘వేయి నదుల వెలుగు’లో కొత్త కాంతి లోకాలు కనిపించాయి. అప్పటికి నేను రాజమండ్రి సాహిత్య పీఠం లో బదిలీ పై పనిచేస్తున్నాను. తెలుగు పాదయారామం అనదగివ బేతవోలు రామబ్రహ్మం గారు పద్య కవిత్వానికి ‘క్రొత్త గోదావరి’ పరవళ్ళు నేర్పిస్తూ మరొక పక్క అవధానాలను తన కనుసన్నలతో శాసిస్తున్న కాలం. మరొక పక్క ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్. ఒక రకంగా పద్యానికి, వచన కవిత్వానికీ ఆరోగ్యకరమైన పోటీ వున్న కాలం. ఎవరు…
పూర్తిగా »

మాయమైపోయిన నెమలీక

19-జూలై-2013


మాయమైపోయిన నెమలీక

సాహిత్య పరంగా నాకో చెడ్డ అలవాటుంది . అదేమిటంటే కవులు , రచయితల చిరునామాలు రాసి పెట్టుకున్న డైరీ ని ఎప్పుడు తిరగేసినా అప్పటి వరకూ చనిపోయిన వాళ్ళ చిరునామాలపై ఇంటూ గీతలు కొట్టడం. మొన్నటికి మొన్న కె.ఎస్. రమణ గారి చిరునామా కనబడితే ఎందుకో కొట్టి వేయబుద్ది కాలెదు. నా డైరీనిండా ఇలాంటివి ఎన్నో! వాటిలో కాల ధర్మం చెందిన జి.వి.ఎస్., నాగ భైరవ, తొక్కుడు బండ కృష్ణముర్తి, ఇస్మాయిల్, స్మైల్, అజంతా,మో , కొత్తపల్లి, వడలి మందేశ్వరరావు, జ్ఞానానంద కవి, సదాశివ వంటి పెద్దలూ, అకాల ధర్మం చెందిన మద్దెల శాంతయ్య, మద్దూరి నగేష్ బాబు, నాగప్పగారి సుందర్రాజు, నక్కా అమ్మయ్య, నాగపురి…
పూర్తిగా »