కథ

గరుగు చెప్పిన కథ

గరుగు చెప్పిన కథ

ఊరికి ఉత్తరాన హద్దు గీసినట్టు తాడిచెట్లు. వాటికి పర్లాంగు దూరంలో గరుగు. దాని తర్వాత నక్కలబోడు. దానికి పైన దోసకాయలబోడు. ముందుకుబోతే పీసెర్లకొండ. ఆ కొండలో కానీ, ఈ పక్క మాలకొండ అడివిలో కానీ, మా ఊరికి దిగవనున్న మల్లప్పగొందిలో కానీ లేని సక్కదనమేందో.. గరుగులో ఉన్నట్టనిపిచ్చేది. మహాకాయుడెవుడో రొమ్మిర్సుకుని పడుకున్నట్టు ఉంటదా గుట్ట. దాన్నిండా యాడచూసినా తెల్లటి కన్నెరాళ్లే. గుట్టకాడికి ఎప్పుడు పొయినా ఎవురో గుసగుసలాడుతున్నట్టనిపిచ్చేది. ఆ ఏపు పెద్దగా మనుషులు పొయ్యేది కూడా లేదు. నాకు మాత్రం అటొచ్చినప్పుడల్లా తెలిసిన మనిసెవురో తిరుగుతున్నట్టనిపిచ్చేది. అక్కి దాసరోడి గురించి ఇన్న కతలన్నీ గుర్తుకు వచ్చేయి.

అక్కి దాసరోడు, అక్కిపిచ్చోడు…

రెండు పేర్లు, రెండు…
పూర్తిగా »

నీలా టీచరూ ఇంకో పెద్దకళ్ళ అమ్మాయీ

మే 2017


నీలా టీచరూ ఇంకో పెద్దకళ్ళ అమ్మాయీ

ఆమెను చూడగానే మొదట ఎవరికైనా తట్టేది ఆమె అందమే. నాకు ఆ ఏడెనిమిదేళ్ళ వయస్సులో కూడా ఆమె చాలా అందగత్తె అని తెలుస్తూండేది; లేక ఆమె రూపం మనసులో ముద్రించుకుపోయి, తర్వాత అందచందాల
పూర్తిగా »

ఫోర్ స్క్వేర్

ఫోర్ స్క్వేర్

సికిందరాబాద్ స్టేషన్ ముందు రకరకాల పూసల దండలు, దువ్వెనలు, చిన్న సంతూరు సబ్బులూ, సబ్బు బాక్సులు, చెక్క రోకలి, సంత సత్తు గిన్నెలు, చెక్క ఈర్వెన, ఇనుప జల్లెడ, ముగ్గు జాలీ పోతలు, పౌడర్ డబ్బాలు అమ్ముతుంటుంది. గంజాయి కూడా. అయితే గంజాయిని ‘మాల్’ అంటాడు కోబా. ‘పత్తే’ అంటుంది తిత్లి. ఉత్తరాంచల్ నుంచి, నల్లమల నుంచీ, బెంగళూరు నుంచి ‘మాల్’ తీసుకువచ్చేది మాత్రం బోజి. తన రెండో మొగుడు తింగేత్ సోక్లా కూడా గంగపుత్ర కాలనిలో జరిగిన దాడిలోనే దారుణంగా చనిపోయిన తర్వాత బోజిని వుంచుకుంది లాంగిసి.
పూర్తిగా »

సుధా వృష్టి

సుధా వృష్టి

శ్రావణం అయిపోయింది. భాద్రపదమూ సగపడింది. ఎక్కడా తడిగాలి పొడ కూడా లేదు. అప్పుడే సూర్యుడు బాగా నెత్తి మీదికి వచ్చేశాడు, అంతటి ఆకాశం లో ఆయనొక్కడే. మొగమాటానికి కూడా ఒక్క మబ్బు పింజ లేదు. ఆ పూటకి అక్కడి గంజికేంద్రాన్ని మూశాక, ఒక్కొక్క మెట్టే ఎక్కి వెళుతున్నాడు ఎట్టయాపురం ప్రభువు. ఆపూట ఎక్కడా నిలుచోబుద్ధి కావటం లేదు. సరాసరి మూడంతస్తులూ ఎక్కి చంద్రశాల అనబడే మేడ మీది ఆరుబయటికి వెళ్ళి ఆగాడు. తలెత్తి ఒక్కడే ఆ ఎర్రటి ఎండలోకి చూస్తూ కొద్ది ఘడియల సేపు.
పూర్తిగా »

ఉలవచారు రత్నం సారు

ఏప్రిల్ 2017


ఉలవచారు రత్నం సారు

“ఏ బ్రాంచ్ అమ్మా మనది?”

“ఎలెక్ట్రికల్ అండ్ ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్  సా”    చెప్పాను.

“ఏది.. దాన్ని సింప్లిఫై చేసి చెప్పు”.

“ఈ ఈ ఈ సా”

“ఆపకుండా మూడు సార్లు చెప్పు”

“ఈ ఈ ఈ  ఈ ఈ ఈ  ఈ ఈ ఈ ”

“ఎందుకు పాపా ఏడుస్తున్నావు. చీమ కుట్టిందా”

అప్పటి దాకా బిక్కు బిక్కు మంటున్న నాకు భలే నవ్వు వచ్చింది. యాడో ఒంగోలు దగ్గర వున్న ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇంత పెద్ద విశాఖపట్నంకి ఇంజనీరింగు చదవటానికి వచ్చా. రాగింగ్ అని ఒకటుంటుందని ఆడా ఈడా అనుకుంటుంటే విన్నా. సీనియర్లు ఏమడిగినా చెప్పాలని, సీనియర్లని సార్ అనాలని…
పూర్తిగా »

రాతబడి

రాతబడి

“మన రామారావు సంగతి విన్నావా?”

“ఏం చేశాడు?”

“వాడు చెయ్యలా. వాడికే – ”

“చేతబడా?”

“నా చిన్నప్పుడు ఒక కాంపౌండర్  ప్రాక్టీసు పెట్టి వచ్చిన రోగు లందరికీ ఒకే రంగు నీళ్లిచ్చేవాట్ట. అలాగే, కళ్లు తిరుగుతున్నాయన్నా, కాలు నెప్పి పుడుతోందన్నా చేతబడే అనేలా వున్నావు!”

“కాదు అని ఖచ్చితంగా నువ్వు అనలేదు గనుక, మిగతా వివరాలు చెప్పు.”

“ఏవో పిచ్చి చూపులు చూస్తూంటాడు లేకపోతే నవ్వుతుంటాడు. ఆఫీసు కెళ్లడం మానేశాడని వేరే చెప్పక్కర్లేదు గదా! వాణ్ణి చూసిన వాళ్లెవరూ గాలి సోకిందనో, విషప్పురుగు కుట్టిందనో ఏదో ఒకటి అనకుండా వుండట్లేదుట. ఇప్పుడు నువ్వు చేతబడిని కూడా ఆ లిస్టులో చేర్చావ్. వాడి అదృష్టమల్లా,…
పూర్తిగా »

లక్ష గ్రంథాలు

లక్ష గ్రంథాలు

మెజనైన్ ఫ్లోర్ దాటగానే మహాసభల మొదటి హాల్ కనిపించింది. ఎయిర్ కండిషన్డ్ కావడంతో తలుపులు బిగించారు. లోపలి మాటలు వినబడటం లేదు. అప్పుడప్పుడు డెలిగేట్లు ఎవరో ఒకరు టాయ్లెట్ కోసమో, జీడిపప్పు కేక్ సహితం తయారుగా ఉన్న కాఫీ కోసమో తలుపు తీసినప్పుడు "అతను అంతర్జాతీయ కవి. ఫిజీ దీవి ప్రజలకొరకు కళ్ళుచెమర్చుతూ కవితలు రాసినాడు. మహాకాళి రష్యాదేశాన్ని కరుణించింది... అని రష్యా విప్లవాన్ని పాడినాడు" ఒక వక్త ఆవేశ ప్రసంగంతో మహాసభ దద్దరిల్లుతోంది.
పూర్తిగా »

దత్తుడు

ఫిబ్రవరి 2017


దత్తుడు

దత్తుడు మట్టిలో కలిసిపోయాడు. భూమి మీద పడి మట్టి మీద బ్రతికినంత నిశబ్దంగానే. తరాల వారి కంగా ఒక్కటంటే ఒక్క శిలా విగ్రహం కూడా ప్రతిష్టించబడలేదు. తన గుడిసెలో ఉన్న ఆ రెండు పంచెలు, గొడ్డలి మాత్రేమే అతను మిగుల్చుకున్న జ్ఞాపకాలు.ఆరేళ్ళ వయస్సులో పోలేటి వెంకట్రావు ఇంటికి దత్తుడు కింద వచ్చాడు. పక్కూరులో ఎవడో ఎర్రోడి ఆఖరి కొడుకు. అతనికి పెంచే దిక్కులేకపోతే పోలేటి వెంకట్రావు, పోస్ట్ మాస్టారుని వెంటబెట్టుకెళ్ళి ఎంతకో కొన్నుక్కు తెచ్చుకున్నాడు. వెంకట్రావు కూడా ఏమి కలిగినోడు కాదు. నలుగురు ఆడపిల్లల తండ్రి. అతనిదీ కూలి పనే. వాళ్ళావిడ మేకల్ని మేపేది. మా ఊల్లోకి దత్తుడిని  కరణం గారి…
పూర్తిగా »

ఎర్రర్ ఆఫ్ లవ్

ఎర్రర్ ఆఫ్ లవ్

నెలల పిల్లాడు మెత్తగా చెంపలు తాకుతున్నట్టు తగులుతుంది గాలి. నీటిలో తన ప్రతిబింబంపక్కనే విక్రం ప్రతిబింబం ఓలలాడుతూ తరంగాలతో కలిసి కలల రాగం ఒకటి బాణీ కడుతున్నట్టుగా ఉంది. ప్రియ తదేకంగా నీటినే గమనిస్తుంది. విక్రం చేతిలో ఒక చిన్న గులక రాయి నీటిలోకొదుల్తూ “ఏంటి, నవ్వుకుంటున్నావు?” అనడంతో సర్దుకుని “నవ్వేనా?” అని మందహాసంతో కళ్ళు విప్పారుస్తూ చూసింది. తీర్చి దిద్దిన కనుబొమ్మల కింద తడి మెరుస్తున్న కళ్ళను విక్రం ఒక రెండు సెకన్ లలోనే జీవితమంతా సేద తీరినట్టుగా చూసాడు.”ఏదో గుర్తుకొచ్చి…” అని మందహాసంతో విక్రం అరచేతిని తన చేతిలో దాచుకుంది.

ఉత్తుంగ ప్రవాహంలో
విసురుగా ఒడ్డు చేరిన చెట్టు…
పూర్తిగా »

మిట్టూరు టు మెట్రో: ఐదు కథల మీదుగా

మిట్టూరు టు మెట్రో: ఐదు కథల మీదుగా

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

ఐదుగురు రచయితలను ప్రేమ కథ రాయమని అడిగారు. ఎవరు ఎలా రాస్తారో అని ఒక చిన్న ఊహ. ఒకరకంగా సాహిత్య మిమిక్రీ…

లవ్ యిన్ లివ్ యిన్

కుప్పిలి పద్మ

వర్షం మెల్లగా కురుస్తోంది. వో పక్క మార్గశిరమాసపు చల్లని శీతలగాలులు నైట్ క్వీన్ పరిమళాలను కలుపుకోని లోపలికి మత్తుని మోసుకొస్తుంటే మరో పక్కనుంచి వినిపిస్తున్న రఫీ పాటలు ఆ మత్తుని మధురంగా మారుస్తున్నాయి. మహి మనసు మాత్రం ఆ వాతావరణానికి వ్యతిరేకంగా…
పూర్తిగా »