‘ పి. విక్టర్ విజయ్ కుమార్ ’ రచనలు

ఎర్రర్ ఆఫ్ లవ్

ఎర్రర్ ఆఫ్ లవ్

నెలల పిల్లాడు మెత్తగా చెంపలు తాకుతున్నట్టు తగులుతుంది గాలి. నీటిలో తన ప్రతిబింబంపక్కనే విక్రం ప్రతిబింబం ఓలలాడుతూ తరంగాలతో కలిసి కలల రాగం ఒకటి బాణీ కడుతున్నట్టుగా ఉంది. ప్రియ తదేకంగా నీటినే గమనిస్తుంది. విక్రం చేతిలో ఒక చిన్న గులక రాయి నీటిలోకొదుల్తూ “ఏంటి, నవ్వుకుంటున్నావు?” అనడంతో సర్దుకుని “నవ్వేనా?” అని మందహాసంతో కళ్ళు విప్పారుస్తూ చూసింది. తీర్చి దిద్దిన కనుబొమ్మల కింద తడి మెరుస్తున్న కళ్ళను విక్రం ఒక రెండు సెకన్ లలోనే జీవితమంతా సేద తీరినట్టుగా చూసాడు.”ఏదో గుర్తుకొచ్చి…” అని మందహాసంతో విక్రం అరచేతిని తన చేతిలో దాచుకుంది.

ఉత్తుంగ ప్రవాహంలో
విసురుగా ఒడ్డు చేరిన చెట్టు…
పూర్తిగా »

బతుకు తునకలు

అప్పుడు మా ఇంటి పక్కల్నే మార్తమ్మ ఆంటి ఉంటుండె.వరండనానుకొని గింత రూముంటుండె. దాన్ల టాబ్లెట్లు, డెటాల్, సూదులు అన్ని ఉంటుండె. ఇంగ ఆ రూం ఎనకాలె ఒక పెద్ద రూం, వంట రూము పెట్కోని, మార్తమ్మ ఆంటి, ఆంటి కొడుకు ప్రసాదు ఉంటుండ్రి.’ ప్రాథమిక చికిత్స కేంద్రం ‘ అని ఎర్రగ రాసుండే ముందు వరండాల. వరండ గోడ ముందర పాపిట్ దీసుకుని రెండు జల్లేసుకున్న ఒక పిల్ల నవ్వుతుండే పోటో, ఇంగో పిల్లోని పోటో మద్దెల ‘ ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు ‘ అని రాసుండె. ఎర్రది ప్లస్ గుర్తు ఇంకో గోడ మీదుండె. వరండా ఎప్పుడు జూసిన కాలిగుంటుండె. బెంచీ మాత్రం…
పూర్తిగా »

చిల్లర నాణేలు

చిల్లర నాణేలు

ఆ రోజు సమ్యక్ రెడ్డి కి తాను కూర్చున్న వేదిక తనకు జన్మ ప్రసాదించిన దేవదూతలతో నిండిన పర లోకంలా ఉంది.

డయాస్ మధ్యలో సమ్యక్ పక్కన విలియం థాంసన్ ఆసీనుడై ఉన్నాడు. తెల్లటి కోటు వేసుకుని , ఎరుపు రంగులో మెరుస్తున్న చర్మం , తెల్లగా కాంతులీనుతున్న వెంట్రుకలతో ప్రత్యేకంగా అగుపిస్తున్నాడు. అతని వెనుక సుమారు 150 మంది తెల్ల కోట్లు వేసుకుని నిమ్మళంగా ఆసీనులై ఉన్నారు. మెడ మీద నుండి వాలుతున్న స్టెతస్కోప్ లు వరుస మొత్తానికి వేసిన ముగ్గు లాంటి డిజైన్ లా ఉంది. డాయస్ మీద పడుతున్న ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆ ప్రదేశమంతా కొత్త కాంతులీనుతుంది.

ఇంటర్నేషనల్…
పూర్తిగా »