కథ

దొరబాబు

పాపం చెన్నమ్మ.. వయసులోనే మొగుడు పోయి, ఇప్పుడు వయసే అయిపోయి, ఆటో యాక్సేంట్లో చెయ్యి తెగిపోయి, ఒంటిపైని ముడతలు పడిపోయి ఇట్టా వుండాదిగానీ దొరబాబు పెళ్ళాం కాక ముందర, పాతూరు పాలెంలో చానామంది కన్నా మా గొప్పగా బతికినట్టే!. చిన్నప్పుడు చెన్నమ్మ తల్లి రవనమ్మ, పిల్లకి బుగ్గమీదా, ముక్కుమీదా, అరికాలినా దిష్టి చుక్కలు పెట్టేది.

“నాకూతురు సందమామ. దీనికి కురిచీలో కాలు మీద కాలేసుకుని కూచునే దొరబాబు లాటి మొగుడోస్తాడు”పతిరోజూ ఇట్నే అనేది. చెన్నమ్మ కిల కిలా నవ్వేది. రోజూ అమ్మ గారాబం చేసి మోచ్చుకోటాన తను నిజంగా చాలా అందగత్తె అని చెన్నమ్మకి తెలిసిపోయ్యింది. అందుకే ఆటల్లగూడా యువరాణీ ఏషాలే గట్టేది. చుట్టు పక్కల…
పూర్తిగా »

మాటల మధ్య ఖాళీలు

మాటల మధ్య ఖాళీలు

“ఎలక్ట్రీషియన్ మేడమ్. సాబ్ చెప్పారు” ఇంటర్ కామ్ లో వినపడింది.

“పైకిరా. సెవన్నాటూ”

జీవన్ ఈరోజు కూడా మర్చిపోతాడనుకున్నాను. ఫర్లేదు మూడు రోజుల తరువాతైనా గుర్తు పెట్టుకోని పంపించాడు.

ఏం చేస్తోందో మేడమ్. బెల్ కొట్టినా తీయట్లేదు. ఫోన్లో రమ్మనమని అందిగా!

తలుపు ధడాల్న తెరుచుకొని – “మేడమ్ నేను ఎలక్ట్రీషి…” మాటలు రావటం ఆగిపోయింది. ఆమే కదా! ఆమే. నన్ను గుర్తుపట్టిందా?

తలుపు తెరవగానే ఎదురుగా – వినయ్ కదూ అతను? గుర్తుకువచ్చిన ఒక్క క్షణంలోనే సంతోషం, ఉలికిపాటు.

“లోపలికిరా వినయ్” ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడన్నమాట. అయినా వినయే దొరికాడా జీవన్ కి.

పేరు పెట్టి పిలిచిందంటే గుర్తుపట్టిందనేగా అర్థం. పాత…
పూర్తిగా »

నాలుగు స్తంభాలాట

నాలుగు స్తంభాలాట

ఆడపావురం

“నేను అతన్ని చంపాలనుకోలేదు. నన్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేనే అతన్ని పొడిచాను. తప్పు నాది. నా బిడ్డది కాదు. నా బిడ్డనీ, నా చెల్లినీ, నా భర్తనీ వదిలేయండి. విచారించడానికి ఎన్ని చోట్ల నుండో వచ్చిన ఈ పెద్దల పంచాయితీకి ఏం జరిగిందో చెప్తాను…

అదిగో ఆ కనపడుతున్న రావిచెట్టు గూడే మా నివాసం. ఇంట్లో నేను, నా కూతురు, మా ఆయన, నా తిక్క చెల్లి ఉంటాం. తిక్క అంటే పెద్ద తిక్కదేం కాదు కాని అస్తమానం ఏవేవో తింగరి మాటలు మాట్లాడుతుంటుంది. పాపం అనాకారిదని దాన్నెవరూ పెళ్ళి చేసుకోకపోతే మా అమ్మానాన్నలు పోయాక మా ఇంట్లోనే ఉంచుకున్నాను.…
పూర్తిగా »

ఓరియో స్వగతం

ఓరియో స్వగతం

ప్రపంచవ్యాప్తంగా
కుక్కలెన్ని లేవు
ఏ కుక్క ఎక్కడికి చేరుతుందో
ఎవరికి ఎరుక
నేనూ అంతే
ఎక్కడో చైనా సంతతి నాది
అమ్మను చూసిన జ్ఞాపకం తప్ప
నాన్నెవరో నాకు తెలియదు
చల్లటి పచ్చిక ప్రాంతంలో పెంచి
ఎవరో నన్ను పెంచుకుందా మంటే
వారికి ఎందుకిచ్చారో కూడా తెలియదు

అయితేనేం వారిది
గొప్ప ఇల్లు
నాకు ప్రత్యేకమైన తిండి వైద్యంతో
వారు నన్ను ప్రేమగా చూసుకున్నారు
బయట వాతావరణం ఎలా ఉన్నా
క్రమం తప్పకుండా నన్ను షికారుకు తీసుకుపోయేవారు
బయటకు…
పూర్తిగా »

కోపకచ్చ

కోపకచ్చ

అర్థాలు అడగకుండా వుంటానంటే ఒక కథ చెప్తాను.

వాతాపి అని ఒకడుండేవాడు. వాడు చేసేది ఓ పెద్ద కంపెనీలో పెద్ద వుద్యోగం. పెద్ద వుద్యోగం చేసేవాడిని వాడు వీడు అనకూడదు కదా. అందుకని ఆయన, వారు లాంటి పదాలు వాడదాం ఇక నుంచి.

ఏం? ఆయనగారు ఉద్యోగం చేస్తున్నారు కదా. అందువల్ల నెల నెలా జీతం వస్తోంది. ముఫై వేల ఐస్ క్రీమ్ లు జీతంగా ఇచ్చేవాళ్ళు. నెల ముఫై రోజులు అది కొంచెం కొంచెంగా కరిగిపోతూ వుండేది. శనాదివారాలు కాస్త ఎండ ఎక్కువ కాసేది. ఓ నాలుగు ఐస్ క్రీములు ఎక్కువ కరిగిపోయేవి. నెలాఖరుకు వచ్చేసరికి రెండో మూడో పుల్లైసులు మిగిలేవి.

ఇలా…
పూర్తిగా »

నాక్కూడా…

నాక్కూడా…

సౌందర్యపు సెలయేటి నీటి దప్పిక ఎప్పుడూ ఆరదూ తీరదూ… ఇప్పుడు మందు మీద మత్ప్రియురాలి దర్శనకాంక్ష తీవ్రంగా…గేట్‌ను బండితోనే తోసుకు లోపలికి, నా లోపలికి… పగిలిన సాంధ్య వర్ణాలను చప్పరిస్తూన్నప్పుడు, అప్పుడప్పుడే విడివడ్తూన్న రేరాణీ పరిమళాల్తో…ఆ మధుగంధ మిళితమై…బహుమను తే నునుతే తవ’ లేను సంగీత పవన చలిత…పిండా కూడూ, నిర్వికారంగా తిరుగుతూన్న ఫ్యాను…
పూర్తిగా »

లఘుచిత్రం

ఏప్రిల్ 2016


లఘుచిత్రం

సీట్ బెల్ట్ పెట్టుకోబోతూండగా … కాల్ వచ్చిన వచ్చిన శబ్దం. ఎవరో అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. అభి నుండి కాల్. ఎంతో అవసరమైతే తప్ప కాల్ చేయడని తెలిసిన నేను .. ఆన్సర్ చేసాను.
“రాజా బాబూ! షార్ట్ ఫిల్మ్ షూటింగ్,ఎడిటింగ్ అన్నీ పూర్తై పోయాయి. యు ట్యూబ్ లో అప్లోడ్ చేసాను. మీరు చూసి ఎలా ఉందో చెప్పాలి…
పూర్తిగా »

కత్తుల భయం

మార్చి 2016


కత్తుల భయం

ఆదివారం కాబట్టి ఓల్డుమాంకు ఓ క్వార్టరూ, అరకిలో చికెనూ గదికి తెచ్చుకున్నాడు రాములు. మందులోకి పావుకిలో ఫ్రై చేసుకున్నాడు, ఇంకో పావుకిలో అన్నంలో కలుపుకుతింటానికి వండుకుందామనుకున్నాడు. ఉల్లిపాయలు తరుగుతుండగా, తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు మల్లేషన్న. లక్కపిడతల గదిలోకి రాక్షసాకారం దూరినట్టుంది.

రాములు పని ఆపి ఇటు తిరిగాడు. “అన్నా, ఇలా వచ్చావ్? కూచో” అంటూ గదిలో ఉన్న ఒక్క రేకు కుర్చీ అటు జరిపాడు.

మల్లేషన్న కూర్చున్నాడు. అతని మొహం రాయిలాగా గరుగ్గా ఉంది. వేసుకున్న తెల్లచొక్కా బానపొట్ట మొదలయ్యేదాకా బొత్తాలు విప్పి వుంది. అక్కడ రుద్రాక్షమాల వేలాడుతోంది. మణికట్టుకి కాశీతాడు, కడియాలు ఉన్నాయి.

“చికెను పీసులున్నయి తింటవా?” అన్నాడు రాములు.

“బాలాజీ…
పూర్తిగా »

ఒల్వేరా స్ట్రీట్ పిచ్చికవి

ఒల్వేరా స్ట్రీట్ పిచ్చికవి

అమెరికా. ఒల్వేరా స్ట్రీట్. శిథిలావస్థలో ఉన్న మెట్రో ప్లాజా లాడ్జ్. గది నెంబర్ 404. పగిలిన అద్దాల కిటికీ. కొన్ని వందల సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అతను దాని గుండా చూసాడు. అలసిపోవడం తెలీని “సన్ డయల్” అతనికి బాగా తెలుసు. చిరువ్యాపారిగా జీవితం మొదలుపెట్టి ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి వచ్చిన వారినీ అతడెరుగును. ఆనందంతో ఆ వీధి గుండా చక్కర్లు కొట్టే యువతీయువకులు అతనికి తెలుసు. విషాదంతో ఆ వీధి చీకటిని పంచుకునేవాళ్ళు అతనికి తెలుసు. మౌనం అతని భాష.ఎవడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాడు? – లాంటి వివరాలు (ఖచ్చితంగా) చెదపురుగులు తినగా మిగిలిన రిజిస్టర్లకే తెలుసు. ఆ…
పూర్తిగా »

సందర్శనం

మార్చి 2016


సందర్శనం

వనస్థలి నుండి వరగల వరకు వెళ్లిరావాలి పిల్లల్తో. సరస్వతిని కలుస్తానని మాటిచ్చినందుకు… చిన్నప్పట్నుంచీ స్కూల్లో వున్నప్పట్నుంచీ సరస్వతంటే యెంత ఆహ్లాదాభిమాన ఆరాధనాత్మీయతలో! సరస్వతాంటీని మేమూ చూస్తాం నాన్నా… వాణీ వేణుల విన్నపాలు. అర్ధాంగి శ్రీలక్ష్మి యెట్లాగూ వస్తుంది. ఆమె లేకుండా ప్రయాణమెట్లా?!.. కార్లో పెట్రోలు పోయించటానికి వుండాలి కదా ఆమె….
పూర్తిగా »